Mohammed Shami: శభాష్ షమీ భయ్యా.. లోయలో పడిపోయిన వ్యక్తిని కాపాడిన టీమిండియా స్టార్ పేసర్.. వీడియో
క్రికెట్ సంగతి పక్కన పెడితే.. వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న షమీ చాలా నిరాడంబరంగా ఉంటాడు. ఆపదలో ఉన్న వారికి తన వంతు సాయం చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ పేసర్ షమీ తన గొప్ప మనసును చాటుకున్నాడు. ఆపదలో ఉన్న ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడాడు.

ఇటీవల ముగిసిన ప్రపంచకప్‌లో భారత స్టార్ బౌలర్ మహ్మద్ షమీ అద్భుత ప్రదర్శన చేశాడు. తన సీమ్ బౌలింగ్‌తో ప్రత్యర్థులను హడలెత్తించాడు. కేవలం 7 మ్యాచ్‌ల్లో 24 వికెట్లు పడగొట్టి ప్రపంచ కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. క్రికెట్ సంగతి పక్కన పెడితే.. వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న షమీ చాలా నిరాడంబరంగా ఉంటాడు. ఆపదలో ఉన్న వారికి తన వంతు సాయం చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ పేసర్ షమీ తన గొప్ప మనసును చాటుకున్నాడు. ఆపదలో ఉన్న ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడాడు. వివరాల్లోకి వెళితే.. ప్రపంచ కప్ అలసటను పోగొట్టుకునేందుకు షమీ శనివారం అర్ధ రాత్రి ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌కు వెళ్లాడు. అయితే మార్గమధ్యంలో తన ముందు వెళ్తున్న ఓ కారు కొండపై నుంచి లోయలోకి దూసుకు వెళ్లింది. ఈ క్రమంలో షమీ వెంటనే తన కారును ఆపి.. కొంతమంది సాయంతో కారులో నున్న వ్యక్తిని సకాలంలో సురక్షితంగా బయటకు తీశాడు. తద్వారా అతనికి పునర్జన్మను ఇచ్చాడు.
ప్రమాదానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు మహ్మద్ షమీ. “అతను చాలా అదృష్టవంతుడు. భగవంతుడు అతనికి రెండో జీవితాన్నిప్రసాదించాడు. నేను నైనిటాల్‌కు వెళ్తుండగా కొండ రహదారిపై నా ముందు వెళ్తున్న ఓ కారు ప్రమాదవశాత్తూ లోయలో పడిపోయింది. వెంటనే నా కారుని ఆపి కొంత మంది సాయంతో అతడిని సురక్షితంగా బయటకు తీశాం’ అని తన వీడియోకు క్యాప్షన్ రాసుకొచ్చాడీ టీమిండియా పేసర్. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. క్రికెట్ అభిమానులు, నెటిజన్లు షమీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘మీరు రియల్ హీరో’, ‘మీరు నిజంగా చాలా గ్రేట్’ అంటూ నెట్టింట కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
షమీ షేర్ చేసిన వీడియో..
View this post on Instagram
కాగా టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గాయపడటంతో మహ్మద్ షమీకి ప్రపంచకప్‌లో ఆడే అవకాశం లభించింది. ఏడు మ్యాచ్‌ల్లో మూడింటిలో మూడుసార్లు ఐదు వికెట్లకు పైగా తీశాడు. సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై ఏడు వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్ గా ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.
కేంద్ర మంత్రి అమిత్ షా తో షమీ..
View this post on Instagram
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..