AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL Mega Auction 2025: వేలంలో అందరి ధరను పెంచిన ఈ బిజినెస్ మ్యాగ్నెట్ గురించి మీకు తెలుసా?

ఈ ఏడాది ఐపీఎల్ 2025 మెగా వేలం జట్ల మధ్య తీవ్రమైన పోటీకి అద్దం పట్టింది. శ్రేయాస్ అయ్యర్ రూ.26.75 కోట్లతో పంజాబ్ కింగ్స్‌కి చేరడం, రిషబ్ పంత్ రూ.27 కోట్ల భారీ డీల్‌తో చరిత్ర సృష్టించడం ప్రధాన హైలైట్లు. కిరణ్ కుమార్ గ్రాంధి వంటి ప్రముఖులు తెరవెనుక కీలక పాత్ర పోషిస్తూ క్రికెట్, మౌలిక సదుపాయాలకు తమదైన ముద్ర వేశారు.

IPL Mega Auction 2025: వేలంలో అందరి ధరను పెంచిన ఈ బిజినెస్ మ్యాగ్నెట్ గురించి మీకు తెలుసా?
Delhi Capitals Owner
Narsimha
|

Updated on: Nov 26, 2024 | 8:17 PM

Share

ఈ ఏడాది ఐపీఎల్ 2025 మెగా వేలం రికార్డులతో పాటు కొత్త ప్రమాణాలను నెలకొల్పిన నాటకీయ సంఘటనల మేళవింపుగా నిలిచంది. ముఖ్యంగా ప్రీతి జింటా నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్ (PBKS), ఢిల్లీ క్యాపిటల్స్‌కు చెందిన కిరణ్ కుమార్ గ్రాంధిని వేలంలో ప్రధాన ఆకర్షణ గా నిలిచారు. శ్రేయాస్ అయ్యర్‌ను రూ.26.75 కోట్లతో, రిషబ్ పంత్ రూ.27 కోట్లతో కొత్త రికార్డు నెలకొల్పారు. ఈ ఒప్పందంతో పంత్ ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. వేలంలో జరిగిన ఈ అనూహ్య పోరాటం లీగ్‌లో అగ్రస్థానంలో నిలిచేందుకు జట్ల మధ్య ఉన్న గట్టి పోటీని స్పష్టం చేసింది.

ఈ సంవత్సరం వేలం కేవలం ఆటగాళ్ల కొనుగోళ్లకు మాత్రమే పరిమితం కాలేదు. ఇది జట్ల మధ్య ఉన్న తీవ్ర పోటీ, ఐపీఎల్ ఆర్థిక వ్యవస్థలో నిరంతర విస్తరణకు అద్దం పట్టింది. శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ వంటి పెద్ద డీల్‌లు ఈ వేలంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రతి జట్టు తమ వ్యూహాలతో లీగ్‌లో విజయం సాధించేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టమవుతుంది.

ఇక వేలం తెర వెనుక ఆసక్తికరమైన పాత్ర పోషించిన వ్యక్తి కిరణ్ కుమార్ గ్రాంధి. ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని, GMR గ్రూప్ కీలక సభ్యుడిగా, ఆయన క్రీడా రంగంలో తన ముద్రను మరింతగా చాటారు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నిర్మాణం, అభివృద్ధిలో ఆయనే ప్రధాన శక్తిగా నిలిచారు. 1,200 కిలోమీటర్ల హైవే నిర్వహణ నుండి జట్టు ప్రగతికి దారి చూపించడం వరకు, మౌలిక సదుపాయాలుతో సహా క్రీడలను అనుసంధానిస్తూ ఆయా రంగాల్లో తన మార్క్ చూపించారు.

ఇక కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) విడుదల చేసిన తర్వాత శ్రేయాస్ అయ్యర్ వేలంలో ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. వెన్నునొప్పితో 2023 సీజన్‌కు దూరంగా ఉన్నప్పటికీ, 2024లో తన నాయకత్వంతో KKRకు మూడో ఐపీఎల్ టైటిల్ అందించాడు. డీల్ ప్రారంభంలో 2022లో KKRకి రూ.12.25 కోట్లతో చేరిన అయ్యర్, ఢిల్లీ క్యాపిటల్స్ (DC)తో ఏడేళ్ల విజయవంతమైన కెరీర్‌కు ముగింపు పలికాడు. 2018లో గౌతమ్ గంభీర్ స్థానంలో కెప్టెన్‌గా నియమితుడైన అయ్యర్, ఢిల్లీ జట్టును కొత్త ఒరవడిలో నడిపాడు.

ఇక మరో అద్భుతమైన వేలం రికార్డును రిషబ్ పంత్ సృష్టించాడు. లక్నో సూపర్ జెయింట్స్ (LSG) కోసం రూ.27 కోట్ల భారీ డీల్‌తో ఆయన ఐపీఎల్ చరిత్రలో అత్యధిక విలువ కలిగిన ఆటగాడిగా నిలిచాడు. ఈ డీల్‌లు ఐపీఎల్ ఆర్థిక ప్రభావాన్ని స్పష్టం చేస్తూనే, మార్కీ ఆటగాళ్లను తమ జట్లలోకి చేర్చుకోవడంలో ఫ్రాంచైజీల సంసిద్దతను చాటాయి.