AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rinku Singh : ఇక నుంచి ‘సంకటమోచక్’ అని పిలవాలా? మ్యాచ్ తర్వాత దీనికి రింకూ ఇచ్చిన ఆన్సర్ ఇదే

Rinku Singh : లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ పరిస్థితి ఒకానొక దశలో ఘోరంగా ఉంది. 140 పరుగులకే పరిమితం అవుతుందనుకున్న స్కోరును రింకూ సింగ్ ఎవరూ ఊహించని రీతిలో పెంచాడు. చివరి ఓవర్‌లో దిగ్వేవ్ రాఠీ బౌలింగ్‌లో ఏకంగా 4 సిక్సర్లు బాదాడు.

Rinku Singh : ఇక నుంచి ‘సంకటమోచక్’ అని పిలవాలా?  మ్యాచ్ తర్వాత దీనికి రింకూ ఇచ్చిన ఆన్సర్ ఇదే
Rinku Singh
Rakesh
|

Updated on: Apr 27, 2026 | 9:40 AM

Share

Rinku Singh : ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మళ్ళీ ఫామ్‌లోకి వచ్చింది. ఆ జట్టును ఓటమి అంచుల్లో నుంచి గెలుపు తీరాలకు చేర్చడంలో రింకూ సింగ్ మరోసారి తన మార్కును చూపించాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో రింకూ సింగ్ ఆడిన ఇన్నింగ్స్ హైలైట్‌గా నిలిచింది. కేకేఆర్ వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో ఒంటరి పోరాటం చేసిన రింకూ.. జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు. మ్యాచ్ అనంతరం అతను మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ పరిస్థితి ఒకానొక దశలో ఘోరంగా ఉంది. 140 పరుగులకే పరిమితం అవుతుందనుకున్న స్కోరును రింకూ సింగ్ ఎవరూ ఊహించని రీతిలో పెంచాడు. చివరి ఓవర్‌లో దిగ్వేవ్ రాఠీ బౌలింగ్‌లో ఏకంగా 4 సిక్సర్లు బాదాడు. మొత్తం 51 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 83 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కేకేఆర్ మొత్తం స్కోరు 155 కాగా, అందులో సగానికి పైగా పరుగులు రింకూవే కావడం విశేషం. మిగిలిన బ్యాటర్లలో కేమరూన్ గ్రీన్ (34) తప్ప ఎవరూ రెండంకెల స్కోరు కూడా దాటలేదు.

మ్యాచ్ ముగిసిన తర్వాత ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న రింకూను హోస్ట్ ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడిగాడు. “కేకేఆర్‌ను మీరు ప్రతిసారి కష్టాల నుంచి కాపాడుతున్నారు కదా.. మీ పేరును రింకూ సంకటమోచక్ అని మార్చేద్దామా?” అని అడిగారు. దానికి రింకూ నవ్వుతూ.. “వద్దు, నా పేరు రింకూ అని ఉంటేనే చాలు, అదే నాకు ఇష్టం” అని ఆన్సర్ ఇచ్చాడు. ఈ సమాధానం విన్నాక స్టేడియం చప్పట్లతో మారుమోగిపోయింది. రింకూలోని నిరాడంబరతకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

తమ జట్టు 3-4 వికెట్లు కోల్పోయినప్పుడు తన మైండ్‌సెట్ ఎలా ఉంటుందో రింకూ వివరించాడు. “నేను బ్యాటింగ్‌కు వెళ్ళేటప్పుడు వికెట్లు పడి ఉంటే.. నా మొదటి లక్ష్యం ఆటను కంట్రోల్ చేయడం. స్ట్రైక్ రొటేట్ చేస్తూ సింగిల్స్, డబుల్స్ తీయడంపై దృష్టి పెడతాను. బౌలర్ తప్పు చేస్తే తప్ప బాదడానికి ప్రయత్నించను. గేమ్ చివరి వరకు తీసుకెళ్లాలనేదే నా ప్రధాన ఉద్దేశం” అని తెలిపాడు. ఇక చివరి ఓవర్‌లో స్పిన్నర్ బౌలింగ్ చేయడంతో తనకు అనుకూలించిందని, దానికి తగ్గట్టుగా షాట్లు ఆడానని చెప్పుకొచ్చాడు.

రింకూ కేవలం బ్యాటింగ్‌తోనే కాదు, తన అద్భుతమైన ఫీల్డింగ్‌తోనూ ఆకట్టుకున్నాడు. సూపర్ ఓవర్ లాంటి ఉత్కంఠ రేపిన ఒక క్యాచ్‌ను అతను అద్భుతంగా అందుకున్నాడు. దీనిపై స్పందిస్తూ.. “నాకు చిన్నప్పటి నుంచి ఫీల్డింగ్ అంటే చాలా ఇష్టం. నేను సహజంగానే ఫిట్‌గా ఉంటాను కాబట్టి గ్రౌండ్‌లో వేగంగా పరిగెత్తగలను. ఆ క్యాచ్ విషయంలో నేను మొదట సిద్ధంగా లేను, బంతి ఎటో వెళ్తుంది అనుకున్నాను. కానీ అకస్మాత్తుగా నా వైపు రావడంతో వెంటనే అలర్ట్ అయ్యి అందుకున్నాను” అని రింకూ వివరించాడు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us