AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 : లక్నోపై గెలిచి టాప్-4 లోకి పంజాబ్ కింగ్స్.. రాజస్థాన్ రాయల్స్‌కు పెరిగిన టెన్షన్!

IPL 2026 : ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టికలో పంజాబ్ కింగ్స్ లక్నోను ఓడించి టాప్-4 లోకి దూసుకెళ్లింది. దీనితో రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్ అవకాశాలు ఉత్కంఠగా మారాయి. రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్ చేరాలంటే తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన పరిస్థితి ఏర్పడింది.

IPL 2026 : లక్నోపై గెలిచి టాప్-4 లోకి పంజాబ్ కింగ్స్.. రాజస్థాన్ రాయల్స్‌కు పెరిగిన టెన్షన్!
Punjab Kings
Rakesh
|

Updated on: May 24, 2026 | 6:54 AM

Share

IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్ లీగ్ మ్యాచ్‌లు చివరి దశకు చేరడంతో ప్లేఆఫ్స్ ఉత్కంఠ నెక్స్ట్ లెవెల్‌కు చేరుకుంది. 68వ లీగ్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పై పంజాబ్ కింగ్స్ (PBKS) సాధించిన భారీ విజయం పాయింట్ల పట్టికను పూర్తిగా మార్చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మెరుపు సెంచరీతో పంజాబ్ జట్టు కేవలం మ్యాచ్ గెలవడమే కాకుండా, రన్‌రేట్‌ను భారీగా మెరుగుపరుచుకుని పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. పంజాబ్ కింగ్స్ ఎంట్రీతో ఇప్పటివరకు సేఫ్‌గా ఉన్న మిగతా జట్లలో వణుకు మొదలైంది.

ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ అద్భుత ప్రదర్శన చేసింది. ఈ విజయంతో పంజాబ్ ఆడిన 14 మ్యాచ్‌లలో 7 విజయాలు, 6 ఓటములు, ఒక మ్యాచ్ ఫలితం తేలకపోవడంతో మొత్తం 15 పాయింట్లతో నాలుగో స్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రస్తుతం పంజాబ్ నెట్ రన్‌రేట్ +0.309 కి పెరిగింది. ఈ దెబ్బతో అంతవరకు నాలుగో స్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్ (13 మ్యాచ్‌ల్లో 14 పాయింట్లు) ఐదో స్థానానికి పడిపోయింది. రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్ చేరాలంటే తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్లు ఇప్పటికే చెరో 18 పాయింట్లతో అధికారికంగా ప్లేఆఫ్స్ బెర్తులను కన్ఫర్మ్ చేసుకున్నాయి. ఈ మూడు జట్లు పాయింట్ల పట్టికలో టాప్-3 స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇక నాలుగో స్థానం కోసం పంజాబ్, రాజస్థాన్ మధ్య గట్టి పోటీ నడుస్తోంది. కోల్‌కతా నైట్ రైడర్స్ 13 మ్యాచ్‌ల్లో 13 పాయింట్లతో ఆరో స్థానంలో ఉండి రేసులో నిలవగా, చెన్నై సూపర్ కింగ్స్ 14 మ్యాచ్‌ల్లో 12 పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ 12 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉంది. ముంబై ఇండియన్స్ 8 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో, లక్నో సూపర్ జెయింట్స్ తన చివరి మ్యాచ్‌లోనూ ఓడిపోయి 8 పాయింట్లతో టేబుల్ చివర్లో 10వ స్థానంలో నిలిచాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే
అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే
గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే
ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే