Video: సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ పై దురుసుగా ప్రవర్తించిన ప్రీతీ కుర్రోడు! పంజాబ్ కెప్టెన్ పై మండిపడుతున్న నెటిజన్లు!
ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ సాహిబా బాలి మధ్య జరిగిన సరదా సంఘటనపై ట్రోల్స్ ఎదురవుతున్నాయి. ఒక వీడియోలో ఆమెను కారులో వదిలేసి వెళ్లిపోవడంతో నెటిజన్లు అయిష్టంగా స్పందిస్తున్నారు. కొంతమంది దీన్ని సరదాగా తీసుకున్నా, మరికొందరు ప్రవర్తనపై విమర్శలు చేశారు. ఇక శ్రేయాస్ ఆటతీరు మెరుగుపడుతున్న నేపథ్యంలో బీసీసీఐ కాంట్రాక్టులోకి తిరిగి రావచ్చనే వార్తలు వెలువడుతున్నాయి.

పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ మళ్లీ వార్తల్లో నిలిచాడు, కానీ ఈసారి కారణం అతని మైదానంలో ఆటతీరు కాదు, ఒక వైరల్ వీడియో. ఐపీఎల్ 2025 సీజన్ కోసం పంజాబ్ కింగ్స్ నియమించిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ సాహిబా బాలి పంచిన ఒక సరదా వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీడియోలో శ్రేయాస్-సాహిబా జిమ్ గురించి మాట్లాడుకుంటూ కారులోంచి దిగుతుండగా కనిపించారు. అయితే ఆ సమయంలో శ్రేయాస్ అకస్మాత్తుగా “నాకు జిమ్‌కు వెళ్ళాల్సి ఉంది” అంటూ ఆమెను అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. దీనిపై ఆశ్చర్యపోయిన సాహిబా సరదాగా చాలా దురుసుగా ప్రవర్తిస్తున్నావు అంటూ స్పందించింది. ఇది కొందరికి ఫన్నీగా అనిపించినప్పటికీ, మరికొందరికి శ్రేయాస్ ఆ వ్యవహార శైలీ కొంచెం అసభ్యంగా కనిపించింది.
శ్రేయాస్ అయ్యర్ గతంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను 2024లో టైటిల్‌కు నడిపించిన కెప్టెన్. ఆ ప్రదర్శనతో అతనిపై భారీగా ఆశలు పెట్టుకున్న పంజాబ్ కింగ్స్, 2025 మెగా వేలంలో అతనిని రూ. 26.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. అయితే, సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోన్న ఈ వీడియో అతనిపై కొంత నెగటివ్ లైట్ను తీసుకువచ్చినప్పటికీ, కొంతమంది అభిమానులు దీన్ని సరదా విభాగంగా తీసుకుంటున్నారు.
ఇదిలా ఉంటే, అదే ఇంటర్వ్యూలో శ్రేయాస్ అయ్యర్ తన కెరీర్‌లో జరిగిన భావోద్వేగ క్షణాలను పంచుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో తన మొదటి ప్రాక్టీస్ సెషన్ తర్వాత తాను బాగా ఆడలేకపోయానని, దాంతో తీవ్ర మనస్తాపానికి గురై ఏడ్చానని చెప్పాడు. ఇది అతని ప్రయాణంలో ఎదురైన మానసిక ఒత్తిడిని ప్రతిబింబిస్తుంది.
ఇక మరోవైపు, శ్రేయాస్ కు మంచి వార్తలు కూడా ఎదురవుతున్నాయి. గత ఏడాది క్రమశిక్షణా కారణాలతో బీసీసీఐ కేంద్ర కాంట్రాక్టు జాబితా నుండి అతనిని తప్పించింది. అయితే తాజా సమాచారం ప్రకారం, అతని ఇటీవల ఆటతీరు, ప్రవర్తన ఆధారంగా బీసీసీఐ తన వైఖరిని మార్చే అవకాశం ఉంది. ఈ నెలాఖరులోగా కేంద్ర కాంట్రాక్టు జాబితాను ప్రకటించనున్న బీసీసీఐ, శ్రేయాస్ కు మళ్లీ ఒక అవకాశం ఇవ్వనుందని టాక్ వినిపిస్తోంది.
This was funny 😹😹 pic.twitter.com/9KhyWx52gG
— Parv 🚩 (@ParvCryEmoji) April 7, 2025
Sarpanch Saab’s passion for the game… 🥹🤌🏻
Watch the full heartfelt conversation between Shreyas Iyer and Sahiba Bali on our YT channel and Punjab Kings App. 📹 pic.twitter.com/t1PBDtCY6M
— Punjab Kings (@PunjabKingsIPL) April 7, 2025
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..