AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahashivratri 2025: హర హర మహాదేవ.. పురాతన శివాలయంలో టీమిండియా క్రికెటర్ల పూజలు.. ఫొటోస్ వైరల్

దేశవ్యాప్తంగా మహాశివరాత్రి పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకొంటున్నారు. ప్రజలందరూ మహాదేవుని భక్తిలో మునిగిపోతున్నారు. పరమేశ్వరుడిని ఆశీస్సులు పొందేందుకు ఆలయాలకు పోటెత్తుతున్నారు. ఈ క్రమంలో టీమిండియా క్రికెటర్లు పురాతన శివుని ఆలయాన్ని దర్శించుకున్నారు. మహా శివుడికి ప్రత్యేక పూజలు చేశారు . ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.

Mahashivratri 2025: హర హర మహాదేవ.. పురాతన శివాలయంలో టీమిండియా క్రికెటర్ల పూజలు.. ఫొటోస్ వైరల్
Team India Cricketers
Basha Shek
| Edited By: TV9 Telugu|

Updated on: Feb 27, 2025 | 11:15 AM

Share

ప్రతిష్ఠాత్మక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ లో టీం ఇండియా అద్భుతంగా ఆడుతోంది. ఈ టోర్నీలో మొదట బంగ్లాదేశ్‌ను, ఆ తర్వాత పాకిస్థాన్‌ను ఓడించి భారత జట్టు ఇప్పటికే సెమీఫైనల్‌కు చేరుకుంది. ఈ మెగా టోర్నీలో టీమిండియా తన తదుపరి మ్యాచ్ ఆదివారం (మార్చి 02)న న్యూజిలాండ్ తో ఆడనుంది. కాగా దుబాయ్ లో జరిగిన భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కు పలువురు టీమిండియా క్రికెటర్లు హాజరయ్యారు. అభిషేక్ శర్మ, తిలక్ వర్మ తదితరులు స్టేడియానికి వచ్చి భారత్ కు మద్దతు పలికారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. కాగా మహా శివరాత్రి సందర్భంగా టీమిండియా క్రికెటర్లు ముంబైలోని పురాతన బాబుల్‌నాథ్ ఆలయాన్ని దర్శించుకున్నారు. తిలక్ వర్మతో పాటు దీపక్ చాహర్ మరియు కర్ణ్ శర్మ లు మహా శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశాడు తిలక్ వర్మ. అందులో ముగ్గురూ సంప్రదాయ దుస్తులు ధరించి నుదుటిపై తిలకం, మెడలో రుద్రాక్ష మాలలతో కనిపించారు. ‘హర్ హర్ మహాదేవ్’ అని తమ ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చాడు తిలక్ వర్మ.

ఐపీఎల్ 2025లో దీపక్ చాహర్, తిలక్ వర్మ, కర్ణ్ శర్మ ఒకే జట్టు తరపున ఆడనున్నారు. ఐపీఎల్ 2025 వేలంలో దీపక్‌ను ముంబై ఇండియన్స్ రూ. 9.25 కోట్లకు కొనుగోలు చేసింది. స్పిన్నర్ కర్ణ్ శర్మను ముంబై రూ. 50 లక్షలకు చేర్చుకుంది. ఇక తిలక్ ఇప్పటికే జట్టులో కీలక ప్లేయర్ గా ఉన్నాడు. ముంబై జట్టు అతన్ని 8 కోట్ల రూపాయలకు రిటైన్ చేసుకుంది.

ఇవి కూడా చదవండి

పురాతన శివాలయంలో టీమిండియా క్రికెటర్లు..

View this post on Instagram

A post shared by Tilak Varma (@tilakvarma9)

ఐపీఎల్ తదుపరి సీజన్ మార్చి 22 నుండి ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరగనుంది. మే 25న ఫైనల్ మ్యాచ్ కూడా ఇదే మైదానంలో జరుగుతుంది. ఈ మెగా క్రికెట్ టోర్నీలో ఫైనల్‌తో సహా మొత్తం 74 మ్యాచ్‌లు జరుగుతాయి. టైటిల్ కోసం 10 జట్లు పోటీ పడుతున్నాయి.

దుబాయ్ స్టేడియంలో మెగాస్టార్ చిరంజీవితో తిలక్ వర్మ..

View this post on Instagram

A post shared by Tilak Varma (@tilakvarma9)

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..