Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asia Cup : బీసీసీఐ హెచ్చరికకు వణికిపోయిన పీసీబీ ఛైర్మన్.. ఐసీసీ మీటింగ్‌కు మొహ్సిన్ నఖ్వీ డుమ్మా

భారతదేశం ఆసియా కప్ 2025 విజేతగా నిలిచి నెల రోజులు దాటినా.. ఇప్పటివరకు టీమిండియాకు కప్ దక్కలేదు. ఈ విషయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ ఛైర్మన్, ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఛైర్మన్ అయిన మొహ్సిన్ నఖ్వీ తీరు వివాదాస్పదంగా మారింది. భారత్ తరఫున బీసీసీఐ కప్ ఇవ్వాలని పదేపదే లేఖ రాసినా నఖ్వీ పట్టించుకోవట్లేదు.

Asia Cup : బీసీసీఐ హెచ్చరికకు వణికిపోయిన పీసీబీ ఛైర్మన్.. ఐసీసీ మీటింగ్‌కు మొహ్సిన్ నఖ్వీ డుమ్మా
Mohsin Naqvi
Lohith Kumar
|

Updated on: Nov 04, 2025 | 5:26 PM

Share

Asia Cup : భారతదేశం ఆసియా కప్ 2025 విజేతగా నిలిచి నెల రోజులు దాటినా.. ఇప్పటివరకు టీమిండియాకు కప్ దక్కలేదు. ఈ విషయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ ఛైర్మన్, ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఛైర్మన్ అయిన మొహ్సిన్ నఖ్వీ తీరు వివాదాస్పదంగా మారింది. భారత్ తరఫున బీసీసీఐ కప్ ఇవ్వాలని పదేపదే లేఖ రాసినా నఖ్వీ పట్టించుకోవట్లేదు. ఈ సమస్య ఇప్పుడు దుబాయ్‌లో జరుగుతున్న ఐసీసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు మీటింగ్‌లో చర్చకు రానుంది. అయితే, ఈ మీటింగ్‌కు నఖ్వీ గైర్హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. బీసీసీఐ హెచ్చరికకు భయపడే ఆయన సమావేశాన్ని తప్పించుకుంటున్నారా అనే చర్చ జరుగుతోంది.

ప్రస్తుతం దుబాయ్‌లో ఐసీసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశాలు జరుగుతున్నాయి. ఈ కీలక సమావేశాలకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఛైర్మన్ అయిన మొహ్సిన్ నఖ్వీ హాజరు కావడం కష్టమని తెలుస్తోంది. దేశీయ రాజకీయ సమస్యల కారణంగానే నఖ్వీ దుబాయ్‌కు రాలేకపోతున్నారని పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఈ సమావేశంలో బీసీసీఐ ఆసియా కప్ ట్రోఫీ అప్పగించడంలో ఆలస్యంపై అంశాన్ని లేవనెత్తే అవకాశం ఉంది. దీని వలన నఖ్వీపై ఒత్తిడి పెరగవచ్చని భావిస్తున్నారు.

నఖ్వీ స్థానంలో బోర్డు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుమైర్ సయ్యద్ ముఖ్య కార్యనిర్వహణ అధికారుల సమావేశంలో పాల్గొంటారు. నవంబర్ 7న జరగబోయే కీలక బోర్డు మీటింగ్‌లో కూడా సయ్యద్ పాకిస్తాన్ తరఫున ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉంది. నఖ్వీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొనే ఛాన్స్ కూడా ఉంది. సెప్టెంబర్ చివరి వారంలో ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్ జరిగింది, కానీ కప్ మాత్రం ఇంకా విజేతలైన టీమిండియాకు అందలేదు. ఆసియా కప్ ఫైనల్ ముగిసిన నెల రోజులు దాటినా, ట్రోఫీ ఇప్పటికీ దుబాయ్‌లోని ఏసీసీ ప్రధాన కార్యాలయంలో లాక్ చేసి ఉంది. ట్రోఫీని వెంటనే ముంబైకి పంపించాలని బీసీసీఐ, ఏసీసీకి లేఖ రాసింది.

అయితే, నఖ్వీ మాత్రం బీసీసీఐ ప్రతినిధికి లేదా భారత జట్టు సభ్యుడికి తానే స్వయంగా కప్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. అందుకే కప్ అప్పగించడంలో ఆలస్యం జరుగుతోంది. ఫైనల్ మ్యాచ్ అనంతరం భారత ఆటగాళ్లు నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించడానికి నిరాకరించడం ఈ వివాదానికి మూల కారణం. నఖ్వీ భారత్ వ్యతిరేక ప్రకటనలు చేశారనే కారణంతో టీమిండియా ఆటగాళ్లు ఫైనల్ తర్వాత ఆయన చేతుల మీదుగా కప్ అందుకోవడానికి నిరాకరించినట్లు తెలుస్తోంది.

ఈ కారణంగానే మొహ్సిన్ నఖ్వీపై చర్యలు తీసుకోవాలని బీసీసీఐ ఐసీసీ సమావేశంలో డిమాండ్ చేసే అవకాశం ఉంది. గతంలో జై షా ఐసీసీ ఛైర్మన్‌గా ఎన్నికైనప్పటి నుంచి నఖ్వీ ఏ ఐసీసీ మీటింగ్‌లోనూ పాల్గొనలేదు. నఖ్వీ పాకిస్తాన్‌లో హోం మంత్రిగా కూడా ఉన్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..