Team India: విరాట్, రోహిత్ వల్లే ఈ కష్టాలు.. అయ్యో.! పాపం అంటున్న ఫ్యాన్స్
JioHotstar భారీ నష్టాల కారణంగా ICC డిజిటల్ రైట్స్ ఒప్పందం నుంచి వైదొలిగింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల రిటైర్మెంట్ తర్వాత క్రికెట్ క్రేజ్ తగ్గడం, ఇతర టోర్నీలకు ఆదరణ లేకపోవడంతో హాట్‌స్టార్ భారీ నష్టాలు చవిచూసింది. మరి ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓసారి లుక్కేయండి.

క్రికెట్ అంటే మన ఫ్యాన్స్‌కు భలే ఇష్టం అని చెప్పొచ్చు. మ్యాచ్ ఏదైనా కూడా టీవీలకు అతుక్కుపోయి మరీ చూస్తారు. ఇక ఇటీవల ఐపీఎల్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను బీసీసీఐ రికార్డు స్థాయిలో రూ. 37 వేల కోట్లకు అమ్మిన సంగతి తెలిసిందే. అయితే ఇదే సమయంలో ఐసీసీ ఈవెంట్‌ల డిజిటల్ హక్కుల కోసం రూ. 29 వేల కోట్లు చెల్లించిన JioHotstar.. అనూహ్యంగా ఒప్పందం నుంచి తప్పుకుంది. రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ.. భారీ నష్టాలు కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది ఆ సంస్థ. టీ20 ప్రపంచకప్ మరో రెండు నెలల్లో ప్రారంభం కానున్న నేపధ్యంలో JioHotstar ఇలా తప్పుకోవడం ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది.
ఇటీవల కాలంలో దేశంలో క్రికెట్‌కు ఆదరణ కరువైంది. భారత స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల రిటైర్మెంట్ తర్వాత ఈ క్రేజ్ మరింతగా తగ్గిందని చెబుతున్నారు. స్టేడియాలలో కూడా అభిమానుల రద్దీ తగ్గడం క్రికెట్ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది. 2024 టీ20 ప్రపంచకప్‌కు వీక్షకులు ఉన్నప్పటికీ.. ఆ తర్వాత జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీకి ఆశించిన స్థాయిలో ఆదరణ దక్కలేదు. ఇక డబ్ల్యూటీసీ, మహిళల వన్డే వరల్డ్‌కప్‌కు చెప్పనక్కర్లేదు. ఈ పరిస్థితుల్లోనే జియో హాట్‌స్టార్ భారీగా నష్టాలు చవి చూడాల్సి వచ్చింది. ఇంతటి బడా ఓటీటీ ఫ్లాట్‌ఫార్మ్ రేసు నుంచి తప్పుకోవడంతో డిజిటల్ రైట్స్ దక్కించుకునేందుకు Amazon Prime Video, Netflix, Sony Pictures వంటి సంస్థలు సంప్రదింపులు జరుపుతున్నాయని సమాచారం. కాగా, రోహిత్, విరాట్ వంటి స్టార్ ప్లేయర్స్ కొనసాగుతుంటే.. JioHotstarకు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని, వారి రిటైర్‌మెంట్ ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ చూడండి








