IND vs SA: మొదటి టెస్ట్‎లో ఐదుగురు బౌలర్లతో బరిలోకి భారత్..! హింట్ ఇచ్చిన కేఎల్ రాహుల్..

దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు ముందు భారత వైస్ కెప్టెన్, KL రాహుల్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు...

IND vs SA: మొదటి టెస్ట్‎లో ఐదుగురు బౌలర్లతో బరిలోకి భారత్..! హింట్ ఇచ్చిన కేఎల్ రాహుల్..
Kl Rahul
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Dec 24, 2021 | 9:32 PM

దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు ముందు భారత వైస్ కెప్టెన్, KL రాహుల్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. టెస్ట్ వైస్-కెప్టెన్ రోహిత్ శర్మ గైర్హాజరీలో విరాట్ కోహ్లీకి డిప్యూటీగా కేఎల్ రాహుల్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. సెంచూరియన్‌లో ప్రారంభ టెస్ట్‌లో భారత జట్టు కూర్పుపై రాహుల్ మాట్లాడాడు. బాక్సింగ్ డే టెస్ట్ కోసం ఐదుగురు బౌలర్ల వ్యూహాన్ని సూచించాడు.

“ప్రతి జట్టు టెస్ట్ మ్యాచ్ గెలవడానికి 20 వికెట్లు తీయాలని కోరుకుంటుంది. మేము ఆ వ్యూహాన్ని ఉపయోగించాలనుకుంటున్నాం.” అని శుక్రవారం వర్చువల్ మీడియా సమావేశంలో రాహుల్ అన్నారు. “ఐదుగురు బౌలర్‌లతో వర్క్‌లోడ్‌ తగ్గుతుంది.” అని ఓపెనర్ చెప్పాడు.

సూపర్‌స్పోర్ట్ పార్క్ ట్రాక్ నెమ్మదిగా ఉంటుందని ప్రత్యర్థి సీమర్ డువాన్ ఆలివర్ చేసిన వాదనతో రాహుల్ కూడా ఏకీభవించాడు. “ఈ పరిస్థితులు మా కంటే డువాన్ ఆలివర్‌కి బాగా తెలుస్తాయని నేను భావిస్తున్నాను. గతంలో మేము ఇక్కడ ఆడాం, వికెట్ కొంచెం నెమ్మదిగా ప్రారంభమైంది. తరువాత వేగవంతమైంది. మళ్లీ నెమ్మదిగా మారింది.” మేము సెంటర్ వికెట్ ప్రాక్టీస్ చేశాం.” అని రాహుల్ చెప్పాడు.

Read Also.. IND vs SA: మీడియా సమావేశానికి విరాట్ కోహ్లీ రాడటా.. ఎందుకంటే..