AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 Orange Cap Race: ఆరెంజ్ క్యాప్ రేసులో మార్పులు.. కోహ్లీకి షాక్ ఇచ్చిన సాయి సుదర్శన్

IPL 2026 Orange Cap Race : ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో త్వరగా అవుట్ అయినప్పటికీ, అంతకుముందు చేసిన పరుగులతో కేఎల్ రాహుల్‌ను వెనక్కి నెట్టి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు.

IPL 2026 Orange Cap Race: ఆరెంజ్ క్యాప్ రేసులో మార్పులు.. కోహ్లీకి షాక్ ఇచ్చిన సాయి సుదర్శన్
Ipl 2026
Rakesh
|

Updated on: May 04, 2026 | 8:04 AM

Share

IPL 2026 Orange Cap Race: ఐపీఎల్ 2026 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. మైదానంలో జట్ల మధ్య పోరు ఒకెత్తు అయితే, ఆటగాళ్ల మధ్య వ్యక్తిగత రికార్డుల వేట మరో ఎత్తు. ముఖ్యంగా ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ కోసం జరుగుతున్న రేసు ప్రతి మ్యాచ్‌కూ మారుతూ అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది. తాజాగా గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ తర్వాత ఈ రేసులో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. యువ ఆటగాడు సాయి సుదర్శన్ మెరుపు హాఫ్ సెంచరీతో దూసుకురావడంతో కింగ్ కోహ్లీకి చుక్కెదురైంది.

ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో త్వరగా అవుట్ అయినప్పటికీ, అంతకుముందు చేసిన పరుగులతో కేఎల్ రాహుల్‌ను వెనక్కి నెట్టి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. అభిషేక్ ఇప్పటివరకు 440 పరుగులతో మొదటి స్థానంలో ఉండగా, కేఎల్ రాహుల్ 433 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. వీరిద్దరి మధ్య కేవలం 7 పరుగుల తేడా మాత్రమే ఉండటంతో తర్వాతి మ్యాచ్‌ల్లో పోరు మరింత ఆసక్తికరంగా ఉండనుంది.

గుజరాత్ టైటాన్స్ యువ ఆటగాడు సాయి సుదర్శన్ పంజాబ్ కింగ్స్‌పై 57 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఈ హాఫ్ సెంచరీతో అతను ఈ సీజన్‌లో తన పరుగుల సంఖ్యను 385కి (10 మ్యాచుల్లో) చేరవేసి టాప్-5 లోకి ప్రవేశించాడు. ఫలితంగా అప్పటివరకు 5వ స్థానంలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (379 పరుగులు) 6వ స్థానానికి పడిపోయాడు. ఇక ఎస్‌ఆర్‌హెచ్‌కే చెందిన హెన్రిచ్ క్లాసెన్ (425) మూడో స్థానంలో, రాజస్థాన్ రాయల్స్ సంచలనం వైభవ్ సూర్యవంశీ (404) నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు.

వికెట్ల వేటలో ఆర్‌సీబీ వెటరన్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ పర్పుల్ క్యాప్‌ను తన వద్దే ఉంచుకున్నాడు. భువీ ఈ సీజన్‌లో ఇప్పటివరకు అత్యధికంగా 17 వికెట్లు పడగొట్టి టాప్ పొజిషన్‌లో ఉన్నాడు. అదే సంఖ్యలో వికెట్లు తీసినప్పటికీ ఎకానమీ రేటు కారణంగా సీఎస్‌కే బౌలర్ అన్షుల్ కాంబోజ్ రెండో స్థానంలో ఉన్నాడు. ఇక పంజాబ్‌పై 2 వికెట్లు తీసిన కగిసో రబడ (16 వికెట్లు) మూడో స్థానానికి చేరగా, జోఫ్రా ఆర్చర్ (15), ఇషాన్ మలింగ (15) టాప్-5 లో మిగిలిన స్థానాల్లో ఉన్నారు.

ముఖ్యంగా ఈ సీజన్‌లో సీనియర్ల కంటే యువ ఆటగాళ్లు ఆరెంజ్ క్యాప్ రేసులో ఎక్కువగా కనిపిస్తుండటం విశేషం. మహమ్మద్ సిరాజ్, రషీద్ ఖాన్ వంటి స్టార్ బౌలర్లు 11 వికెట్లతో 8, 9 స్థానాలకు పడిపోయారు. టోర్నీ ప్లేఆఫ్స్ దశకు చేరువవుతున్న కొద్దీ ఈ క్యాపుల కోసం పోటీ ఇంకా తీవ్రతరం కానుంది. నేటి ఫలితాల తర్వాత హైదరాబాద్ ప్లేయర్స్ బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ ఆధిపత్యం ప్రదర్శించడం విశేషం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us