Team India: ఆ చెత్త ప్లేయర్‌ను తీసిపారేయండి.. నెం 3లో ఆయన బెస్ట్..: మాజీ ప్లేయర్
Karun Nair: కరుణ్ నాయర్ ఎనిమిదేళ్ల తర్వాత టెస్ట్ జట్టులోకి తిరిగి వచ్చాడు. కానీ ప్రస్తుత సిరీస్‌లో అతను ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. ఆరు ఇన్నింగ్స్‌లలో 131 పరుగులు మాత్రమే చేసి, సగటు 21.83గా ఉంది. నెం. 3 బ్యాటర్‌గా అతని నుంచి ఆశించిన స్థిరత్వం, పెద్ద స్కోర్లు రాలేదని దాస్‌గుప్తా అభిప్రాయపడ్డారు.

Karun Nair: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో భారత జట్టు ప్రదర్శనపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మూడో టెస్టులో కరుణ్ నాయర్ ప్రదర్శనపై పలువురు మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో, మాజీ భారత వికెట్ కీపర్ బ్యాటర్ దీప్ దాస్‌గుప్తా, కరుణ్ నాయర్ నెం. 3 స్థానంలో ఉండటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, అతని స్థానంలో మరొక యువ ఆటగాడిని సూచించారు.
దాస్‌గుప్తా మాట్లాడుతూ, “ప్లేయింగ్ ఎలెవెన్‌లో ఒకరి కంటే ఎక్కువ మార్పులు ఉండకూడదని అనుకుంటే, కరుణ్ నాయర్ స్థానంలో సాయి సుదర్శన్ ఉండాలి. ఎందుకంటే కరుణ్ నాయర్ పరుగులు చేయలేదు. అతను మంచి ఆరంభాలు పొందుతున్నప్పటికీ, వాటిని పెద్ద స్కోర్లుగా మార్చలేకపోతున్నాడు. అంతేకాకుండా, క్రీజులో అతను అంత సౌకర్యవంతంగా కూడా కనిపించడం లేదు” అని వ్యాఖ్యానించారు.
జియో హాట్‌స్టార్‌తో మాట్లాడిన దాస్‌గుప్తా, సాయి సుదర్శన్‌ను జట్టులోకి తీసుకోవడం వెనుక ఉన్న తర్కాన్ని కూడా వివరించారు. “రెండవది, సాయి సుదర్శన్ ఒక యువ ఆటగాడు. ఈ ఇంగ్లాండ్ సిరీస్‌లో పెట్టుబడి పెట్టాలనుకుంటే, యువ ఆటగాడిపై పెట్టుబడి పెట్టడం మంచిది. కరుణ్ నాయర్ రెండు టెస్ట్ మ్యాచ్‌లలో ఆరంభాలు సాధించినప్పటికీ, అంత నమ్మకంగా కనిపించడం లేదు. కాబట్టి మీరు భవిష్యత్తు కోసం జట్టును నిర్మించాలనుకుంటే, సాయి సుదర్శన్ లాంటి ఆటగాడిపై పెట్టుబడి పెట్టడం మంచిది. ఎందుకంటే ఆ తర్వాత మళ్లీ ఇంగ్లాండ్‌కు ఎప్పుడు వస్తారో తెలియదు. కాబట్టి రెండు టెస్టులు మిగిలి ఉండగా, సాయి సుదర్శన్‌పై పెట్టుబడి పెట్టండి” అని ఆయన అన్నారు.
కరుణ్ నాయర్ ఎనిమిదేళ్ల తర్వాత టెస్ట్ జట్టులోకి తిరిగి వచ్చాడు. కానీ ప్రస్తుత సిరీస్‌లో అతను ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. ఆరు ఇన్నింగ్స్‌లలో 131 పరుగులు మాత్రమే చేసి, సగటు 21.83గా ఉంది. నెం. 3 బ్యాటర్‌గా అతని నుంచి ఆశించిన స్థిరత్వం, పెద్ద స్కోర్లు రాలేదని దాస్‌గుప్తా అభిప్రాయపడ్డారు.
సాయి సుదర్శన్ విషయానికొస్తే, అతను మొదటి టెస్ట్‌లో ఆడాడు. మొదటి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయినప్పటికీ, రెండవ ఇన్నింగ్స్‌లో 30 పరుగులు చేసి కొంత నమ్మకం కలిగించాడు. అయితే, ఆ తర్వాత అతన్ని జట్టు నుంచి తొలగించారు. యువతకు అవకాశం ఇవ్వాలనే వాదన బలంగా ఉన్న నేపథ్యంలో, రాబోయే నాలుగో టెస్టులో టీమ్ మేనేజ్‌మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
ఈ మాజీ ఆటగాడి సూచన ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కరుణ్ నాయర్‌కు మరో అవకాశం ఇస్తారా లేక సాయి సుదర్శన్‌కు అవకాశం కల్పిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




