AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Venkatesh Iyer: అతడిని చూసే ఎడమచేతి బ్యాటింగ్‎కు మారా.. వెంకటేష్ అయ్యర్ ఆసక్తికర వ్యాఖ్యలు..

నవంబర్ 17 నుంచి న్యూజిలాండ్‌తో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‎ల టీ20 సిరీస్‌కు బీసీసీఐ 16 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. టీం ఇండియా జట్టుకు వెంకటేష్ అయ్యర్ తొలిసారిగా ఎంపికయ్యాడు....

Venkatesh Iyer: అతడిని చూసే ఎడమచేతి బ్యాటింగ్‎కు మారా.. వెంకటేష్ అయ్యర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Venkatesh
Srinivas Chekkilla
|

Updated on: Nov 10, 2021 | 8:11 PM

Share

నవంబర్ 17 నుంచి న్యూజిలాండ్‌తో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‎ల టీ20 సిరీస్‌కు బీసీసీఐ 16 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. టీం ఇండియా జట్టుకు వెంకటేష్ అయ్యర్ తొలిసారిగా ఎంపికయ్యాడు. ఐపీఎల్‎లో అద్భుతంగా రాణించినందుకు అతడిని ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. ఐపీఎల్-2021లో 10 మ్యాచ్‌లలో 370 పరుగులు చేశాడు అయ్యరు. భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అంటే అయ్యర్‎కు చాలా ఇష్టం. అందుకే ఎడమచేతి వాటం బ్యాటర్‌గా మారినట్లు చెప్పాడు.

“నేను చాలా చిన్న వయస్సులో ఉన్నప్పుడు, నేను దాదాను చూస్తూ కుడిచేతి వాటంతో బ్యాటింగ్ చేసేవాడిని, నేను అతనిని కాపీ కొట్టాలని నిర్ణయించుకున్నాను. అందుకే నేను ఎడమచేతి వాటంగా మారాను. ప్రజలు నన్ను అతనితో పోల్చినప్పుడు ఆనందంగా అనిపిస్తుంది” అని అయ్యర్ అన్నారు. ఐపీఎల్ ఫైనల్ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఓడించి నాల్గోసారి టైటిల్‌ను గెలుచుకున్న తర్వాత గంగూలీతో మాట్లాడటం చాలా ఆనందంగా ఉందని అయ్యర్ వెల్లడించాడు. అయ్యర్ తన ఆరాధ్య దైవమైన గంగూలీ అందిన సలహాను గుర్తుచేసుకున్నాడు.

ఐపీఎల్ ఫైనల్ తర్వాత దాదాను అయ్యర్ కలిశాడు. ఆలోచించకుండా ప్రక్రియపై దృష్టి కేంద్రీకరించండి. అలా చేయండి మీరు స్వయంచాలకంగా ఫలితాలను చూస్తారని గంగూలీ చెప్పినట్లు అయ్యర్ చెప్పాడు. అయ్యర్ తన తొలి IPL సీజన్‌లో 41 సగటుతో నాలుగు అర్ధ సెంచరీలు సాధించాడు. బాల్‌తో అతని పరుగులు ఎక్కువ ఇచ్చినప్పటికీ మూడు వికెట్లు పడగొట్టాడు.

Read Also.. T20I rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ విడుదల.. మూడో స్థానంలో నిలిచిన దక్షిణాఫ్రికా ఆటగాడు మాక్రమ్..