Asia cup 2023: టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఉచితంగానే ఆసియాకప్ మ్యాచ్‌లు చూడొచ్చు.. ఎలాగంటే?
Asia cup 2023 Live Streaming: ఆసియా కప్ ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య జరగనుంది. హైబ్రిడ్ మోడల్‌లో పోటీలు నిర్వహించనున్నారు. అంటే పాకిస్థాన్, శ్రీలంకలు ఆతిథ్యమిస్తున్నాయి. దీని ప్రకారం, టోర్నీలో మొత్తం 13 మ్యాచ్‌లు క్యాండీ, కొలంబో, ముల్తాన్, లాహోర్‌లలో జరుగుతాయి.

Asia cup 2023 Live Streaming: ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023 కంటే ముందుగా ఆసియా కప్ జరగనుంది. ఆసియా కప్ ఆగస్టు 30 నుంచి మొదలు కానుంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆసియా కప్ కోసం 17 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ తాజాగా ప్రకటించింది. 17 మంది సభ్యులతో కూడిన ఈ జట్టుకు రోహిత్ శర్మ నాయకత్వం వహించనున్నాడు. హార్దిక్ పాండ్యాకు వైస్ కెప్టెన్ పదవి దక్కింది. హార్దిక్‌కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు జస్ప్రీత్ బుమ్రా దక్కుతాయని నిన్నటి వరకు క్రికెట్‌లో చర్చ సాగింది. ఇదిలా ఉంటే, ఆసియా కప్ మ్యాచ్‌లను టీవీ, మొబైల్‌లో ఎక్కడ చూడాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆసియా కప్ షెడ్యూల్..
ఆసియా కప్ ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య జరగనుంది. హైబ్రిడ్ మోడల్‌లో పోటీలు నిర్వహించనున్నారు. అంటే పాకిస్థాన్, శ్రీలంకలు ఆతిథ్యమిస్తున్నాయి. దీని ప్రకారం, టోర్నీలో మొత్తం 13 మ్యాచ్‌లు క్యాండీ, కొలంబో, ముల్తాన్, లాహోర్‌లలో జరుగుతాయి. శ్రీలంకలో 9 మ్యాచ్‌లు నిర్వహించగా, పాకిస్థాన్‌లో కేవలం 4 మ్యాచ్‌లు జరగనున్నాయి.




పాకిస్థాన్‌లో మ్యాచ్‌లు ఎప్పుడు ప్రారంభమవుతాయి?
View this post on Instagram
పాకిస్థాన్‌లో జరిగే ఆసియా కప్‌లోని అన్ని మ్యాచ్‌లు IST మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతాయి.
శ్రీలంకలో మ్యాచ్‌లు ఎప్పుడు ప్రారంభమవుతాయి?
View this post on Instagram
టీమిండియా ఆడాల్సిన మ్యాచ్‌లన్నీ శ్రీలంకలోనే జరగనున్నాయి. మ్యాచ్‌లు శ్రీలంకలో మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతాయి.
మ్యాచ్‌లను ఏ ఛానెల్‌లలో చూడొచ్చు?
స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో టీవీలో ఆసియా కప్ మ్యాచ్‌లను క్రికెట్ అభిమానులు వీక్షించవచ్చు.
ఆసియా కప్ 2023 మ్యాచ్‌లను మొబైల్ లో ఎక్కడ చూడాలి?
ఆసియా కప్ 2023 అన్ని మ్యాచ్‌లను మొబైల్, ల్యాప్‌టాప్‌లో Disney+Hotstar యాప్‌లో చూడొచ్చు.
View this post on Instagram
ఆసియా కప్ కోసం టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసీద్ధ్ కృష్ణ.
View this post on Instagram
స్టాండ్‌బై | సంజు శాంసన్ (రిజర్వ్ వికెట్ కీపర్).
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




