GT vs LSG IPL Match Result: ఉత్కంఠ మ్యాచ్‌లో ఓడిన లక్నో.. గుజరాత్ ఖాతాలో నాలుగో విజయం..

ఇండియన్ ప్రీమియర్ లీగ్-16వ సీజన్ 30వ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ ఉత్కంఠ విజయం సాధించింది. లక్నో సూపర్ జెయింట్స్‌ 136 పరుగుల లక్ష్యాన్ని ఛేధించడంలో చివరి ఓవర్లో తడబడింది.

GT vs LSG IPL Match Result: ఉత్కంఠ మ్యాచ్‌లో ఓడిన లక్నో.. గుజరాత్ ఖాతాలో నాలుగో విజయం..
Gt Vs Lsg
Follow us
Venkata Chari

|

Updated on: Apr 22, 2023 | 7:20 PM

GT vs LSG IPL Match Result: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ లక్నో సూపర్ జెయింట్స్‌పై హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది. ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇరు జట్లు మూడోసారి ముఖాముఖి తలపడ్డాయి. ఈ విజయంతో గుజరాత్ జట్టు నాలుగో ర్యాంక్‌కు చేరుకుంది.

లక్నోలోని భారతరత్న అటల్ విహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 135 పరుగులు చేసింది. అనంతరం లక్నో బ్యాట్స్‌మెన్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 128 పరుగులు మాత్రమే చేయగలిగింది.

ఇరు జట్ల ప్లేయింగ్XI..

గుజరాత్ టైటాన్స్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), విజయ్ శంకర్, అభినవ్ మనోహర్, రాహుల్ తెవాటియా, డేవిడ్ మిల్లర్, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్.

ఇవి కూడా చదవండి

ఇంపాక్ట్ ప్లేయర్స్: KS భరత్, జెషువా లిటిల్, జయంత్ యాదవ్, నూర్ అహ్మద్ మరియు దసున్ షనక.

లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), కైల్ మేయర్స్, దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), ఆయుష్ బదోని, నవీన్ ఉల్ హక్, అమిత్ మిశ్రా, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్.

ఇంపాక్ట్ ప్లేయర్స్: కృష్ణప్ప గౌతమ్, జయదేవ్ ఉనద్కత్, డేనియల్ సైమ్స్, ప్రేరక్ మన్కడ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..