AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ruturaj Gaikwad: ‘ధోని నుంచి చాలా నేర్చుకున్నా, కానీ నా స్టైల్ నాదే’.. మహీ కెప్టెన్సీపై రుతురాజ్ అసక్తికర వ్యాఖ్యలు..

Ruturaj Gaikwad: క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్ అనే పేరు వినగానే అందరికీ గుర్తు వచ్చే పేర్లు చెన్నై సూపర్ కింగ్స్, మహేంద్ర సింగ్ ధోని. 2019 ఐపీఎల్ టోర్నీ నుంచి ఎంఎస్ ధోని అడుగుజాడల్లో నడుస్తూ తనను తాను బిల్డ్ చేసుకున్న రుతురాజ్.. ఆసియా క్రీడల్లో భారత జట్టుకు నాయకుడిగా కూడా కనిపించిన సంగతి తెలిసిందే. మంగళవారం నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్‌గా టీమిండియాకు విజయాన్ని అందించడమే..

Ruturaj Gaikwad: ‘ధోని నుంచి చాలా నేర్చుకున్నా, కానీ నా స్టైల్ నాదే’.. మహీ కెప్టెన్సీపై రుతురాజ్ అసక్తికర వ్యాఖ్యలు..
Ruturaj On Dhoni
శివలీల గోపి తుల్వా
|

Updated on: Oct 03, 2023 | 1:56 PM

Share

Ruturaj Gaikwad: క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్ అనే పేరు వినగానే అందరికీ గుర్తు వచ్చే పేర్లు చెన్నై సూపర్ కింగ్స్, మహేంద్ర సింగ్ ధోని. 2019 ఐపీఎల్ టోర్నీ నుంచి ఎంఎస్ ధోని అడుగుజాడల్లో నడుస్తూ తనను తాను బిల్డ్ చేసుకున్న రుతురాజ్.. ఆసియా క్రీడల్లో భారత జట్టుకు నాయకుడిగా కూడా కనిపించిన సంగతి తెలిసిందే. మంగళవారం నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్‌గా టీమిండియాకు విజయాన్ని అందించడమే కాక జట్టును సెమీ ఫైనల్స్‌కి చేర్చాడు. అయితే ఈ మ్యాచ్‌కి ముందు ధోనిపై, ధోని కెప్టెన్సీపై రుతురాజ్ చేసిన ఆసక్తికరమైన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆసియా క్రీడల్లో తొలి సారిగా భారత క్రికెట్ జట్టు ఆడబోతున్న సందర్భంగా సోమవారం ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టోర్నీలో భారత్‌ను ముందుండి నడిపిస్తున్న రుతురాజ్ ఆ సందర్భంగా మాట్లాడుతూ ‘ఎంఎస్ ధోని నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. కానీ ప్రతి ఒక్కరికీ ఒక్కో స్టైల్ ఉంటుంది. ధోని స్టైల్ వేరు. అతని వ్యక్తిత్వం కంటే నా వ్యక్తిత్వం వేరు. అతను చేసినలా కాకుండా నేను నాలా చేయడానికి ప్రయత్నిస్తా. కానీ పరిస్థితులకు తగ్గట్లుగా వ్యవహరించడం, మైదానంలో సహచర ఆటగాళ్లతో నడుచుకోవడం వంటి విషయాలను అతని నుంచి తప్పక నేర్చుకోవాలి’ అన్నాడు.

కాగా, మంగళవారం నేపాల్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన రుతురాజ్ నేతృత్వంలోని భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. ఈ క్రమంలో యశస్వీ తన తొలి అంతర్జాతీయ టీ20 సెంచరీ నమోదు చేసుకోగా.. రుతురాజ్ 25 పరుగులు చేశాడు. అలాగే శివమ్ దుబే(19 బంతుల్లో 25), రింకూ సెంగ్(15 బంతుల్లో 37) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. భారత్ ఇచ్చిన 203 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన నేపాల్ 179 రన్స్‌కే పరిమితమైంది. భారత్ బౌలర్లలో రవి బిష్ణోయ్ 3, అవేష్ ఖాన్ 3, అర్షదీప్ సింగ్ 2 వికెట్లు తీసుకోగా..సాయి కిషోర్ ఓ వికెట్ పడగొట్టాడు. ఇక ఈ విజయంతో భారత్ అక్టోబర్ 6న జరిగే సెమీఫైనల్స్‌కి చేరింది.

భారత్ ప్లేయింగ్ ఎలెవన్: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), యశస్వీ జైస్వాల్, తిలక్ వర్మ, జితేష్ శర్మ (వికెట్ కీపర్), రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్.

నేపాల్ ప్లేయింగ్ ఎలెవన్: కుశల్ భుర్తేల్, ఆసీఫ్ షేక్ (వికెట్ కీపర్), సున్దీప్ జోరా, గుల్సన్ ఝా, రోహిత్ పౌడెల్ (కెప్టెన్), కుశాల్ మల్ల, దీపేంద్ర సింగ్, సోంపాల్ కమి, కరణ్ కేసీ, అబినాష్ బోహారా, సందీప్ లమిచ్చనే.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..