AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LSG vs DC : ప్రిన్స్ యాదవ్ వర్సెస్ ట్రిస్టన్ స్టబ్స్.. మైదానంలో అందరూ చూస్తుండగానే గొడవ పడ్డ ఆటగాళ్లు

LSG vs DC : ఐపీఎల్ 2026లో లక్నో బౌలర్ ప్రిన్స్ యాదవ్, ఢిల్లీ బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్ మధ్య మైదానంలో అందరూ ఉండగానే గొడవ పడ్డారు . మ్యాచ్‌లో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

LSG vs DC : ప్రిన్స్ యాదవ్ వర్సెస్ ట్రిస్టన్ స్టబ్స్.. మైదానంలో అందరూ చూస్తుండగానే గొడవ పడ్డ  ఆటగాళ్లు
Lsg Vs Dc
Rakesh
|

Updated on: Apr 02, 2026 | 9:49 AM

Share

LSG vs DC : ఐపీఎల్ 2026 సీజన్‌లో అప్పుడే వేడి మొదలైంది. బుధవారం రాత్రి లక్నోలోని ఎకానా స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ (DC), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మధ్య జరిగిన మ్యాచ్ కేవలం పరుగులకే పరిమితం కాలేదు.. ఆటగాళ్ల మధ్య వాగ్వాదానికి కూడా వేదికైంది. లక్నో యువ బౌలర్ ప్రిన్స్ యాదవ్, ఢిల్లీ బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్ మధ్య మైదానంలో చోటుచేసుకున్న ఘర్షణ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో ఈ ఘటన జరిగింది. లక్నో పేసర్ ప్రిన్స్ యాదవ్ వేసిన ఐదో బంతి తర్వాత వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. బంతి వేసిన వెంటనే ప్రిన్స్ నేరుగా బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్ దగ్గరికి వెళ్లి అతన్ని తీక్షణంగా చూస్తూ ఏదో అన్నాడు. స్టబ్స్ కూడా అస్సలు తగ్గలేదు.. ప్రిన్స్ కళ్లలోకి కళ్లు పెట్టి చూస్తూ ధీటుగా సమాధానం ఇచ్చాడు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం ముదిరి కొట్టుకుంటారేమో అన్నంత రేంజ్‌కు వెళ్లింది. ఈ సీజన్‌లో ఇద్దరు ఆటగాళ్లు ఇలా ముఖాముఖి తలపడటం ఇదే మొదటిసారి.

ఈ మ్యాచ్‌లో ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో అదరగొట్టాడు. రెండు కీలక వికెట్లు తీసి లక్నోను గెలిపించేందుకు ప్రయత్నించాడు. అయితే, బ్యాటింగ్ విభాగంలో లక్నో దారుణంగా విఫలమైంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ నిర్ణయం సరైనదని అతని బౌలర్లు నిరూపించారు. లక్నో బ్యాటర్లు పేకమేడలా కూలిపోవడంతో 18.4 ఓవర్లలోనే కేవలం 141 పరుగులకే ఆ జట్టు ఆలౌట్ అయింది. ఎకానా పిచ్ బ్యాటింగ్‌కు కష్టంగా ఉన్నప్పటికీ, లక్నో ప్రదర్శన మరీ పేలవంగా ఉండటం అభిమానులను నిరాశపరిచింది.

142 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో లక్నోను ఓడించింది. లక్నో బౌలర్లు మధ్యలో వికెట్లు తీసి ఒత్తిడి తెచ్చినప్పటికీ, ఢిల్లీ బ్యాటర్లు సంయమనంతో ఆడి విజయాన్ని అందుకున్నారు. ఈ విజయంతో ఢిల్లీ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగుపరుచుకోగా, సొంత గడ్డపై లక్నోకు ఓటమి తప్పలేదు. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా ప్రిన్స్ యాదవ్, స్టబ్స్ మధ్య జరిగిన ఘర్షణ గురించే చర్చ సాగుతోంది.

ప్రిన్స్ యాదవ్ వంటి యువ బౌలర్లు ఐపీఎల్ వంటి పెద్ద వేదికపై దూకుడు ప్రదర్శించడం సహజమే అయినా, అది శృతిమించకూడదని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. అటు ట్రిస్టన్ స్టబ్స్ కూడా మైదానంలో తన దూకుడును చూపిస్తూ ఢిల్లీ విజయంలో భాగమయ్యాడు. ఆటలో ఇలాంటి చిన్న చిన్న తగాదాలు సహజమని, ఇవే మ్యాచ్‌కు అసలైన ఊపునిస్తాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. స్టార్ స్పోర్ట్స్ ఈ ఘర్షణకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ పెద్ద పెద్ద మ్యాచుల్లో ఇలాంటి చిన్న చిన్న గొడవలు జరుగుతుంటాయి అని క్యాప్షన్ ఇచ్చింది.

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us