KKR vs SRH Highlights, IPL 2025: ఈడెన్‌లో ఓడిన హైదరాబాద్.. 80 పరుగుల తేడాతో కేకేఆర్ విజయం
Kolkata Knight Riders vs Sunrisers Hyderabad Highlights in Telugu: కోల్‌కతా జట్టు హైదరాబాద్‌పై ఆధిక్యంలో నిలిచింది. ఇద్దరి మధ్య 28 ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగాయి. కోల్‌కతా జట్టు 19 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, హైదరాబాద్ 9 మ్యాచ్‌ల్లో గెలిచింది. టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.

Kolkata Knight Riders vs Sunrisers Hyderabad Highlights in Telugu: ఐపీఎల్ 2025లో భాగంగా 15వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఏకపక్ష విజయం సాధించింది. కోల్‌కతా జట్టుపై సన్‌రైజర్స్ హైదరాబాద్ మరోసారి తన నిస్సహాయతను ప్రదర్శించింది. దీంతో కోల్‌కతా 80 పరుగుల తేడాతో హైదరాబాద్‌ను ఓడించింది. కోల్‌కతా నాలుగు మ్యాచ్‌ల్లో రెండో విజయాన్ని నమోదు చేయగా, హైదరాబాద్‌పై వరుసగా ఇది నాలుగో విజయం కావడం గమనార్హం. ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 200 పరుగులు చేసింది. వెంకటేష్ అయ్యర్ కేవలం 29 బంతుల్లో 60 పరుగులు చేసి ఔటయ్యాడు. అంగ్క్రిష్ రఘువంశీ 32 బంతుల్లో 50 పరుగులు చేశాడు. కెప్టెన్ రహానే 27 బంతుల్లో 38 పరుగులు చేయగా, రింకు సింగ్ 17 బంతుల్లో 32 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీనికి ప్రతిస్పందనగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 120 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఇరు జట్లు:
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, అనికేత్ వర్మ, హెన్రిచ్ క్లాసెన్(కీపర్), కమిందు మెండిస్, సిమర్‌జీత్ సింగ్, పాట్ కమిన్స్(కెప్టెన్), హర్షల్ పటేల్, మహ్మద్ షమీ, జీషన్ అన్సారీ
కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్(కీపర్), సునీల్ నరైన్, అజింక్యా రహానే(కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, మొయిన్ అలీ, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.
రెండు జట్లకు ఇంపాక్ట్ ప్లేయర్స్:
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇంపాక్ట్ ప్లేయర్స్: అభినవ్ మనోహర్, జయదేవ్ ఉనద్కత్, ట్రావిస్ హెడ్, రాహుల్ చాహర్, వియాన్ ముల్డర్.
కోల్‌కతా నైట్ రైడర్స్ ఇంపాక్ట్ ప్లేయర్స్: మనీష్ పాండే, వైభవ్ అరోరా, అనుకుల్ రాయ్, రోవ్‌మన్ పావెల్, లువ్నిత్ సిసోడియా.
LIVE Cricket Score & Updates
-
కేకేఆర్ ఘన విజయం..
16.4 ఓవర్లలో SRH 120 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో కేకేఆర్‌పై 80 పరుగుల తేాడాతో ఓటమిపాలైంది.
-
క్లాసెన్ కూడా పెవిలియన్
14.4 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ జట్టు 7 వికెట్లకు 112 పరుగులు చేసింది. కెప్టెన్ పాట్ కమ్మిన్స్, హర్షల్ పటేల్ క్రీజులో ఉన్నారు.
-
-
100 దాటిన స్కోర్
14 ఓవర్లు ముగిసే సరికి SRH 6 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్, కెప్టెన్ పాట్ కమ్మిన్స్ మైదానంలో ఉన్నారు.
-
10 ఓవర్లలో..
10 ఓవర్లు ముగిసేసరికి SRH 5 వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ మైదానంలో ఉన్నారు.
-
మూడో వికెట్ డౌన్
మూడో ఓవర్ తొలి బంతికే హైదరాబాద్ మూడో వికెట్ కోల్పోయింది. ఇషాన్ కేవలం 2 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
-
-
హెడ్ ఔట్
హైదరాబాద్ ఇన్నింగ్స్ మొదలైన వెంటనే తొలి బంతికి ఫోర్ కొట్టిన హెడ్.. రెండో బంతికి వికెట్ కోల్పోయాడు.
-
హైదరాబాద్ టార్గెట్ 201
ఐపీఎల్ 2025లో భాగంగా 15వ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. దీంతో సన్‌రైజర్స్ ముందు 201 పరుగుల టార్గెట్ నిలిచింది.
-
180 దాటిన స్కోర్
18 ఓవర్లు ముగిసే సరికి కోల్‌కతా 187 పరుగుల మార్కును దాటింది. ఈ ఓవర్లో వెంకటేష్ అయ్యర్ ఏకంగా 21 పరుగులు రాబట్టాడు.
-
120 దాటిన స్కోర్
కోల్‌కతా 15 ఓవర్లలో 4 వికెట్లకు 122 పరుగులు చేసింది. వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్ క్రీజులో ఉన్నారు.
-
4 వికెట్లు కోల్పోయిన కేకేఆర్
కోల్‌కతా 12.1 ఓవర్లలో 4 వికెట్లకు 106 పరుగులు చేసింది. వెంకటేష్ అయ్యర్ క్రీజులో ఉన్నాడు.
-
కీలక భాగస్వామ్యం
కోల్‌కతా 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్లు అజింక్యా రహానే, అంగ్క్రిష్ రఘువంశీ ఉన్నారు. వారిద్దరి మధ్య యాభై పరుగుల భాగస్వామ్యం ఉంది.
-
పవర్ ప్లేలో పవర్ చూపించిన కేకేఆర్
టాస్ ఓడి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కతా పవర్‌ప్లేలో రెండు వికెట్లకు 53 పరుగులు చేసింది. ఓపెనర్లు క్వింటన్ డి కాక్ 1, సునీల్ నరైన్ 7 పరుగులకే ఔటయ్యారు. కెప్టెన్ పాట్ కమ్మిన్స్, మహ్మద్ షమీ తలా ఒక వికెట్ పడగొట్టారు.
-
5 ఓవర్లకు కేకేఆర్ స్కోర్
కోల్‌కతా 5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 38 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ అజింక్యా రహానే, అంగ్క్రిష్ రఘువంశీ ఉన్నారు.
-
సునీల్ నరైన్ ఔట్
కోల్‌కతా 2.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 16 పరుగులు చేసింది. సునీల్ నరైన్ 7 పరుగులు చేసి ఔట్ అయ్యాడు.
-
డికాక్ ఔట్
కోల్‌కతా 2 ఓవర్లలో ఒక వికెట్ నష్టపోయి 14 పరుగులు చేసింది. క్వింటన్ డి కాక్ (1) త్వరగానే వికెట్ కోల్పోయాడు.
-
రింకూ సింగ్‌కు ప్రత్యేక జెర్సీ
రింకూ సింగ్‌కు కేకేఆర్ ప్రత్యేక జెర్సీని అందించింది. అందుకు గల కారణం ఉందండోయ్.. రింకూ సింగ్ 50వ ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్నాడు.
-
రెండు జట్లకు ఇంపాక్ట్ ప్లేయర్స్:
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇంపాక్ట్ ప్లేయర్స్: అభినవ్ మనోహర్, జయదేవ్ ఉనద్కత్, ట్రావిస్ హెడ్, రాహుల్ చాహర్, వియాన్ ముల్డర్.
కోల్‌కతా నైట్ రైడర్స్ ఇంపాక్ట్ ప్లేయర్స్: మనీష్ పాండే, వైభవ్ అరోరా, అనుకుల్ రాయ్, రోవ్‌మన్ పావెల్, లువ్నిత్ సిసోడియా.
-
కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేయింగ్ XI:
క్వింటన్ డి కాక్(కీపర్), సునీల్ నరైన్, అజింక్యా రహానే(కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, మొయిన్ అలీ, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.
-
సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ XI:
అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, అనికేత్ వర్మ, హెన్రిచ్ క్లాసెన్(కీపర్), కమిందు మెండిస్, సిమర్‌జీత్ సింగ్, పాట్ కమిన్స్(కెప్టెన్), హర్షల్ పటేల్, మహ్మద్ షమీ, జీషన్ అన్సారీ.
-
టాస్ గెలిచిన హైదరాబాద్..
కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచిన హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో కోల్‌కతా బ్యాటింగ్ చేయనుంది.
-
కేకేఆర్ తరపున హీరోలు
కేకేఆర్ తరపున క్వింటన్ డి కాక్ టాప్ స్కోరర్. అతను 3 మ్యాచ్‌ల్లో 102 పరుగులు చేశాడు. రెండవ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను 61 బంతుల్లో 97 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆ తర్వాత జట్టు కెప్టెన్ అజింక్య రహానే 85 పరుగులు చేశాడు. తన తొలి మ్యాచ్‌లోనే ఆర్‌సీబీపై 31 బంతుల్లో 56 పరుగులతో అర్ధ సెంచరీ సాధించాడు. బౌలింగ్‌లో వరుణ్ చక్రవర్తి 3 మ్యాచ్‌ల్లో 3 వికెట్లు పడగొట్టాడు.
-
ఈ హైదరాబాదోళ్లు డేంజర్ భయ్యా
హైదరాబాద్ తరపున ట్రావిస్ హెడ్ టాప్ స్కోరర్. ఈ సీజన్‌లో అతను 3 మ్యాచ్‌ల్లో 136 పరుగులు చేశాడు. అతని తర్వాత, అనికేత్ వర్మ రెండవ స్థానంలో, ఇషాన్ కిషన్ మూడవ స్థానంలో ఉన్నారు. అనికేత్ 3 మ్యాచ్‌ల్లో 205.26 స్ట్రైక్ రేట్‌తో 117 పరుగులు చేశాడు. తన చివరి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 41 బంతుల్లో 74 పరుగులు చేశాడు. ఇషాన్ మూడు మ్యాచ్‌ల్లో 108 పరుగులు చేశాడు. తన తొలి మ్యాచ్‌లోనే రాజస్థాన్ రాయల్స్‌పై 47 బంతుల్లో 106 పరుగుల సెంచరీ సాధించాడు. బౌలింగ్‌లో హర్షల్ పటేల్ 3 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.
-
రెండో విజయం కోసం ఎదురుచూపులు..
కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు ఇప్పటివరకు ఒక్క విజయం మాత్రమే సాధించాయి. ఇటువంటి పరిస్థితిలో, రెండు జట్లు రెండవ విజయం కోసం చూస్తున్నాయి. కోల్‌కతా మైదానంలో ఏ జట్టు గెలుస్తుందో ఆసక్తికరంగా మారింది. -
పిచ్ నివేదిక..
ఈడెన్ గార్డెన్స్ స్టేడియం పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. ఈ స్టేడియంలో ఇప్పటివరకు 94 ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగాయి. ఇక్కడ మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 38 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, ఛేజింగ్ చేసిన జట్లు 56 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. రికార్డులను పరిశీలిస్తే, టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకోవచ్చు. ఈ స్టేడియంలో అత్యధిక జట్టు స్కోరు 262/2గా నిలిచింది.
-
కోల్‌కతాదే ఆధిక్యం..
కోల్‌కతా జట్టు హైదరాబాద్‌పై ఆధిక్యంలో నిలిచింది. ఇద్దరి మధ్య 28 ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగాయి. కోల్‌కతా జట్టు 19 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, హైదరాబాద్ 9 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఈడెన్ గార్డెన్స్‌లో రెండు జట్లు 10 సార్లు తలపడ్డాయి. కోల్‌కతా 7 సార్లు గెలవగా, హైదరాబాద్ 3 సార్లు మాత్రమే గెలిచింది.
-
ఈడెన్‌లో హోరాహోరీ పోరు
ఐపీఎల్ 2025లో 15వ మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ రన్నరప్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్ కోల్‌కతా హోం గ్రౌండ్ ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో జరుగుతోంది.
Published On - Apr 03,2025 6:03 PM




