Jay Shah: ఐసీసీ ఛైర్మన్‌ రేసులో జైషా.? పోటీ చేస్తే ఇకపై క్రికెట్‌కు పెద్దన్న బీసీసీఐ.!

|

Jul 10, 2024 | 8:30 AM

అంతర్జాతీయ క్రికెట్ మండలి ICC తదుపరి ఛైర్మన్ ఎన్నిక ఈ ఏడాది నవంబర్‌లో జరగనుంది. ప్రస్తుతం ఛైర్మన్‌గా గ్రెగ్‌ బార్క్‌లే నాలుగు సంవత్సరాలుగా ఈ పదవిలో కొనసాగుతున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

Jay Shah: ఐసీసీ ఛైర్మన్‌ రేసులో జైషా.? పోటీ చేస్తే ఇకపై క్రికెట్‌కు పెద్దన్న బీసీసీఐ.!
BCCI Secretary Jay Shah
Follow us on

అంతర్జాతీయ క్రికెట్ మండలి ICC తదుపరి ఛైర్మన్ ఎన్నిక ఈ ఏడాది నవంబర్‌లో జరగనుంది. ప్రస్తుతం ఛైర్మన్‌గా గ్రెగ్‌ బార్క్‌లే నాలుగు సంవత్సరాలుగా ఈ పదవిలో కొనసాగుతున్నారు. అతడు మరో టర్మ్‌ ఛైర్మన్‌గా కొనసాగడానికి అర్హత ఉంది. అయితే, బీసీసీఐ సెక్రటరీ జై షా ఐసీసీ ఛైర్మన్‌ పదవి రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. జై షా మద్దతుతోనే బార్క్‌లే ఐసీసీ ఛైర్మన్ అయ్యారు.

ఇది చదవండి: ‘హాయ్ ఫ్రెండ్స్.! ఈరోజు మా ఫస్ట్ నైట్’.. వీడియో షేర్ చేసిన కొత్త జంట.. ఇదేం బూతు పురాణం

అయితే ICC చైర్మన్‌గా జై షా పోటీ చేస్తే ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవేళ జై షా ఈ పదవిని చేపడితే అత్యంత పిన్న వయస్కుడిగా నిలుస్తారు. ఐసీసీ ఛైర్మన్‌ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారా లేదా అనే దానిపై జై షా అధికారికంగా స్పందించలేదు. మరోవైపు, ఐసీసీ వార్షిక సమావేశం జులై 19 నుంచి 22 మధ్య కొలంబోలో జరగనుంది. ఈ వార్షిక సదస్సులో ఛైర్మన్ ఎన్నికకు సంబంధించిన టైమ్‌లైన్‌ను అధికారికంగా రూపొందించాలని భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ద్యావుడా.! వాటే మేకోవర్.. ఈ వయ్యారి అందాన్ని చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..