AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025: హైదరాబాద్ కొంప ముంచిన ఆ ఒక్క ఓవర్.. ఐపీఎల్ హిస్టరీలోనే చెత్త బౌలింగ్ రికార్డ్

పంజాబ్ కింగ్స్ ఓపెనర్లు దూకుడుగా ఆడారు. ప్రభ్ సిమ్రాన్ సింగ్, ప్రియాంష్ ఆర్య జోడీ హైదరాబాద్ బౌలింగ్‌ను చిత్తు చేశారు. వీరిద్దరు ఔట్ అయిన తర్వాత జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 82 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అయ్యర్ నిష్క్రమించిన తర్వాత, మార్కస్ స్టోయినిస్ బీభత్సం చేశాడు. మహమ్మద్ షమీ బౌలింగ్‌లో వరుసగా 4 సిక్సర్లు కొట్టి ఇన్నింగ్స్‌ను ముగించాడు.

IPL 2025: హైదరాబాద్ కొంప ముంచిన ఆ ఒక్క ఓవర్.. ఐపీఎల్ హిస్టరీలోనే చెత్త బౌలింగ్ రికార్డ్
Sunrisers Hyderabad Vs Punjab Kings Shami Records
Follow us
Venkata Chari

|

Updated on: Apr 12, 2025 | 10:45 PM

ఐపీఎల్ 2025 మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ బ్యాట్స్‌మెన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) పేసర్ మహమ్మద్ షమీకి బ్లాక్ డేగా మారింది. ఈ మ్యాచ్‌లో షమీ తేలిపోయాడు. పంజాబ్ కింగ్స్ బ్యాట్స్‌మెన్స్ షమీ బౌలింగ్‌లో విధ్వంసం చేశారు. దీంతో ఐపీఎల్ చరిత్రలో ఓ చెత్త రికార్డ్ నెలకొల్పాడు.

పంజాబ్ కింగ్స్ బ్యాటర్ల ఊచకోతతో షమీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో రెండవ చెత్త గణాంకాలను నమోదు చేశాడు. పంజాబ్ కింగ్స్ చేసిన మొత్తం 245 పరుగుల్లో షమీ తన 4 ఓవర్లలో 75 పరుగులు సమర్పించుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ పేసర్ జోఫ్రా ఆర్చర్ హైదరాబాద్‌పై 76 పరుగులు చేసి అత్యంత చెత్త గణాంకాలను నమోదు చేశాడు.

ఐపీఎల్‌లో చెత్త బౌలింగ్ గణాంకాలు..

బౌలర్ ఇచ్చిన పరుగులు ప్రత్యర్థి
జోఫ్రా ఆర్చర్ 76 హైదరాబాద్
మహమ్మద్ షమీ 75 పంజాబ్
మోహిత్ శర్మ 73 ఢిల్లీ
బాసిల్ తంపి 70 బెంగళూరు
యష్ దయాళ్ 69 కోల్‌కతా

టోర్నమెంట్ ప్రారంభంలో, జోఫ్రా ఆర్చర్ SRH పై 0/76 గణాంకాలతో చెత్త రికార్డ్ నెలకొల్పాడు. ఇది IPL లో అత్యంత చెత్త గణాంకాలుగా మారిపోయింది. ఈ క్రమంలో షమీ వికెట్లు పడగొట్టకుండా 75 పరుగులు ఇచ్చి ఆ రికార్డును దాదాపుగా బద్దలు కొట్టాడు.

ఐపీఎల్‌లో చెత్త బౌలింగ్ గణాంకాల జాబితాలో మోహిత్ శర్మ , బాసిల్ తంపి, యష్ దయాల్ ఈ చెత్త రికార్డుల్లో మరో ముగ్గురు బౌలర్లు స్థానం సంపాదించుకున్నారు.

పంజాబ్ భారీ స్కోర్..

పంజాబ్ కింగ్స్ ఓపెనర్లు దూకుడుగా ఆడారు. ప్రభ్ సిమ్రాన్ సింగ్, ప్రియాంష్ ఆర్య జోడీ హైదరాబాద్ బౌలింగ్‌ను చిత్తు చేశారు. వీరిద్దరు ఔట్ అయిన తర్వాత జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 82 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అయ్యర్ నిష్క్రమించిన తర్వాత, మార్కస్ స్టోయినిస్ బీభత్సం చేశాడు. మహమ్మద్ షమీ బౌలింగ్‌లో వరుసగా 4 సిక్సర్లు కొట్టి ఇన్నింగ్స్‌ను హై నోట్‌తో ముగించాడు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అయోధ్య రామాలయంలో ధ్వజస్తంభం ప్రతిష్టాపన.. ఎత్తు ఎంతో తెలిస్తే..
అయోధ్య రామాలయంలో ధ్వజస్తంభం ప్రతిష్టాపన.. ఎత్తు ఎంతో తెలిస్తే..
ఢిల్లీ ఆశలను దెబ్బ తీసిన కేకేఆర్.. టాప్-4లో కీలక మార్పులు
ఢిల్లీ ఆశలను దెబ్బ తీసిన కేకేఆర్.. టాప్-4లో కీలక మార్పులు
థియేటర్‏లో అట్టర్ ప్లాప్.. ఓటీటీలో రచ్చ చేస్తున్న రొమాంటిక్ మూవీ.
థియేటర్‏లో అట్టర్ ప్లాప్.. ఓటీటీలో రచ్చ చేస్తున్న రొమాంటిక్ మూవీ.
ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్..
ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్..
ఐపీఎల్ 2025 మధ్యలో షాకింగ్ న్యూస్.. మరణించిన 34 ఏళ్ల ప్లేయర్..
ఐపీఎల్ 2025 మధ్యలో షాకింగ్ న్యూస్.. మరణించిన 34 ఏళ్ల ప్లేయర్..
శ్రీతేజ్ పూర్తిగా కోలకున్నాడా..? హెల్త్‌ బులిటెన్‌‌లో ఏముందంటే..?
శ్రీతేజ్ పూర్తిగా కోలకున్నాడా..? హెల్త్‌ బులిటెన్‌‌లో ఏముందంటే..?
అక్షయ తృతీయ రోజు షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
అక్షయ తృతీయ రోజు షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
అప్పన్న సన్నిధిలో భారీ వర్షానికి గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి
అప్పన్న సన్నిధిలో భారీ వర్షానికి గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి
మరికాసేపట్లోనే పదో తరగతి పబ్లిక్ పరీక్షల 2025 ఫలితాలు విడుదల..
మరికాసేపట్లోనే పదో తరగతి పబ్లిక్ పరీక్షల 2025 ఫలితాలు విడుదల..
Horoscope Today: ఆర్థికంగా వారికి ఢోకా ఉండదు..
Horoscope Today: ఆర్థికంగా వారికి ఢోకా ఉండదు..