IND vs AUS: కెప్టెన్ రోహిత్ ఔట్.. ఆసీస్‌తో మొదటి టెస్టులో ఓపెనర్‌గా ఆ ఇద్దరికీ ఛాన్స్!

|

Nov 07, 2024 | 1:23 PM

ప్రస్తుతం ఇండియా A జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. ఆ తర్వాత నవంబర్ 22 నుంచి టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరగనుంది. అయితే ఈసిరీస్ ప్రారంభానికి ముందు టీమ్ ఇండియాకు పెద్ద సమస్య ఎదురైంది. దీనిపై జట్టు మేనేజ్‌మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఉత్కంఠగా మారింది.

IND vs AUS: కెప్టెన్ రోహిత్ ఔట్.. ఆసీస్‌తో మొదటి టెస్టులో ఓపెనర్‌గా ఆ ఇద్దరికీ ఛాన్స్!
Team India
Follow us on

నవంబర్ 22 నుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ‘ఇండియా ఎ’ ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది, ‘ఆస్ట్రేలియా ఎ’ జట్టుతో మ్యాచ్‌లు జరుగుతున్నాయి. గురువారం (నవంబర్ 7) నుంచి మెల్‌బోర్న్‌లో ఇండియా ఎ, ఆస్ట్రేలియా ఎ జట్ల మధ్య రెండో నాలుగు రోజుల మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు ప్లేయింగ్ 11లో పెద్ద మార్పు చోటు చేసుకుంది. కెఎల్ రాహుల్, ధృవ్ జురెల్ ఇద్దరూ ఇండియా ఎ ప్లేయింగ్ ఎలెవన్ లో కనిపించారు. వీరిద్దరూ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి కూడా జట్టులోకి ఎంపికయ్యారు. మరోవైపు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొలి టెస్టు మ్యాచ్ ఆడే అవకాశం లేదు. ఈ సమయంలో రోహిత్ భార్య రితికా సజ్దే ప్రసవించే అవకాశం ఉందని గత కొంతకాలంగా చర్చ జరుగుతోంది. కాబట్టి రోహిత్ శర్మ తొలి టెస్టు మ్యాచ్‌లో ఆడకపోవచ్చు. పెర్త్ టెస్టులో టీమిండియా కొత్త ఓపెనింగ్ జోడీతో బరిలోకి దిగే అవకాశం ఉంది. అయితే యశస్వి జైస్వాల్‌కు తోడుగా ఈ టెస్టులో ఇన్నింగ్స్‌ను ఎవరు ప్రారంభిస్తారు? ఇదే ప్రశ్న. ఇండియా ఎ, ఆస్ట్రేలియా ఎ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లో ఈ నిర్ణయం తీసుకోవచ్చు. ఈ స్థానం కోసం కేఎల్ రాహుల్, అభిమన్యు ఈశ్వరన్ పోటీ పడుతున్నారు.

ఆస్ట్రేలియా ఎతో జరుగుతున్న తొలి నాలుగు రోజుల మ్యాచ్‌లో అభిమన్యు ఈశ్వరన్, కెప్టెన్ రీతురాజ్ గైక్వాడ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. రెండో మ్యాచ్‌లో అభిమన్యు ఈశ్వరన్‌తో కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేయగలడు. నివేదికల ప్రకారం, రాహుల్,
ఈశ్వరన్ ఓపెనింగ్ స్థానం కోసం ప్రత్యక్ష పోటీలో ఉన్నారు. వీరిద్దరిలో ఎవరు మెరుగ్గా ఉంటే తొలి టెస్టులో రోహిత్‌కు చోటు దక్కుతుంది. మిడిలార్డర్‌లో కెప్టెన్ రితురాజ్ గైక్వాడ్ ఆడగలడు. ఇషాన్ కిషన్ స్థానంలో జురెల్ వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టవచ్చు.

కేఎల్ రాహుల్ నిలబడతాడా?

కేఎల్ రాహుల్ 2023-24 దక్షిణాఫ్రికా పర్యటన నుంచి టెస్టుల్లో మిడిల్ ఆర్డర్‌లో ఆడుతున్నాడు. ఈ సమయంలో అతను 10 ఇన్నింగ్స్‌లలో 37.66 సగటుతో 339 పరుగులు చేశాడు. రాహుల్‌కి విదేశాల్లో కొత్త బంతితో ఆడిన అనుభవం ఉంది. ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలో టెస్టుల్లో సెంచరీలు చేసిన బ్యాటర్లలో అతను కూడా ఒకడు. కాబట్టి రాహుల్‌కు మరోసారి ఓపెనింగ్‌ అవకాశం లభించవచ్చు. మరోవైపు, అభిమన్యు ఈశ్వరన్ కూడా ఇటీవల మంచి ప్రదర్శన ఇచ్చాడు. ఫస్ట్ క్లాస్‌లో 27 సెంచరీలు సాధించాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.