KKR vs SRH, IPL 2024 Final Live Score: ఐపీఎల్ 17 విజేతగా కోల్ కతా.. ఫైనల్‌లో ఎస్ఆర్‌హెచ్ పరాజయం

|

Updated on: May 26, 2024 | 10:43 PM

Kolkata Knight Riders vs Sunrisers Hyderabad IPL 2024 Live Score: ఐపీఎల్ 17వ సీజన్ ఆఖరి అంకానికి చేరుకుంది. లీగ్ లో టాప్-2 ప్లేసుల్లో నిలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్లు టైటిల్ కోసం తలపడుతున్నాయి. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా మరికాసేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.

KKR vs SRH, IPL 2024 Final Live Score: ఐపీఎల్ 17 విజేతగా కోల్ కతా.. ఫైనల్‌లో ఎస్ఆర్‌హెచ్ పరాజయం
KKR-vs-SRH-IPL-2024-Final

Kolkata Knight Riders vs Sunrisers Hyderabad IPL 2024 Live Score: కోల్ కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ 17 విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్ లో ఆజట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ ను  8 వికెట్ల తేడాతో చిత్తు చేసి ముచ్చటగా మూడోసారి ఐపీఎల్ కప్ ను సొంతం చేసుకుంది. ఎస్ ఆర్ హెచ్ విధించిన 114  పరుగుల లక్ష్యాన్ని కోల్ కతా కేవలం 10. 3 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. లీగ్ లో టాప్-2 ప్లేసుల్లో నిలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్లు టైటిల్ కోసం తలపడ్డాయి. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరిగింది. ఎస్ ఆర్ హెచ్ ఓటమితో ఆ జట్టు ఆటగాళ్లు, అభిమానులు నిరాశలో కూరుకుపోయారు

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 26 May 2024 10:31 PM (IST)

    ఐపీఎల్ 17 విజేతగా కోల్ కతా నైట్ రైడర్స్

    కోల్ కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ 17 విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్ లో ఆజట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ ను  8 వికెట్ల తేడాతో చిత్తు చేసి ముచ్చటగా మూడోసారి ఐపీఎల్ కప్ ను సొంతం చేసుకుంది. ఎస్ ఆర్ హెచ్ విధించిన 114  పరుగుల లక్ష్యాన్ని కోల్ కతా కేవలం 10. 3 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

  • 26 May 2024 10:20 PM (IST)

    వంద దాటిన కోల్ కతా స్కోరు.. విజయానికి చేరువలో

    కోల్ కతా స్కోరు వంద దాటింది.  ఆ జట్టు విజయానికి చేరువలో ఉంది. ప్రస్తుతం ఆ జట్టు స్కోరు 9 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 106 పరుగులు. విజయానికి 8 పరుగులు మాత్రమే అవసరం.

  • 26 May 2024 09:53 PM (IST)

    ధాటిగా ఆడుతోన్న కోల్ కతా బ్యాటర్లు..

    114 పరుగుల లక్ష్య ఛేదనలో కోల్ కతా బ్యాటర్లు ధాటిగా ఆడుతున్నారు. ఫస్ట్ వికెట్ తొందరగానే కోల్పోయినా గుర్బాజ్, వెంకటేశ్ అయ్యర్ వేగంగా పరుగులు సాధిస్తున్నారు. 4 ఓవర్లు ముగిసే సరికి కోల్ కతా స్కోరు 46/1

  • 26 May 2024 09:41 PM (IST)

    కోల్ కతా బ్యాటింగ్ ప్రారంభం..

    కోల్ కతా లక్ష్య ఛేదన ప్రారంభమైంది. రెండో ఓవర్లోనే డ్యాషింగ్ బ్యాటర్ సునీల్ నరైన్ (6) పరుగులు చేసి ఔటయ్యాడు. కెప్టెన్ కమిన్స్ ఈ వికెట్ తీశాడు. ప్రస్తుతం కేకేఆర్ స్కోరు 2.2 ఓవర్లు ముగిసే సరికి 22/1.

  • 26 May 2024 09:23 PM (IST)

    113 పరుగులకే హైదరాబాద్ ఆలౌట్

    ఐపీఎల్ ఫైనల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కుప్ప కూలింది. కోల్ కతా బౌలర్ల ధాటికి 18.3 ఓవర్లలోనే చాప చుట్టేసింది. కెప్టెన్ కమిన్స్ (24) పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. కోల్ కతా బౌలర్లలో ఆండ్రీ రస్సెస్ మూడు వికెట్లు తీయగా, స్టార్క్,  హర్షిత్ రాణా తలా రెండు వికెట్లు తీశారు.

  • 26 May 2024 09:11 PM (IST)

    తొమ్మిదో వికెట్ కోల్పోయిన సన్ రైజర్స్..

    సన్ రైజర్స్ హైదరాబాద్  తొమ్మిదో వికెట్ కోల్పోయింది. 11 బంతుల్లో 4 పరుగులు చేసిన జయదేవ్ ఉనాద్కత్ సునీల్ నరైన్ బౌలింగ్ లో ఉన్నాడు. 18 ఓవర్లలో ఎస్ ఆర్ హెచ్ స్కోరు 113. కెప్టెన్ కమిన్స్ (21) ఒంటరి పోరాటం చేస్తున్నాడు.

  • 26 May 2024 08:49 PM (IST)

    కుప్పకూలిన హైదరాబాద్.. 8వికెట్లు డౌన్

    కోల్ కతా బౌలర్లు చెలరేగిపోతున్నారు. వరుస విరామాల్లో వికెట్లు తీస్తున్నారు. దీంతో ఎస్ ఆర్ హెచ్ 100 పరుగుల్లోపే 8 కీలక వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం ఆ జట్టు ఆశలన్నీ కెప్టెన్ కమిన్స్ పైనే  ఉన్నాయి.

  • 26 May 2024 08:30 PM (IST)

    5 వికెట్లు కోల్పోయిన సన్ రైజర్స్

    సన్ రైజర్స్ హైదరాబాద్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. కోల్ కతా బౌలర్లు చెలరేగడంతో ఆ జట్టు బ్యాటర్లు వరుసగా పెవిలియన్ చేరుకుంటున్నారు. ఇప్పటికే ఆ జట్టు సగం మంది బ్యాటర్లు ఔటయ్యారు. ప్రస్తుతం ఎస్ ఆర్ హెచ్ స్కోరు 10.5 ఓవర్లు ముగిసే సరికి 64/5.

  • 26 May 2024 08:05 PM (IST)

    ఎస్ ఆర్ హెచ్ ను మళ్లీ దెబ్బ తీసిన స్టార్క్.. మూడో వికెట్ ఢమాల్..

    ఐపీఎల్ ఫైనల్ లో స్టార్క్ విజృంభించాడు. ఇప్పటికే ఓ అద్భుతమైన డెలివరీతో అభిషేక్ వర్మను బలిగొన్న ఈ ఫాస్ట్ బౌలర్ వన్ డౌన్ బ్యాటర్ ను రాహుల్ త్రిపాఠీని కూడా బోల్తా కొట్టించాడు. ప్రస్తుతం SRH స్కోరు 5.3 ఓవర్లలో 33/3.

  • 26 May 2024 07:46 PM (IST)

    ఎస్ ఆర్ హెచ్ కు డబుల్ షాక్.. ఓపెనర్లు ఔట్..

    సన్ రైజర్స్ హైదరాబాద్ కు మరో షాక్ తగిలింది. ట్రావిస్ హెడ్ కూడా ఔటయ్యాడు.  పరుగులేమీ చేయకుండానే అతను పెవిలియన్ బాట పట్టాడు. ప్రస్తుతం ఎస్ ఆర్ హెచ్ స్కోరు 2 వికెట్ల నష్టానికి 6 పరుగులు.

  • 26 May 2024 07:38 PM (IST)

    హైదరాబాద్ కు ఆదిలోనే షాక్..

    మొదట బ్యాటింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఇన్ ఫామ్ బ్యాటర్ అభిషేక్ శర్మ రెండు పరుగులకే ఔటయ్యాడు. మిచెల్ స్టార్క్ ఓ అద్భుతమైన బంతితో అభిషేక్ ను బౌల్డ్ చేశాడు.

  • 26 May 2024 07:33 PM (IST)

    హైదరాబాద్ గత రికార్డులు ఇవే..

    కోల్‌కతా నైట్ రైడర్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫైనల్‌లో ఇరు జట్లు తలపడడం ఇదే తొలిసారి. 2018 తర్వాత హైదరాబాద్‌ ఫైనల్‌కు చేరడం ఇదే తొలిసారి కాగా ఓవరాల్‌గా మూడోది. గతంలో 2016, 2018లో హైదరాబాద్‌ ఫైనల్‌ ఆడింది. మరోవైపు కోల్‌కతాకు ఫైనల్‌ చేరడం ఇది నాలుగోసారి. 2012, 2014, 2021 తర్వాత కోల్‌కతా నాలుగోసారి ఫైనల్ ఆడనుంది. అలాగే 12 ఏళ్ల తర్వాత తొలిసారిగా చెన్నైలో ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. అంతకుముందు 2012లో కేకేఆర్, చెన్నై మధ్య భారీ మ్యాచ్ జరిగింది. ఆ తర్వాత చెన్నైని దెబ్బకొట్టి కేకేఆర్ తొలిసారి ఛాంపియన్‌గా నిలిచింది.

  • 26 May 2024 07:30 PM (IST)

    తుది జట్లు ఇవే..

    కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేయింగ్ XI: (కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా మరియు వరుణ్ చక్రవర్తి.

    కోల్‌కతా నైట్ రైడర్స్ ఇంపాక్ట్ ప్లేయర్స్: ప్రకాష్ రాయ్, మనీష్ పాండే, నితీష్ రాణా, కేఎస్ భరత్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్.

    సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ ఎలెవన్: పాట్ కమిన్స్ (వికెట్ కీపర్), ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్‌రామ్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, టి నటరాజన్.

    సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇంపాక్ట్ ప్లేయర్స్: ఉమ్రాన్ మాలిక్, గ్లెన్ ఫిలిప్స్, మయాంక్ మార్కండే, అబ్దుల్ సమద్,  వాషింగ్టన్ సుందర్.

  • 26 May 2024 07:16 PM (IST)

    టాస్ గెలిచిన హైదరాబాద్..

    ఈ మ్యాచ్ లో టాస్  గెలిచిన హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. జట్టులో పెద్దగా మార్పుల్లేవు. వరుసగా విఫలమవుతోన్న సమద్ తుది జట్టులో చోటు కోల్పోయాడు.

  • 26 May 2024 07:13 PM (IST)

    కోల్‌కతా దే ఆధిపత్యం..

    ఇక ఐపీఎల్ చరిత్రలో కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ మొత్తం 27 సార్లు తలపడ్డాయి. ఈ 27 మ్యాచ్‌ల్లో కేకేఆర్‌దే ఆధిపత్యం. కోల్‌కతా మొత్తం 18 సార్లు గెలిచింది. కాగా హైదరాబాద్ 9 మ్యాచ్‌ల్లో కేకేఆర్‌ను ఓడించగలిగింది. KKR గత 8 మ్యాచ్‌లలో 6 గెలవడం గమనార్హం.

  • 26 May 2024 06:46 PM (IST)

    SRH బదులు తీర్చుకునేనా?

    IPL సీజన్ 17 చివరి మ్యాచ్‌కు ముందు, KKR vs హైదరాబాద్ మొత్తం 2 సార్లు తలపడింది. లీగ్ రౌండ్‌లో హైదరాబాద్‌పై కేకేఆర్ విజయం సాధించింది. ఆ తర్వాత క్వాలిఫయర్ 1 మ్యాచ్‌లో హైదరాబాద్‌ను ఓడించి ఫైనల్స్‌లోకి ప్రవేశించింది.

Published On - May 26,2024 7:06 PM

Follow us
Latest Articles
మీ మంచాన్ని మించిన మురికి ప్రదేశం మరొకటి లేదు..! పిల్లో కవర్‌లో..
మీ మంచాన్ని మించిన మురికి ప్రదేశం మరొకటి లేదు..! పిల్లో కవర్‌లో..
అమ్మబాబోయ్.. హనీరోజ్ అరాచకం.. రాచెల్ టీజర్ చూశారా..?
అమ్మబాబోయ్.. హనీరోజ్ అరాచకం.. రాచెల్ టీజర్ చూశారా..?
మొగదారమ్మకు ప్రత్యేక మొక్కులు.. సముద్రంలో చేపలవేటకు మత్స్యకారులు
మొగదారమ్మకు ప్రత్యేక మొక్కులు.. సముద్రంలో చేపలవేటకు మత్స్యకారులు
కూరల్లో రారాజు వంకాయతో బోలెడు ప్రయోజనాలు..తెలిస్తే ఇకపై తొక్కకూడా
కూరల్లో రారాజు వంకాయతో బోలెడు ప్రయోజనాలు..తెలిస్తే ఇకపై తొక్కకూడా
సూపర్ 8లో విధ్వంసం సృష్టించనున్న ముగ్గురు భారత ఆటగాళ్లు..
సూపర్ 8లో విధ్వంసం సృష్టించనున్న ముగ్గురు భారత ఆటగాళ్లు..
ఆహారంలో బ్లేడ్.. విమానంలో ఓ ప్రయాణీకుడి అనుభవం వైరల్..
ఆహారంలో బ్లేడ్.. విమానంలో ఓ ప్రయాణీకుడి అనుభవం వైరల్..
రాజమౌళి పిలిచి ఛాన్స్ ఇస్తే.. నో చెప్పిందట..!
రాజమౌళి పిలిచి ఛాన్స్ ఇస్తే.. నో చెప్పిందట..!
అమెజాన్‎లో ఆ పేరుతో గంజాయి అమ్మకం.. ఏపీ హోం మంత్రి అనిత కామెంట్స్
అమెజాన్‎లో ఆ పేరుతో గంజాయి అమ్మకం.. ఏపీ హోం మంత్రి అనిత కామెంట్స్
ఓట్స్‌తో ఇలా ప్యాక్ వేస్తే మీముఖం చంద్రబింబంలా మెరిసిపోవాల్సిందే!
ఓట్స్‌తో ఇలా ప్యాక్ వేస్తే మీముఖం చంద్రబింబంలా మెరిసిపోవాల్సిందే!
మిథున రాశిలో బుధ, శుక్రుల కలయిక... ఆ రాశుల వారికి శ్రమతో ధన లాభం!
మిథున రాశిలో బుధ, శుక్రుల కలయిక... ఆ రాశుల వారికి శ్రమతో ధన లాభం!