IPL 2021 Player Auction : ఐపీఎల్ వేలానికి భారీ డిమాండ్.. స్వదేశీ ఆటగాళ్లతో పోటీపడిన వీదేశీ ఆటగాళ్లు..
ఐపీఎల్ 14వ సీజన్ వేలం పాటకు అంతా రెడీ అవుతున్నారు. చెన్నైలో ఫిబ్రవరి 18న ఈ వేలంపాటకు 1097 ఆటగాళ్లు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 814 మంది స్వదేశీ ఆటగాళ్లు ఉండగా..
IPL Player Registration : ఐపీఎల్ 14వ సీజన్ వేలం పాటకు అంతా రెడీ అవుతున్నారు. చెన్నైలో ఫిబ్రవరి 18న ఈ వేలంపాటకు 1097 ఆటగాళ్లు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 814 మంది స్వదేశీ ఆటగాళ్లు ఉండగా.. 283 వీదేశీ ఆటగాళ్లు ఉన్నారు.
ఐపీఎల్ 14వ సీజన్ కోసం వేలంపాటలో పాల్గొనేందుకు ఆటగాళ్లు చేసుకునే దరఖాస్తు ప్రక్రియ శుక్రవారం ముగిసింది. దీని కోసం పెద్ద మొత్తంలో దరఖాస్తులు వచ్చాయి. మొత్తంగా 1097 ఆటగాళ్లు ఈ మెగాలీగ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 814 మంది స్వదేశీ ఆటగాళ్లు ఉన్నారు. 15 దేశాలకు చెందిన 283 వీదేశీ ఆటగాళ్లు కూడా ఉండటం విశేషం. చెన్నైలో ఫిబ్రవరి 18న మధ్యాహ్నం 3గంటలకు ఈ వేలంపాట జరగనుంది.
విదేశీ ఆటగాళ్లలో వెస్డిండీస్ నుంచి అత్యధికంగా 56 మంది ఉండగా దరఖాస్తు చేసుకున్నారు. ఆస్ట్రేలియా(42 ఆటగాళ్లు), దక్షిణాఫ్రికా(38), అఫ్గానిస్థాన్(30), న్యూజిలాండ్(29), బంగ్లాదేశ్(5), ఇంగ్లాండ్(21), ఐర్లాండ్(2), నేపాల్(8), నెథర్లాండ్స్(1), స్కాట్లాండ్(7), శ్రీలంక(31), యూఏఈ(9),యూఎస్ఏ(2), జింబాబ్వే(2) ఉన్నారు.
మొత్తంగా క్యాప్డ్(207), అన్క్యాప్డ్(863), అసోసియేటివ్(27)మంది ఆటగాళ్లు ఉన్నారు. వీరిలో క్యాప్డ్ భారత ఆటగాళ్లు (21), క్యాప్డ్ విదేశీ ఆటగాళ్లు(186), అసోసియేట్(27), కనీసం ఒక్క మ్యాచు ఆడిన అన్క్యాప్డ్ భారత్ ఆటగాళ్లు(50), అన్క్యాప్డ్ విదేశీ ఆటగాళ్లు(2), అన్క్యాప్డ్ భారత క్రికెటర్స్(743), అన్క్యాప్డ్ విదేశీ క్రికెటర్స్(68)మంది ఉన్నారు.
వేలంలో… ఒక్కో ఫ్రాంచైజీ గరిష్టంగా తమ జట్టులోకి 25 మంది ప్లేయర్లను తీసుకుంటే.. వేలంలోకి 61 మందిని తీసుకుంటామని ఐపీఎల్ తెలిపింది. ఇందులో 22 మంది విదేశీ ఆటగాళ్లు ఉంటారు. 18న మధ్యాహ్నం 3 గంటలకు వేలం ప్రారంభమవుతుంది.
ఎవరికి ఎంత..?
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఏకంగా రూ. 53.20 కోట్లతో వేలానికి దిగనుండగా…, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB) వద్ద రూ. 35.90 కోట్లు, రాజస్థాన్ రాయల్స్ వద్ద రూ. 34.85 కోట్లు, చెన్నై సూపర్ కింగ్స్ వద్ద రూ. 22.90 కోట్లు, ముంబై ఇండియన్స్ వద్ద రూ. 15.35 కోట్లు, ఢిల్లీ కేపిటల్స్ వద్ద రూ. 12.9 కోట్లు, కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ వద్ద చెరో రూ. 10.75 కోట్లు ఉన్నాయి.
ఏ జట్టులో ఎవరున్నారు..!
కోవిడ్ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో గతేడాది ఐపీఎల్-13 యూఏఈలో జరిగింది. ఈసారి మాత్రం ఇండియాలోనే జరిగే అవకాశం ఉంది. ఆటగాళ్లను దగ్గరపెట్టుకునే గడువు గతనెల 20న ముగియగా.., రాజస్థాన్ రాయల్స్(RR), కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌లు మాత్రం స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌లను వదిలిపెట్టాయి. వీరితోపాటు క్రిస్ మోరిస్, హర్భజన్ సింగ్, అరోన్‌ఫించ్ వంటి ప్రముఖ ఆటగాళ్లు కూడా జట్టు నుంచి బయటకొచ్చారు. మొత్తం 139 మంది ఆటగాళ్లను ఫ్రాంచైజీలు రిలీజ్ చేయలేదు.
ఇవి కూడా చదవండి
ఏడాది గడిచిన అదే జోరు.. వ్యాక్సిన్ వచ్చిన తగ్గని తీవ్రత.. మాయదారి మహమ్మారికి అంతమెప్పుడు..? Farm Laws: ఆ చట్టాలు.. రైతులు, కార్మికులకే కాదు.. యావత్ దేశానికి ప్రమాదకరం: రాహుల్ గాంధీ