
టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ ప్రస్తుతం ఐపీఎల్ కోసం సన్నద్ధమవుతున్నాడు. గాయం కారణంగా గత కొన్ని నెలలుగా మైదానానికి దూరంగా ఉన్న అతను ఇప్పుడు పూర్తి ఫిట్ నెస్ సాధించాడు. దీంతో ఐపీఎల్-2024లో లక్నో సూపర్ జెయింట్స్ నాయకుడి హోదాలో అడుగుపెట్టనున్నాడు. కాగా మరికొన్ని గంటల్లో ఈ ధనాధన్ లీగ్ ప్రారంభం కానుండగా కేఎల్ రాహుల్ ఆధ్యాత్మిక సేవలో మునిగిపోయాడు. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహాకాలేశ్వర్ ఆలయాన్ని దర్శించుకున్ను. గతంలో భార్య అతియాశెట్టితో కలిసి మహాకాలేశ్వర్ ఆలయానికి వెళ్లిన రాహుల్ ఈసారి తల్లిదండ్రులతో వెళ్లాడు. బుధవారం ఉదయాన్నే ఆలయానికి వెళ్లిన రాహుల్ అక్కడ భస్మా హారతి ఆ తర్వాత మహా దేవుడికి ప్రత్యేక పూజలు నిర్వహించాడు. ఆతర్వాత అక్కడి వేద పండితుల ఆశీర్వాదం అందుకున్నాడు. కాగా ఈ ఆలయానికి ప్రత్యేకత ఉంది. గతంలో విరాట్ కోహ్లీ దంపతులు ఇక్కడే ప్రత్యేక పూజలు నిర్వహించాడు. అంతకు ముందు పరుగులు చేయలేక సతమతమవుతోన్న కోహ్లీ ఇక్కడి పూజల తర్వాత పరుగుల వరద పారించాడు. మరి రాహుల్ కూడా ఐపీఎల్ లో సత్తా చాటుతాడా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.
లక్నో జట్టుకు సారథ్యం వహిస్తోన్న రాహుల్ గతేడాది ఐపీఎల్ లో తీవ్రంగా గాయపడ్డాడు. ఆ తర్వాత కీలక మ్యాచ్ లకు దూరమయ్యాడు. దీంతో కృనాల్ పాండ్యా కు లక్నో పగ్గాలు అప్పజెప్పారు. అయితే కృనాల్ కెప్టెన్సీలో ప్లే ఆఫ్స్ వరకు మాత్రమే వెళ్లగలిగింది లక్నో. తొడ కండరాల గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్న రాహుల్ ప్రపంచకప్ లో రీ ఎంట్రీ ఇచ్చాడు. బ్యాటర్ గానూ, వికెట్ కీపర్ గానూ అదరగొట్టాడు. అయితే ఇటీవల స్వదేశంలో జరిగిన ఇంగ్లండ్ తో టెస్ట్ సిరీస్ లో మళ్లీ గాయపడ్డాడు. దీంతో లండన్ వెళ్లి మళ్లీ వైద్య నిపుణులను సందర్శించాడు. ఆ తర్వాత బెంగళూరు క్రికెట్ అకాడమీలో శిక్షణ పొంది పూర్తి ఫిట్ నెస్ సాధించాడు.
#WATCH | Cricketer KL Rahul offered prayers at Mahakaleshwar Temple in Ujjain, Madhya Pradesh today. pic.twitter.com/5dvZybtgAu
— ANI (@ANI) March 20, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..