AUS vs ENG: మూడేళ్ల పాటు దేశవాళీ క్రికెట్‌లో కూడా ఆడకుండానే ఇంగ్లాండు జట్టులోకి ఆరంగేట్రం.. రికార్డులను సృష్టించకుండానే అందిన అవకాశం..
ఐఐసీ టీ20 ప్రపంచకప్ టోర్నీ ముగిసిపోయిన తర్వాత క్రికెట్ జట్లన్నీ సిరీస్‌ల మీదనే తమ దృష్టిని సారించాయి. అదే క్రమంలో ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న అస్ట్రేలియా అతిథ్య జట్టుతో..
ఐఐసీ టీ20 ప్రపంచకప్ టోర్నీ ముగిసిపోయిన తర్వాత క్రికెట్ జట్లన్నీ సిరీస్‌ల మీదనే తమ దృష్టిని సారించాయి. అదే క్రమంలో ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న అస్ట్రేలియా అతిథ్య జట్టుతో మూడు వన్డేల సిరీస్‌ను ఆడనుంచి. ఇందులో భాగంగా గురువారం మొదటి వన్డే మ్యాచ్ అడిలైడ్‌లో జరుగుతోంది. తొలుత టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఆస్ట్రేలియా జట్టులో ఆశ్చర్యపరిచే విధంగా కొత్త పేర్లు ఏం లేవు. కానీ, ఇంగ్లాండు జట్టులో ఓ ఆసక్తి కరమైన మార్పు చోటుచేసుకుంది. 3 సంవత్సరాలుగా దేశవాళీ క్రికెట్‌లో కూడా ఆడని ఓ ఆటగాడిని ఇంగ్లండ్ జట్టు రంగంలోకి దించింది. ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్‌తో వన్డే అరంగేట్రం చేసిన ఆ ఆటగాడు ల్యూక్ వుడ్. ఈ 27 ఏళ్ల లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ లిస్ట్ ఏ క్రికెట్‌లో కేవలం 4 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. కానీ, ఆ మ్యాచ్‌ల ఆధారంగానే అతనికి ఈ అవకాశం లభించింది.
3 సంవత్సరాలుగా లిస్ట్ ఏ మ్యాచ్ ఒక్కటీ ఆడలేదు
ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ తన టీమ్‌ను ప్రకటించి, ల్యూక్ వుడ్‌కు వన్డే క్యాప్‌ను అందజేశాడు. 2016 లో ల్యూక్ వుడ్ లిస్ట్ ఏ అరంగేట్రం చేశాడు. అప్పటి నుండి 2019 వరకు, అతను 4 లిస్ట్ ఏ మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. కానీ, మూడేళ్ల పాటు లిస్ట్ ఏ క్రికెట్‌కు దూరంగా ఉంటూ.. ఇప్పుడు ఏకంగా ఇంగ్లండ్ జట్టులో అవకాశం దక్కించుకున్నాడు. ఇన్నాళ్లూ దేశీవాళి క్రికెట్‌కు పరిమితమైన అతను మొదటిసారిగా తన అంతర్జాతీయ మ్యాచ్‌ను గురువారమే ఆడుతున్నాడు.
కేవలం 4 మ్యాచ్‌లు..5 వికెట్లు..
2016-2019 మధ్య కాలంలో అతను ఆడిన 4 లిస్ట్ ఏ మ్యాచ్‌లలో 5 వికెట్లను పడగొట్టి, 73 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ తరఫున వన్డేల్లో అరంగేట్రం చేయడానికి ముందు, ల్యూక్ వుడ్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో కరాచీలో పాకిస్థాన్‌తో జరిగిన టీ20లో కూడా తన ఆరంగేట్రం చేశాడు. అతను ఇప్పటివరకూ ఇంగ్లండ్ తరఫున 2 టీ20 మ్యాచ్‌లు ఆడి 3 వికెట్లు పడగొట్టాడు.
అవకాశాన్ని నిలుపుకోవాలి..
ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో సామ్ కరన్‌తో కలిసి ఇంగ్లండ్ బరిలోకి దిగలేదు. అతనికి బదులుగా ల్యూక్ వుడ్ జట్టులోకి వచ్చాడు. ఇటీవల జరిగిన ఐఐసీ టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా సామ్ కరణ్ నిలిచాడు. ఇప్పుడు సామ్ కరన్‌కు బదులుగా జట్టులోకి వచ్చిన లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ల్యూక్ వుడ్ అతని కంటే మెరుగైన ప్రదర్శన కనబరచవలసి ఉంది. తనకు అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవలసిన బాధ్యత ఇప్పుడు అతనిపై ఉంటుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..