MS Dhoni: ధోని చేతికి చెన్నై సూపర్ కింగ్స్ పగ్గాలు.. కెప్టెన్సీ వదులుకున్న రవీంద్ర జడేజా..
CSK Captain: చెన్నై సూపర్ కింగ్స్(CSK) పగ్గాలు మళ్లీ ఎంఎస్ ధోని(MS Dhoni)కి అప్పగిస్తున్నట్లు సీఎస్‌కే యాజమాన్యం ప్రకటించింది...
చెన్నై సూపర్ కింగ్స్(CSK) పగ్గాలు మళ్లీ ఎంఎస్ ధోని(MS Dhoni)కి అప్పగిస్తున్నట్లు సీఎస్‌కే యాజమాన్యం ప్రకటించింది. ఈ ఐపీఎల్ 2022 ముందు ధోని కెప్టెన్సీ వదులుకోవడంతో కెప్టెన్సీని రవీంద్ర జడేజా(Jadeja)కు అప్పగించారు. అయితే జడేజా కెప్టెన్సీలో జట్టు ఈ సీజన్‌లో విఫలమవుతుంది. దీంతో “రవీంద్ర జడేజా తన ఆటపై ఎక్కువ దృష్టి పెట్టడానికి కెప్టెన్సీని వదులుకోవాలని నిర్ణయించుకున్నాడు. CSKకి నాయకత్వం వహించమని MS ధోనిని అభ్యర్థించాడు. MS ధోని CSKకి నాయకత్వం వహించడానికి అంగీకరించడంతో యాజమాన్యం ప్రకటన చేసింది. CSK ప్రస్తుతం 8 మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో IPL 2022 పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. CSK ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడుతుంది.
Jadeja to handover CSK captaincy back to MS Dhoni:Ravindra Jadeja has decided to relinquish captaincy to focus and concentrate more on his game & has requested MS Dhoni to lead CSK. MS Dhoni has accepted to lead CSK in the larger interest & to allow Jadeja to focus on his game.
— Chennai Super Kings (@ChennaiIPL) April 30, 2022