AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025: ఆర్సీబీకి బీసీసీఐ గట్టి షాక్…కెప్టెన్ పతిదార్‌కు రూ.12లక్షల జరిమానా!

ఐపీఎల్‌ 2025: సీజన్‌ 18లో దూకుడుమీదున్న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు ముంబైతో మ్యాచ్ తర్వాత గట్టి షాక్ తగిలింది. వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవ‌ర్ రేట్ కారణంగా ఆర్సీబీ కెప్టెన్ ర‌జ‌త్ ప‌తిదార్ బీసీసీఐ జరిమానా విధించింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ఆర్టికల్ 2.2 ప్రకారం ఆర్సీబీ కెప్టెన్ పతిదార్‌కు ఐపీఎల్‌ అడ్వైజరీ కమిటీ రూ.12లక్షల జరిమానా విధించింది. ఈ సీజన్‌లో పతిదార్‌కు ఫైన్ పడటం ఇదే తొలిసారి.

IPL 2025: ఆర్సీబీకి బీసీసీఐ గట్టి షాక్...కెప్టెన్ పతిదార్‌కు రూ.12లక్షల జరిమానా!
Rajat Patidar
Anand T
|

Updated on: Apr 08, 2025 | 5:09 PM

Share

ఈ సీజన్‌లో జట్టు బాధ్యతలను ఆర్సీబీ యాజమాన్యం రజత్ పతిదార్‌కు అప్పగించింది. ఇక జట్టు సారథిగా బాధ్యతలు చేపట్టిన పతిదార్ మ్యాచ్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ సీజన్‌లో రాయల్ చాలెంజర్స్‌ బెంగళూరు ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడగా మూడింటిలో విజయం సాధించింది. గెలిచిన ప్రతీ మ్యాచ్‌లోనూ పతిదార్ జట్టును ముందుకు తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యాడు. నాలుగు మ్యాచుల్లో ఇప్పటి వరకు 150కుపైగా పరుగులు చేయగా.. అందులో రెండు ఆఫ్ సెంచరీలు ఉన్నాయి. నిన్న ముంబైతో జరిగిన మ్యాచ్‌లోనూ పతిదార్ అద్భుతంగా రాణించాడు. 32 బంతుల్లో ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో మ్యాచ్‌ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో పతిదార్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా వచ్చింది.

ఇప్పటి వరకు ఆర్సీబీ 4 మ్యాచ్‌లు ఆడితే మూడింటిలో విజయం సాధించింది. 2024 టైటిల్ విన్నర్ కోల్‌కతా, ఐదుసార్లు టైటిల్‌ విన్నర్స్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్లను తమ హోమ్‌ గ్రౌండ్‌లలోనే ఓడించింది. దీంతో ఆర్సీబీ కొనసాగిస్తున్న ఫామ్‌ను చూసి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఇసారి ఆర్సీబీ ఎలాగైనా కప్పు కొడుతుందనే గట్టి నమ్మకంతో ఉన్నారు. ఆర్సీబీ రాబోయే మ్యాచుల్లోనూ తమ పర్ఫామెన్స్‌ను ఇలాగే కొనసాగిస్తే మాత్రం కప్పు కొట్టడం ఖాయం. చూడాలి మరి ఈ సీజన్‌లోనైనా ఆర్సీబీ కప్పు కొడుతుందో లేదో?

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కళ్యాణ్ పడాల జర్నీ వీడియో గూస్ బంప్స్.. భారీ ఎలివేషన్స్
కళ్యాణ్ పడాల జర్నీ వీడియో గూస్ బంప్స్.. భారీ ఎలివేషన్స్
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
సీఎం పదవిపై ఎలాంటి సీక్రెట్‌ డీల్‌ లేదు..!
సీఎం పదవిపై ఎలాంటి సీక్రెట్‌ డీల్‌ లేదు..!