Jemimah Rodrigues : జేమిమాకు 5 నిమిషాల ముందు తెలిసిన ఆ రహస్యం… సెమీఫైనల్ ఫలితాన్నే మార్చివేసింది!
భారత జట్టు మహిళా క్రికెట్ చరిత్రలో ఎవరూ ఊహించని అద్భుతాన్ని చేసింది. ఐసీసీ మహిళా వరల్డ్ కప్ 2025 సెమీఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను ఓడించి, 8 ఏళ్ల తర్వాత మరోసారి టోర్నమెంట్ నుంచి బయటకు పంపింది. అయితే, టీమిండియా ఈ అద్భుతాన్ని 339 పరుగుల ప్రపంచ రికార్డు లక్ష్యాన్ని ఛేదించి సాధించింది.

Jemimah Rodrigues : భారత జట్టు మహిళా క్రికెట్ చరిత్రలో ఎవరూ ఊహించని అద్భుతాన్ని చేసింది. ఐసీసీ మహిళా వరల్డ్ కప్ 2025 సెమీఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను ఓడించి, 8 ఏళ్ల తర్వాత మరోసారి టోర్నమెంట్ నుంచి బయటకు పంపింది. అయితే, టీమిండియా ఈ అద్భుతాన్ని 339 పరుగుల ప్రపంచ రికార్డు లక్ష్యాన్ని ఛేదించి సాధించింది. ఈ విజయంలో జేమిమా రోడ్రిగ్జ్ కీలక పాత్ర పోషించారు. ఆమె తన కెరీర్‌లోనే అతిపెద్ద ఇన్నింగ్స్ ఆడి, గుర్తుండిపోయే సెంచరీతో జట్టును ఫైనల్‌కు చేర్చి తిరిగి వచ్చింది.
నవీ ముంబైలో జరిగిన ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియాకు 339 పరుగుల భారీ లక్ష్యం ఎదురైంది. భారత జట్టు ఇంతకుముందు వరల్డ్ కప్‌లో 200 కంటే ఎక్కువ లక్ష్యాన్ని కూడా ఎప్పుడూ ఛేదించలేదు. 59 పరుగులకే ఇద్దరు ఓపెనర్ల వికెట్లు కోల్పోయిన తర్వాత జేమిమా రోడ్రిగ్జ్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 167 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇది టీమిండియాను మళ్లీ పోటీలోకి తీసుకురావడమే కాకుండా, సెంచరీతో జట్టుకు విజయాన్ని కూడా అందించింది.
అయితే, టీమిండియా ఒక నిర్ణయాన్ని మార్చుకోకపోయి ఉంటే ఈ మ్యాచ్ ఫలితం వేరే విధంగా ఉండేది. మ్యాచ్ ముగిసిన తర్వాత తీవ్ర భావోద్వేగానికి లోనైన జేమిమా కన్నీళ్లు పెట్టుకుంటూ ఒక విషయాన్ని వెల్లడించింది. అదేమిటంటే, ఆమె మూడో స్థానంలో బ్యాటింగ్ చేయడం ఖరారు కాలేదట. జేమిమా మాట్లాడుతూ.. “నేను మూడో నంబర్‌లో బ్యాటింగ్ చేస్తానని నాకు తెలియదు. నేను ఐదో నంబర్‌లో ఆడాలని అనుకున్నాను. అయితే నేను స్నానం చేయడానికి వెళ్లినప్పుడు, ఏదైనా మార్పు ఉంటే నాకు చెప్పమని అడిగాను. మైదానంలోకి దిగడానికి కేవలం 5 నిమిషాల ముందు మాత్రమే నేను నంబర్-3లో ఆడాలని నాకు చెప్పారు” అని తెలిపింది.
ఒకప్పుడు జేమిమాకు బదులుగా నంబర్-3లో హర్లీన్ డియోల్ బ్యాటింగ్ చేసేది. దీని కారణంగా వరల్డ్ కప్ మధ్యలో జేమిమాను ఒక మ్యాచ్‌కు డ్రాప్ కూడా చేశారు. ఆ సమయంలో కోచ్ అమోల్ మజుందార్, హర్లీన్ నంబర్-3లో ఆడటం కొనసాగిస్తారని చెప్పారు. కానీ జేమిమా కేవలం ప్లేయింగ్-11లోకి తిరిగి రావడమే కాకుండా, సెమీఫైనల్‌లో హర్లీన్ డియోల్‌ను డ్రాప్ చేసి ఆమెకే నంబర్-3 అవకాశం దక్కింది.
ఈ నిర్ణయాన్ని జేమిమా సరైనదని నిరూపించింది. నంబర్ 3లో బరిలోకి దిగి 127 పరుగుల గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడి, కేవలం 48.3 ఓవర్లలోనే ప్రపంచ రికార్డు రన్ ఛేజ్‌లో జట్టుకు విజయాన్ని అందించి ఫైనల్‌కు చేర్చింది. ఇది జేమిమా వన్డే కెరీర్‌లో మూడవ, వరల్డ్ కప్‌లో మొదటి సెంచరీ. ఈ అద్భుతమైన ఇన్నింగ్స్‌ను ఆమె అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




