IPL 2025: ఐపీఎల్ నుంచి 8మంది ఔట్.. సీజన్ మధ్యలో 6 జట్లకు ఊహించిన షాక్..
WTC Final 2025: ఐపీఎల్ 2025 మళ్ళీ ప్రారంభం కానుంది. ఈ సీజన్‌లోని మిగిలిన మ్యాచ్‌లు మే 17 నుండి జరుగుతాయి. కానీ వారి క్రికెట్ బోర్డు 8 మంది ఆటగాళ్లకు పెద్ద ఆర్డర్ జారీ చేసింది. ఈ ఆటగాళ్లందరూ ప్లేఆఫ్ మ్యాచ్‌లకు ముందు ఇంటికి తిరిగి రావచ్చు.

IPL 2025: మే 17 నుంచి ఐపీఎల్ మళ్ళీ ప్రారంభం కానుంది. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత కారణంగా, మే 9న బీసీసీఐ ఐపీఎల్‌ను ఒక వారం పాటు నిలిపివేసింది. ఆ తరువాత చాలా మంది విదేశీ ఆటగాళ్ళు తమ దేశాలకు తిరిగి వెళ్లారు. అయితే, ఇప్పుడు విదేశీ ఆటగాళ్ళు భారతదేశానికి తిరిగి వస్తున్నారు. కానీ, లీగ్ ప్రారంభానికి ముందు, ఓ దేశానికి చెందిన క్రికెట్ బోర్డు ఓ నిర్ణయం తీసుకుంది. ఈ బోర్డు తన 8 మంది ఆటగాళ్లను సీజన్ మధ్యలో భారతదేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది.
8 మంది ఆటగాళ్లకు భారీ ఆఫర్..
క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం, క్రికెట్ దక్షిణాఫ్రికా తన ఆటగాళ్లను మే 26 లోపు స్వదేశానికి తిరిగి రావాలని ఆదేశించింది. దక్షిణాఫ్రికా నుంచి మొత్తం 20 మంది ఆటగాళ్ళు IPL 2025 లో ఆడుతున్నారు. వారిలో 8 మంది ఆటగాళ్ళు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు దక్షిణాఫ్రికా జట్టులో ఎంపికయ్యారు. ఈ 8 మంది ఆటగాళ్లను మే 26 నాటికి స్వదేశానికి తిరిగి తీసుకురావాలని దక్షిణాఫ్రికా క్రికెట్ కోరుకుంటోంది. తద్వారా వారు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు ముందు కొంత విశ్రాంతి తీసుకోవచ్చు అని ఆశిస్తోంది.
ఐపీఎల్, బీసీసీఐతో ప్రాథమిక ఒప్పందం ప్రకారం మే 25న ఫైనల్ జరుగుతుందని, మా ఆటగాళ్లు 26న తిరిగి వస్తారని, తద్వారా 30న బయలుదేరే ముందు వారికి తగినంత సమయం లభిస్తుందని దక్షిణాఫ్రికా క్రికెట్ తెలిపింది. కానీ, ఇప్పుడు IPL 2025 చివరి మ్యాచ్ జూన్ 3న జరుగుతుంది. దీని అర్థం ఈ 8 మంది ఆటగాళ్ళు ప్లేఆఫ్ మ్యాచ్‌లకు దూరంగా ఉండవచ్చు. ఇది ఆయా జట్లకు పెద్ద దెబ్బ అవుతుంది.
ఏ జట్లకు ఎదురుదెబ్బ..
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు దక్షిణాఫ్రికా జట్టులో ఎంపికైన 8 మంది ఆటగాళ్లు కార్బిన్ బాష్ (ముంబై ఇండియన్స్), వియాన్ ముల్డర్ (సన్‌రైజర్స్ హైదరాబాద్), మార్కో జాన్సెన్ (పంజాబ్ కింగ్స్), ఐడెన్ మార్క్రామ్ (లక్నో సూపర్‌జెయింట్స్), లుంగి న్గిడి (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు), కగిసో రబాడ (గుజరాత్ టైటాన్స్), ర్యాన్ రికెల్టన్ (ముంబై ఇండియన్స్), ట్రిస్టన్ స్టబ్స్ (ఢిల్లీ క్యాపిటల్స్). అయితే, SRH ప్లేఆఫ్స్‌లో చోటు కోసం పోటీలో లేదు. ఎస్‌ఆర్‌హెచ్ తరపున ఆడుతోన్న వియాన్ ముల్డర్ సరైన సమయంలో తిరిగి రావొచ్చు. ఇది కాకుండా, మిగిలిన ఆటగాళ్లపై తుది నిర్ణయం త్వరలో తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








