AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20I rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ విడుదల.. మూడో స్థానంలో నిలిచిన దక్షిణాఫ్రికా ఆటగాడు మాక్రమ్..

దక్షిణాఫ్రికా ఆటగాడు ఐడెన్ మాక్రమ్ తాజా ఐసీసీ పురుషుల టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్-5లో చోటు దక్కించుకున్నాడు. తాజా ఎంఆర్ఎఫ్ టై‎ర్స్ టీ 20 ర్యాకింగ్స్‎లో మూడో స్థానం లో నిలిచాడు...

T20I rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ విడుదల.. మూడో స్థానంలో నిలిచిన దక్షిణాఫ్రికా ఆటగాడు మాక్రమ్..
Makram
Srinivas Chekkilla
|

Updated on: Nov 10, 2021 | 5:28 PM

Share

దక్షిణాఫ్రికా ఆటగాడు ఐడెన్ మాక్రమ్ తాజా ఐసీసీ పురుషుల టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్-5లో చోటు దక్కించుకున్నాడు. తాజా ఎంఆర్ఎఫ్ టై‎ర్స్ టీ 20 ర్యాకింగ్స్‎లో మూడో స్థానం లో నిలిచాడు. టీ20 వరల్డ కప్ 2021 గ్రూప్-1 అగ్రస్థానంలో ఉన్న ఇంగ్లాండ్‌పై దక్షిణాఫ్రికా విజయం సాధించడంలో మాక్రమ్ కీలక పాత్ర పోషించాడు. కేవలం 25 బంతుల్లో 52 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇంతకు ముందు ఏడో స్థానంలో ఉన్న అతడు ఏడు స్థానాలు ఎగబాకి మూడో ర్యాంక్ దక్కించుకున్నాడు.

దక్షిణాఫ్రికాకు చెందిన మరో ఆటగాడు రాస్సీ వాన్ డెర్ డుస్సెన్ కూడా టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. అతను ఆరు స్థానాలు ఎగబాకి10వ స్థానంలో నిలిచాడు. వాన్ డెర్ డస్సెన్ ఇంగ్లండ్‌పై 94 పరుగులతో నాటౌట్‎గా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. మాక్రమ్, వాన్ డెర్ డస్సెన్ రాణించడంతో ప్రోటీస్ 189 పరుగుల భారీ స్కోరును నమోదు చేసి 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. దురదృష్టవశాత్తు దక్షిణాఫ్రికా నెట్ రన్ రేట్ తక్కువగా ఉండడంతో సెమీస్‎కు వెళ్లలేకపోయారు.

భారత్ ఆటగాడు కేఎల్ రాహుల్ మూడు మ్యాచ్‌ల్లో మూడు అర్ధసెంచరీలతో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో 5వ స్థానంలో నిలిచాడు. పాకిస్తాన్, న్యూజిలాండ్‌లపై తక్కువ స్కోర్లు చేసిన అతను ఆఫ్ఘనిస్తాన్, స్కాట్లాండ్, నమీబియాపై అద్భుతంగా ఆడాడు. అయితే ఈ టీ20 వరల్డ్ కప్‎లో ఇండియా నాకౌట్ చేరకుండానే ఇంటిముఖం పట్టింది. బ్యాటింగ్‎ ర్యాంకిగ్స్‎లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమ్ టాప్-1లో కొనసాగుతున్నాడు.

బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియన్ ద్వయం ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్ టాప్ 5,8 ర్యాంకిగ్స్‎లో ఉన్నారు. ఇద్దరు బౌలర్లు గొప్ప ఫామ్‌లో ఉన్నారు. ఆస్ట్రేలియా ప్రపంచ కప్‌లో సెమీ-ఫైనల్‌కు అర్హత సాధించడంలో కీలక పాత్ర పోషించారు. శ్రీలంక బౌలర్ హసరంగ టాప్-1లో కొనసాగుతున్నాడు. కివీస్ బౌలర్ టీమ్ సౌథీ మూడు స్థానాలు ఎగబాకి 9 స్థానంలో నిలిచాడు. ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో గ్లెన్ మాక్స్‌వెల్ మూడు స్థానాలు ఎగబాకి 4వ స్థానంలో, మిచెల్ మార్ష్ ఐదు స్థానాలు మెరుగై 9వ స్థానంలో ఉన్నారు. ఆఫ్ఘానిస్తాన్ కెప్టెన్ నబి టాప్-1లో కొనసాగుతున్నాడు.

Read Also.. India vs New Zealand: భారత్ వర్సెస్ కివీస్ టీ20 మ్యాచ్ చూడాలంటే అది తప్పనిసరి.. రేపటి నుంచే టికెట్ల సేల్.. ధరలు ఎలా ఉన్నాయంటే?