KKR vs SRH, IPL 2022 : ఆల్‌రౌండ్ ఫెర్ఫామెన్స్‌తో అదరగొట్టిన ఆండ్రీ రస్సెల్‌.. సన్‌రైజర్స్‌పై కోల్‌కతా సూపర్‌ విక్టరీ.. ప్లే ఆఫ్‌ అవకాశాలు సజీవం..

KKR vs SRH, IPL 2022 :. 177 పరుగుల లక్ష్య ఛేదనలో హైదరాబాద్‌ పూర్తిగా చేతులెత్తేసింది. ఆరంభం నుంచే వరుస విరామాల్లో వికెట్లో కోల్పోయింది. ఏ దశలోనూ విజయం సాధించేలా కనిపించేలా లేదు. అభిషేక్‌ శర్మ(43), మర్‌క్రమ్‌(32), శశాంక్‌ సింగ్‌ (11) మినహా అందరూ సింగిల్‌ డిజిట్‌ స్కోర్‌కే పరిమితమయ్యారు.

KKR vs SRH, IPL 2022 : ఆల్‌రౌండ్ ఫెర్ఫామెన్స్‌తో అదరగొట్టిన ఆండ్రీ రస్సెల్‌.. సన్‌రైజర్స్‌పై కోల్‌కతా సూపర్‌ విక్టరీ.. ప్లే ఆఫ్‌ అవకాశాలు సజీవం..
Kkr Vs Srh
Follow us
Basha Shek

|

Updated on: May 15, 2022 | 12:18 AM

KKR vs SRH, IPL 2022 : ప్లే ఆఫ్‌ రేసులో నిలవాలంటే తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్‌లో కోల్‌కతా జట్టు అదరగొట్టింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో సమష్ఠిగా రాణించి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను మట్టి కరిపించింది. శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌ (KKR vs SRH)లో ఆ జట్టు హైదరాబాద్‌పై 54 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 177 పరుగుల లక్ష్య ఛేదనలో హైదరాబాద్‌ పూర్తిగా చేతులెత్తేసింది. ఆరంభం నుంచే వరుస విరామాల్లో వికెట్లో కోల్పోయింది. ఏ దశలోనూ విజయం సాధించేలా కనిపించేలా లేదు. అభిషేక్‌ శర్మ(43), మర్‌క్రమ్‌(32), శశాంక్‌ సింగ్‌ (11) మినహా అందరూ సింగిల్‌ డిజిట్‌ స్కోర్‌కే పరిమితమయ్యారు. దీంతో 20 ఓవర్లు ముగిసే సరికి 8 వికెట్ల నష్టానికి కేవలం 123 పరుగులు మాత్రమే చేసి 54 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది హైదరాబాద్‌. స్టార్ ఆల్‌రౌండర్‌ (49, 22/3) ఆల్‌రౌండ్‌ ప్రతిభతో హైదరాబాద్‌ను దెబ్బకొట్టాడు. అతనికే ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ పురస్కారం లభించింది. కాగా ఈ విజయంతో కోల్‌కతా ప్లే ఆఫ్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. కాగా వరుసగా ఐదో విజయం, ఓవరాల్‌గా ఏడు పరాజయాలు పొందిన సన్‌రైజర్స్ ప్లే ఆఫ్‌ ఛాన్స్ లను సంక్లిష్టం చేసుకుంది.

ఆఖర్లో మెరుపులు.. అంతకుముందు టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్న కేకేఆర్‌కు శుభారంభం దక్కలేదు. వెంకటేశ్‌ అయ్యర్‌ (7) మార్కొ జాన్సెన్‌ బౌలింగ్‌లో త్వరగానే ఔటయ్యాడు. ఆ తర్వాత రహానె (28), నితీశ్‌ రాణా (26) నింపాదిగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లారు. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (15) మరోసారి నిరాశపర్చినా సామ్ బిల్లింగ్స్ (34) జట్టును ఆదుకున్నాడు. ఇక ఎప్పటిలాగే ఆఖర్లో ఆండ్రీ రస్సెల్‌ మెరుపులు మెరిపించాడు. 28 బంతుల్లో 49 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు ఉన్నాయి. హైదరాబాద్‌ బౌలర్లలో ఉమ్రాన్‌ మాలిక్‌ (33/3) మళ్లీ అదరగొట్టాడు. భువనేశ్వర్‌ (27/1), జాన్సన్‌ (30/1), నటరాజన్‌ (43/1) పర్వాలేదనిపించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read: 

IPL 2022 KKR vs SRH Score: దంచికొట్టిన రస్సెల్‌.. హైదరాబాద్‌ లక్ష్యం ఎంతంటే..

Special Trains: రైల్వే ప్రయాణికులకు అలెర్ట్.. వేసవి సెలవుల్లో మరిన్ని స్పెషల్‌ రైళ్లు.. పూర్తి వివరాలివే..

Amit Shah: తెలంగాణను మరో బెంగాల్‌లా మారుస్తున్నారు.. కేసీఆర్‌పై విరుచుకుపడిన అమిత్‌షా..