Indian Cricket Team: కోహ్లీ తరువాత టెస్ట్ సారథిగా ఎవరు.. ఆయనవైపే బీసీసీఐ చూపు అంటోన్న మాజీలు..!

KL Rahul- Rohit Sharma: విరాట్ కోహ్లీ గాయం తర్వాత జోహన్నెస్‌బర్గ్ టెస్టులో టీమిండియా కమాండ్‌ని కేఎల్ రాహుల్ తీసుకున్నాడు. కోహ్లీ తప్పుకోవడంతో రాహుల్ పూర్తి సమయం కెప్టెన్‌గా మారే అవకాశం ఉంది.

Indian Cricket Team: కోహ్లీ తరువాత టెస్ట్ సారథిగా ఎవరు..  ఆయనవైపే బీసీసీఐ చూపు అంటోన్న మాజీలు..!
Virat Kohli Rohit Rahul
Follow us
Venkata Chari

|

Updated on: Jan 15, 2022 | 10:08 PM

KL Rahul- Rohit Sharma: విరాట్ కోహ్లీ (Virat Kohli Test Captaincy) టీ20, వన్డే కెప్టెన్సీ నుంచి వైదొలిగిన తర్వాత ప్రస్తుతం టెస్ట్ కెప్టెన్సీని కూడా విడిచిపెట్టాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌ను కోల్పోయిన తర్వాత విరాట్ కోహ్లీ ఈ నిర్ణయం తీసుకున్నాడు. విరాట్ కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీ నుంచి హఠాత్తుగా రాజీనామా చేయడంతో అభిమానులు షాక్ అవుతున్నారు. అయితే కోహ్లీ రెండు ఫార్మాట్లలో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటాడని సంకేతాలు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ప్రశ్న ఏమిటంటే, విరాట్ కోహ్లీ తర్వాత టీమిండియా తదుపరి టెస్ట్ కెప్టెన్ ఎవరు? రోహిత్ శర్మ వన్డే, టీ20 జట్ల కమాండ్‌ని తీసుకున్నాడు. అయితే రోహిత్ టెస్ట్ జట్టుకు కూడా కెప్టెన్ అవుతాడా? అనేది పెద్ద ప్రశ్నగా మారింది. మీడియా కథనాల ప్రకారం ఇది జరగడం చాలా కష్టమని తెలుస్తోంది. విరాట్ కోహ్లి రాజీనామా తర్వాత ప్రస్తుతం కేఎల్ రాహుల్ తదుపరి టెస్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.

దక్షిణాఫ్రికాతో జొహన్నెస్‌బర్గ్ టెస్టు జట్టులో భారత జట్టుకు కేఎల్ రాహుల్ బాధ్యతలు చేపట్టాడు. విరాట్ కోహ్లి టెస్ట్‌కు ముందు వెన్ను గాయంతో దూరమైన సంగతీ తెలిసిందే. ఆ తర్వాత కోహ్లీ రెండో టెస్ట్ మ్యాచ్ ఆడలేకపోయాడు. ఆ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. అయితే కేప్ టౌన్ టెస్టుకు ముందు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ కెప్టెన్సీపై ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుతం ప్రశ్న ఏమిటంటే, టెస్ట్ కెప్టెన్సీ కోసం పోటీదారులు ఎందరు ఉన్నారు? అనేది తెలియాల్సి ఉంది.

టెస్టు కెప్టెన్‌గా కేఎల్ రాహుల్..!

రోహిత్ శర్మకు మూడు ఫార్మాట్ల కెప్టెన్సీని ఇవ్వడం కుదరదు. ఎందుకంటే ఇప్పటికే బీసీసీఐ అధికారులు పరిమిత, సుధీర్థ ఓవర్లకు ఇద్దరు కెప్టెన్లను ఉంచలేమని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆడుతున్న క్రికెట్ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంటే, మూడు ఫార్మాట్ల కెప్టెన్సీని ఏ ఆటగాడికి అప్పగించడం చాలా కష్టం. రోహిత్ శర్మకు 3 నెలల తర్వాత 35 సంవత్సరాలు నిండనున్నాయి. అలాగే కేఎల్ రాహుల్ వయస్సు ప్రస్తుతం 29 సంవత్సరాలు. టెస్ట్ క్రికెట్‌లో కేఎల్ రాహుల్ బ్యాట్ పరుగులు తీస్తోంది. అతనిలో చాలా క్రికెట్ మిగిలి ఉంది. కేఎల్ రాహుల్ వచ్చే 4-5 ఏళ్ల పాటు టెస్టు జట్టును నిర్వహించగలడు.

ఇటీవల కేఎల్ రాహుల్‌కు కెప్టెన్సీలో మంచి అనుభవం వచ్చింది. ఈ ఆటగాడు IPLలో పంజాబ్ కింగ్స్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు. ప్రస్తుతం లక్నో ఫ్రాంచైజీకి కూడా కెప్టెన్‌గా మారే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుత టెస్ట్ జట్టు గురించి మాట్లాడుతూ, విరాట్ కోహ్లీ తర్వాత, కేఎల్ రాహుల్ అత్యంత ముఖ్యమైన బ్యాట్స్‌మెన్‌గా పరిగణించారు. అలాగే అతనికి మేనేజ్‌మెంట్ మద్దతు కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కేఎల్ రాహుల్ తదుపరి టెస్టు కెప్టెన్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.

Also Read: Virat Kohli: 4 నెలలు.. 4 ఫార్మాట్లు.. కెప్టెన్సీకి వీడ్కోలు చెప్పిన విరాట్ కోహ్లీ..!

Virat Kohli: ఆ కారణంతోనే కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నా.. కీలక విషయాలు వెల్లడించిన విరాట్ కోహ్లీ..!

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే