E‍NG vs NZ Highlights, T20 World Cup 2021: న్యూజిలాండ్ గ్రాండ్ విక్టరీ.. పోరాడి గెలిచిన కివీస్..

| Edited By: Rajeev Rayala

Updated on: Nov 10, 2021 | 11:23 PM

England vs New Zealand Highlights in Telugu: టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. దీంతో న్యూజిలాండ్ ముందు 167 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

E‍NG vs NZ  Highlights, T20 World Cup 2021:  న్యూజిలాండ్ గ్రాండ్ విక్టరీ.. పోరాడి గెలిచిన కివీస్..
E Ng Vs Nz Live Score, T20 World Cup 2021

England vs New Zealand Live Score in Telugu:టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. దీంతో న్యూజిలాండ్ ముందు 167 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2021 సెమీ-ఫైనల్స్ తొలి పోరులో అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో కేన్ విలియమ్సన్ నేతృత్వంలోని న్యూజిలాండ్ జట్టు వన్డే ఫార్మాట్‌లో ప్రపంచ ఛాంపియన్ ఇయాన్ మోర్గాన్ కెప్టెన్‌గా ఉన్న ఇంగ్లండ్ క్రికెట్ జట్టుతో తలపడనుంది. 2019 వన్డే ప్రపంచకప్‌లో ఈ రెండు జట్లు ఫైనల్‌లో తలపడ్డాయి. ఇంగ్లండ్ జట్టు, టైటిల్ కోసం బలమైన పోటీదారుగా ఉంది. అయితే గాయపడిన ఆటగాళ్ల సమస్యతో ఇబ్బందిపడుతోంది. కొద్దిమంది ప్రముఖ ఆటగాళ్ల సహాయంతో న్యూజిలాండ్‌పై ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నిస్తుంది. టోర్నమెంట్‌కు ముందే ఇంగ్లండ్‌ను టైటిల్ పోటీదారులుగా పరిగణించారు.

ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): జోస్ బట్లర్(కీపర్), జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, మొయిన్ అలీ, ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), సామ్ బిల్లింగ్స్, లియామ్ లివింగ్‌స్టోన్, క్రిస్ వోక్స్, క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్

న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): మార్టిన్ గప్టిల్, డారిల్ మిచెల్, కేన్ విలియమ్సన్(కెప్టెన్), డెవాన్ కాన్వే(కీపర్), గ్లెన్ ఫిలిప్స్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, ఆడమ్ మిల్నే, టిమ్ సౌతీ, ఇష్ సోధి, ట్రెంట్ బౌల్ట్

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 10 Nov 2021 11:04 PM (IST)

    న్యూజిలాండ్ గ్రాండ్ విక్టరీ

    ఇంగ్లాండ్ పై జరిగిన హోరాహోరీ మ్యాచ్ లో న్యూజిలాండ్ విజయం సాధించింది.

  • 10 Nov 2021 11:03 PM (IST)

    ఇంగ్లాండ్ ను చిత్తు చేసిన న్యూజిలాండ్

    ఇంగ్లాండ్ పై విజయం సాధించిన న్యూజిలాండ్..

  • 10 Nov 2021 11:01 PM (IST)

    చెలరేగుతున్న మిచెల్

    చెలరేగుతున్న మిచెల్ ..38 బంతులకు 46 పరుగులతో న్యూజిలాండ్ ను విజయం వైపు నడిపిస్తున్న మిచెల్

  • 10 Nov 2021 10:57 PM (IST)

    ఐదో వికెట్ కోల్పోయిన కివీస్

    పీకల్లోతు కష్టల్లో న్యూజిలాండ్ ఐదో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్..  న్యూజిలాండ్ స్కోర్ 147/5

  • 10 Nov 2021 10:41 PM (IST)

    నాలుగో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్

    కష్టాల్లో న్యూజిలాండ్ .. నాలుగో వికెట్ కోల్పోయిన కివీస్.. గ్లేన్ ఫిలిప్స్ (2) పరుగులకు అవుట్ అయ్యాడు.

  • 10 Nov 2021 10:31 PM (IST)

    మూడో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్

    మూడో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్..కాన్వే 46 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు.

  • 10 Nov 2021 10:22 PM (IST)

    11 ఓవర్లో ఓ ఫోర్, ఓ సిక్స్..

    పదకొండో ఓవర్ లో కాన్వే తొలి బంతికి ఫోర్ బాదాడు.. అలాగే ఐదో బంతికి మిచెల్ సిక్స్ కొట్టాడు.. దాంతో స్కోర్ 73 కు చేరింది.

  • 10 Nov 2021 10:20 PM (IST)

    ఆచితూచి ఆడుతున్న న్యూజిలాండ్..

    పది ఓవర్లకు న్యూజిలాండ్ 58 పరుగులు చేసింది. కాన్వే (26), మిచెల్ (22) క్రీజ్ లో ఉన్నారు. ఇద్దరు ఆటగాళ్లు ఆచితూచి ఆడుతున్నారు.

  • 10 Nov 2021 10:12 PM (IST)

    టోర్నమెంట్‌లో 7-10 ఓవర్ల మధ్యలో న్యూజిలాండ్ పరుగులు

    18/2 vs Pak 39/0 vs Ind 18/1 vs Sco 19/1 vs Nam 16/1 vs Afg 22/0 vs Eng

  • 10 Nov 2021 10:10 PM (IST)

    10 ఓవర్లకు కివీస్ స్కోర్ 58/2

    10 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ టీం 2 వికెట్లు నష్టపోయి 58 పరుగులు సాధించింది. క్రీజులో మిచెల్ 22, కాన్వే 26 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. వీరిద్దరి భాగస్వామ్యం కూడా 45(44) పరుగులకు చేరుకుంది.

  • 10 Nov 2021 10:07 PM (IST)

    50పరుగులకు చేరిన కివీస్ స్కోర్

    166 పరుగుల లక్ష్యంతో ఛేజింగ్ చేస్తోన్న కివీస్ టీం 9 ఓవర్లు ముగిసే సరికి 2వికెట్లు కోల్పోయి 50 పరుగులు సాధిచింది. టాస్ గెలిచిన ఆనందం లేకుండా పోయిన న్యూజిలాండ్‌కు ఇంగ్లండ్ టీం భారీ టార్గెట్‌నే నిర్ధేశించింది.

  • 10 Nov 2021 10:00 PM (IST)

    8 ఓవర్లకు కివీస్ స్కోర్ 45/2

    8 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ టీం 2 వికెట్లు నష్టపోయి 45 పరుగులు సాధించింది. క్రీజులో మిచెల్ 18, కాన్వే 17 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 10 Nov 2021 09:57 PM (IST)

    7 ఓవర్లకు కివీస్ స్కోర్ 41/2

    7 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ టీం 2 వికెట్లు నష్టపోయి 41 పరుగులు సాధించింది. క్రీజులో మిచెల్ 16, కాన్వే 15 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 10 Nov 2021 09:56 PM (IST)

    ఇంగ్లండ్ పవర్ ప్లే బౌలింగ్

    31/4 vs WI (Won) 27/3 vs Ban (Won) 21/3 vs Aus (Won) 40/3 vs SL (Won) 40/1 vs SA (Lost) 36/2 vs NZ

  • 10 Nov 2021 09:50 PM (IST)

    5 ఓవర్లకు కివీస్ స్కోర్ 26/2

    5 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ టీం 2 వికెట్లు నష్టపోయి 26 పరుగులు సాధించింది. క్రీజులో మిచెల్ 11, కాన్వే 5 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 10 Nov 2021 09:37 PM (IST)

    రెండో వికెట్ డౌన్..

    వోక్స్ వేసిన 2.4 బంతికి కివీస్ కెప్టెన్ విలియమ్సన్ 5 పరుగుల వద్ద రషీద్‌కు క్యాచ్ ఇచ్చి రెండో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. దీంతో న్యూజిలాండ్ టీం 2.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 13 పరుగులు చేసింది.

  • 10 Nov 2021 09:26 PM (IST)

    తొలి వికెట్ డౌన్..

    వోక్స్ వేసిన బంతికి మార్టిన్ గుప్తిల్ 4 పరుగుల వద్ద మొయిన్ అలీకి క్యాచ్ ఇచ్చి తొలి ఓవర్‌లోనే తొలి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. దీంతో న్యూజిలాండ్ టీం 0.3 ఓవర్లలో వికెట్ కోల్పోయి 4 పరుగులు చేసింది.

  • 10 Nov 2021 09:16 PM (IST)

    న్యూజిలాండ్ టార్గెట్ 167

    టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. దీంతో న్యూజిలాండ్ ముందు 167 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

  • 10 Nov 2021 09:00 PM (IST)

    18 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్ 146/3

    18 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ టీం మూడు వికెట్లు నష్టపోయి 146 పరుగులు సాధించింది. క్రీజులో అలీ 43, లివింగ్ స్టోన్ 10 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 10 Nov 2021 08:49 PM (IST)

    మూడో వికెట్ డౌన్..

    ఇష్ సోధి వేసిన బంతికి డేవిడ్ మలాన్ (42 పరుగులు, 30 బంతులు, 4 ఫోర్లు, సిక్స్) కాన్వేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో ఇంగ్లండ్ టీం 15.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసింది.

  • 10 Nov 2021 08:40 PM (IST)

    14 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్ 100/2

    14 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ టీం రెండు వికెట్లు నష్టపోయి 100 పరుగులు సాధించింది. క్రీజులో అలీ 17, మలాన్ 34 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 10 Nov 2021 08:24 PM (IST)

    10 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్ 67/2

    పది ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ టీం రెండు వికెట్లు నష్టపోయి 67 పరుగులు సాధించింది. క్రీజులో అలీ 4, మలాన్ 15 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 10 Nov 2021 08:15 PM (IST)

    రెండో వికెట్ పడగొట్టిన సోధి

    ఇష్ సోధి వేసిన బంతికి బట్లర్(29 పరుగులు, 24 బంతులు, 4 ఫోర్లు) ఎల్బీగా పెవిలియన్ చేరాడు. దీంతో ఇంగ్లండ్ టీం 8.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 53 పరుగులు చేసంది.

  • 10 Nov 2021 08:05 PM (IST)

    పవర్ ప్లేలో న్యూజిలాండ్ బౌలింగ్

    30/1 v Pak 35/2 v Ind 48/1 v Sco 36/0 v Nam 23/3 v Afg 40/1 v Eng

  • 10 Nov 2021 08:00 PM (IST)

    తొలి వికెట్ డౌన్..

    మిల్నే వేసిన బంతికి జానీ బెయిర్‌‌స్టో(13 పరుగులు, 17 బంతులు, 2 ఫోర్లు) విలియమ్సన్‌కు క్యాచ్ ఇచ్చి తొలి వికెట్‌గా పెవిలియన్ చేరాడు.

  • 10 Nov 2021 07:51 PM (IST)

    4వ ఓవర్‌లో 16 పరుగులు..

    బౌల్ట్ వేసిన 4వ ఓవర్‌లో మూడు ఫోర్లతో మొత్తం 16 పరుగులు వచ్చాయి.

  • 10 Nov 2021 07:46 PM (IST)

    3 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్ 13/0

    మూడు ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ టీం వికెట్ నష్టపోకుండా 13 పరుగులు సాధించింది. క్రీజులో బెయిర్‌స్టో 7, బట్లర్ 6 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 10 Nov 2021 07:12 PM (IST)

    ENG vs NZ Live: ప్లేయింగ్ XI

    ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): జోస్ బట్లర్(కీపర్), జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, మొయిన్ అలీ, ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), సామ్ బిల్లింగ్స్, లియామ్ లివింగ్‌స్టోన్, క్రిస్ వోక్స్, క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్

    న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): మార్టిన్ గప్టిల్, డారిల్ మిచెల్, కేన్ విలియమ్సన్(కెప్టెన్), డెవాన్ కాన్వే(కీపర్), గ్లెన్ ఫిలిప్స్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, ఆడమ్ మిల్నే, టిమ్ సౌతీ, ఇష్ సోధి, ట్రెంట్ బౌల్ట్

  • 10 Nov 2021 07:09 PM (IST)

    ENG vs NZ Live: టాస్ గెలిచిన న్యూజిలాండ్

    న్యూజిలాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఇంగ్లండ్ టీం బ్యాటింగ్ చేయనుంది.

  • 10 Nov 2021 06:53 PM (IST)

    ENG vs NZ Live: మోర్గాన్ vs విలియమ్సన్

    ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య మరోసారి నాకౌట్ మ్యాచ్ జరగనుంది. 2019 ప్రపంచకప్‌లో చివరి సారి ఫైనల్‌లో తలపడ్డారు. ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్ విజయం సాధించింది. అయితే ఆ మ్యాచ్‌లో ఆడిన ముగ్గురు పెద్ద హీరోలు ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్, ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్, లియామ్ ప్లంకెట్ ఈ మ్యాచ్‌లో భాగం కావడం లేదు. కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఈసారి ఇంగ్లిష్ కెప్టెన్ మోర్గాన్‌‌ను ఓడిస్తాడో లేదో చూడాలి.

Published On - Nov 10,2021 6:47 PM

Follow us