Team India: 3 ఫార్మాట్లలో నా స్థానాన్ని ధోనీ ఆక్రమించాడు.. 18 ఏళ్ల తర్వాత భారత స్టార్ క్రికెటర్ ఆవేదన..

MS Dhoni: ధోనీ భారత అత్యుత్తమ వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మెన్. కానీ, ధోనీ ఎంట్రీతో మరో స్టార్ ప్లేయర్ ఎక్కువగా అవకాశాలు అందుకోలేకపోయాడు.

Team India: 3 ఫార్మాట్లలో నా స్థానాన్ని ధోనీ ఆక్రమించాడు.. 18 ఏళ్ల తర్వాత భారత స్టార్ క్రికెటర్ ఆవేదన..
Ms Dhoni
Follow us
Venkata Chari

|

Updated on: Feb 28, 2023 | 4:15 PM

MS Dhoni vs Dinesh Karthik: భారత క్రికెట్ ప్రపంచంలో మహేంద్ర సింగ్ ధోనీ ఎదుగుదలకు చాలా ప్రత్యేక స్థానం ఉంది. ధోని టీమిండియా అత్యుత్తమ కెప్టెన్‌లలో ఒకడు మాత్రమే కాదు, ఒక చిన్న పట్టణం నుంచి వచ్చినా కూడా క్రికెట్ ప్రపంచంలోనే తనదైన ముద్ద వేశాడు. అయితే ధోని వల్ల మెరుగ్గా మెరవలేకపోయిన స్టార్ కూడా ఉన్నాడు. ఆయనెవరో కాదు దినేష్ కార్తీక్. మూడు ఫార్మాట్లలో ధోనీ తన స్థానాన్ని భర్తీ చేసినట్లు కార్తీక్ స్వయంగా అంగీకరించాడు.

దినేష్ కార్తీక్ 2004లో టీం ఇండియా తరపున టెస్టు, వన్డేల్లో అరంగేట్రం చేశాడు. అయితే, కొన్ని నెలల్లోనే ధోనీ అతని స్థానాన్ని రెండు ఫార్మాట్లలో భర్తీ చేశాడు. అరంగేట్రం గురించి కార్తీక్ మాట్లాడుతూ.. ‘ధోనీ కంటే ముందే నేను అరంగేట్రం చేశాను. ఇండియా ఏ టూర్‌లో మేమిద్దరం కలిసి ఉన్నాం. మొదటి జాతీయ జట్టుకు ఎంపికయ్యాను. ఆ సమయంలో కూడా ధోనీ ఇండియా ఏ జట్టుతో ఉన్నాడు.

కార్తీక్ మాట్లాడుతూ, “ధోనితో ఆడే అవకాశం నాకు అదే మొదటిసారి. ఆ నాలుగు రోజుల మ్యాచ్‌లో నేను బాగా ఆడటంతో సెలెక్టర్లు నాకు జట్టులో చోటు కల్పించారు. అయితే ఆ తర్వాత వన్డే టోర్నీలో ధోనీ అద్భుతం చేశాడు. అందరూ ధోని గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ధోనీ లాంటి వారు ఎవరూ లేరని అందరూ అనడం మొదలుపెట్టారు. అందుకే ధోనీ చాలా ప్రత్యేకంగా నిలిచాడు’ అంటూ చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

అవకాశాలను అందిపుచ్చుకున్న ధోనీ..

వచ్చిన దాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటామన్నదే ముఖ్యమని కార్తీక్ చెప్పుకొచ్చాడు. కార్తీక్ మాట్లాడుతూ.. ‘ధోనీ మళ్లీ వెనుదిరిగి చూడలేదు. మూడు ఫార్మాట్లలో ధోనీ నా స్థానంలో ఉన్నాడు. అతను భారతదేశానికి అద్భుతాలు చేశాడు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి’ అంటూ కార్తీక్ పేర్కొన్నాడు.

2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు ధోనీ వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అయితే గత ఏడాది భారత్ ఆడిన టీ20 ప్రపంచకప్‌లో దినేష్ కార్తీక్ చోటు దక్కించుకున్నాడు. అయితే ఇప్పుడు కార్తీక్ మళ్లీ టీమిండియాలోకి వచ్చే అవకాశం లేదు. కానీ, కార్తీక్ ప్రస్తుతానికి RCB కోసం IPL ఆడుతున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే