IND vs PAK: అదరగొట్టిన జెమీమా.. ప్రపంచకప్‌లో టీమిండియా శుభారంభం.. పాక్‌పై సూపర్ విక్టరీ
భారత అమ్మాయిలు అదరగొట్టారు. దక్షిణాఫ్రికా వేదికగా జరగుతున్న టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్ జట్టును 7 వికెట్ల తేడాతో చిత్తు చేశారు. తద్వారా ప్రపంచకప్‌లో తమ పోరాటాన్ని ఘనంగా ప్రారంభించింది.

భారత అమ్మాయిలు అదరగొట్టారు. దక్షిణాఫ్రికా వేదికగా జరగుతున్న టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్ జట్టును 7 వికెట్ల తేడాతో చిత్తు చేశారు. తద్వారా ప్రపంచకప్‌లో తమ పోరాటాన్ని ఘనంగా ప్రారంభించింది. 150 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు 19 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి అందుకుంది. జెమీమా రోడ్రిగ్స్ (38 బంతుల్లో 53, 8 ఫోర్లు) టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించింది. షెఫాలీ వర్మ (33), రిచా ఘోష్ (31) రాణించారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (16), యాస్తికా భాటియా(17) నిరాశపర్చారు. పాక్ బౌలర్లలో నష్రా సంధు 2 వికెట్లు, సదియా ఇక్బాల్ ఒక వికెట్ చొప్పున పడగొట్టారు. 53 పరుగులతో భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన జెమీమాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం లభించింది. కాగా ఈ మ్యాచ్ తో భారత జట్టు పలు రికార్డులు తన ఖాతాలో వేసుకుంది. మహిళల ప్రపంచకప్ లో అత్యధిక పరుగులను ఛేదించిన రెండో జట్టుగా టీమిండియా రికార్డు సృష్టించింది.
రిచా, జెమీమా మెరుపులు..
కాగా ఈ మ్యాచ్లో స్ట్ బ్యాటింగ్ చేసిన పాక్.. 4 వికెట్లు కోల్పోయి 149 పరులుగు చేసింది. ఒక ఓవర్ మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది హర్మన్ ప్రీత్ కౌర్ సేన. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్తాన్ టాప్ ఆర్డర్ అడ్డుకోవడంలో భారత్ బౌలర్లు సక్సెస్ అయ్యారు. ఓపెనర్ జవేరియా ఖాన్‌ను 8 పరుగులకే అవుట్ చేసింది దీప్తి శర్మ. మరికాసేపటికే మునీబ అలి 12, నిదా దార్‌ను డకౌట్ చేసి మంచి బ్రేక్ అందించారు. కాసేపటికే సిద్రా అమీన్ కూడా 11 పరుగులకే పెవిలియన్ కు చేరింది. దాంతో పాకిస్తాన్ 68 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే ఆ తర్వాత వికెట్లు పడగొట్టలేకపోయారు భారత్ బౌలర్లు. అప్పటి వరకు అద్బుతంగా బౌలింగ్ చేసిన భారత బౌలర్లు లయ తప్పారు. అదే సమయంలో ఫీల్డర్లు కూడా మైదానంలో తడబడ్డారు. క్రీజులో నిలదొక్కుకున్న బిస్మా మరూఫ్ 55 బంతుల్లో 68 నాటౌట్‌గా నిలిచి కెప్టెన్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టును ముందుకు నడిపింది. అయేషా నసీం ధనాధన్ ఇన్నింగ్స్ ఆడి.. 25 బంతుల్లో 43 పరుగులు చేసింది. దీంతో పాకిస్తాన్ 20 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 149 పరుగులు చేసింది. భారత బౌలర్లలో రాధా యాదవ్ 2 వికెట్లు తీసింది. లక్ష్య ఛేదనలో 93కే భారత్ 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న టీమిండియాను.. చివర్లో రిచా ఘోష్, జెమీమా మెరుపు బ్యాటింగ్‌తో విజయతీరాలకు చేర్చారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచింది జెమీమా.




.@JemiRodrigues scored a superb unbeaten half-century & was #TeamIndia‘s top performer from the second innings of the #INDvPAK #T20WorldCup clash ? ?
Here’s a summary of her knock ? pic.twitter.com/FEnB7uHbbg
— BCCI Women (@BCCIWomen) February 12, 2023
What a run chase! ?
The second-highest successful run-chase in Women’s #T20WorldCup history ?#INDvPAK | #TurnItUp pic.twitter.com/tjI5BrI0Po
— T20 World Cup (@T20WorldCup) February 12, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..




