Kavya Maran : ఎట్టకేలకు పెళ్లి పీటలెక్కబోతున్న కావ్యామారన్.. వరుడు ఎవరో లీక్ చేసిన స్టార్ హీరో అంకుల్
Kavya Maran : కావ్య మారన్, అనిరుధ్‌ల మధ్య లవ్ ఎఫైర్ నడుస్తోందంటూ వార్తలు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ పలుమార్లు గాసిప్స్ వచ్చాయి.వీరిద్దరి పెళ్లి ముచ్చట దాదాపు ఖాయమైందంటూ అనిరుధ్ కుటుంబ సభ్యుడే స్వయంగా లీక్ చేశారు.

Kavya Maran : ఐపీఎల్ మ్యాచ్‌లు చూసే ప్రతి ఒక్కరికీ సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) టీమ్ సీఈఓ కావ్య మారన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. స్టేడియంలో తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కుర్రాళ్ల గుండెల్లో స్థానం సంపాదించుకున్న కావ్య మారన్ పెళ్లి గురించిన వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఆమె పెళ్లి చేసుకోబోయే వ్యక్తి మరెవరో కాదు.. సౌత్ ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ స్టార్ మ్యూజిక్ కంపోజర్ అనిరుధ్ రవిచందర్ అని తెలుస్తోంది. వీరిద్దరి పెళ్లి ముచ్చట దాదాపు ఖాయమైందంటూ అనిరుధ్ కుటుంబ సభ్యుడే స్వయంగా లీక్ చేయడంతో ఈ వార్త ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.
అనిరుధ్ అంకుల్ వైజీ మహేంద్రన్ సంచలన కామెంట్స్
అసలు ఈ పెళ్లి వార్త ఒక్కసారిగా ఎలా తెరపైకి వచ్చిందంటే.. తాజాగా ఒక ప్రముఖ ఇంటర్వ్యూలో అనిరుధ్ బాబాయ్ (అంకుల్), సీనియర్ నటుడు వైజీ మహేంద్రన్ పాల్గొని పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అనిరుధ్ పెళ్లి ఎప్పుడు అని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. ‘అనిరుధ్ చాలా పద్ధతి గల కుర్రాడు. నాకు అందిన సమాచారం ప్రకారం కావ్య మారన్‌తో అతడి పెళ్లి దాదాపు ఖాయమైపోయింది. అనిరుధ్ దేశంలోనే చాలా పెద్ద బిజినెస్ ఫ్యామిలీలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ శుభసందర్భంలో నేను అతనికి ముందుగానే అభినందనలు తెలియజేస్తున్నాను’ అని చెప్పడంతో అందరూ షాక్‌కు గురయ్యారు.
కావ్య మారన్ సామాన్యమైన అమ్మాయి కాదు
ఇదే ఇంటర్వ్యూలో వైజీ మహేంద్రన్ కావ్య మారన్ గురించి మాట్లాడుతూ ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు. కావ్య మారన్ కేవలం ఒక పెద్ద కోటీశ్వరుడి కూతురు మాత్రమే కాదని, ఆమె చాలా తెలివైనదని కొనియాడారు. అంత పెద్ద ఐపీఎల్ టీమ్‌ను ఒంటిచేత్తో నడిపించే సత్తా, వ్యాపార మెళకువలు ఆమెకు వాళ్ల నాన్న (కళానిధి మారన్) నుంచే వారసత్వంగా వచ్చాయని అన్నారు. అనిరుధ్, కావ్యల జోడీ చూడముచ్చటగా ఉంటుందని, పెళ్లి తర్వాత వీరిద్దరూ కలిసి మ్యూజికల్ బిజినెస్‌లోకి అడుగుపెడితే తిరుగుండదని ఆయన తన మనసులోని మాటను బయటపెట్టారు.
పెళ్లి ఎప్పుడు.. ఎక్కడ?
అనిరుధ్ అంకుల్ పెళ్లి మ్యాటర్ లీక్ చేసినప్పటికీ, ఈ పెళ్లి వేడుకలు ఎప్పుడు జరుగుతాయి, పెళ్లి వేదిక ఎక్కడ అనే విషయాలపై ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. సన్ నెట్‌వర్క్ అధినేత కళానిధి మారన్ కుటుంబం కానీ, అటు అనిరుధ్ కుటుంబం కానీ ఈ పెళ్లి వార్తలపై ఇంకా పెదవి విప్పలేదు. ఇరు కుటుంబాల నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వస్తేనే కానీ ఈ పెళ్లి ముహూర్తం ఎప్పుడనేది కచ్చితంగా తెలియదు.
గతంలోనే వైరల్ అయిన వీరిద్దరి డేటింగ్ రూమర్స్
నిజానికి కావ్య మారన్, అనిరుధ్‌ల మధ్య లవ్ ఎఫైర్ నడుస్తోందంటూ వార్తలు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ పలుమార్లు గాసిప్స్ వచ్చాయి. ముఖ్యంగా 2025లో ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ రెడిట్ లో వైరల్ అయిన ఒక పోస్ట్‌లో.. వీరిద్దరూ దాదాపు ఒక ఏడాది కాలంగా సీక్రెట్‌గా ప్రేమించుకుంటున్నారని క్లెయిమ్ చేశారు. అప్పట్లో ఈ వార్తలను ఇరుపక్షాలు ఖండించలేదు, అలాగని అవునని కూడా చెప్పలేదు. ఇప్పుడు ఏకంగా పెళ్లి పీటల వరకు ఈ మ్యాటర్ వెళ్లడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
