Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025 KKR vs RCB Live Streaming: మరికొద్ది గంటల్లో ఐపీఎల్ సంగ్రామం.. లైవ్ స్ట్రీమింగ్ పూర్తి వివరాలు మీకోసం

Kolkata Knight Riders vs Royal Challengers Bengaluru (KKR vs RCB) IPL Live Streaming: కోల్‌కతా జట్టుకు అజింక్య రహానే కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, ఈసారి బెంగళూరు జట్టుకు రజత్ పాటిదార్ నాయకత్వం వహిస్తున్నారు. గత సీజన్‌లో ఫైనల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించిన కోల్‌కతా టైటిల్‌ను గెలుచుకుంది. టైటిల్ నిలబెట్టుకోవడం కోసం రహానే తీవ్రంగా పోరాడాల్సి ఉంది.

IPL 2025 KKR vs RCB Live Streaming: మరికొద్ది గంటల్లో ఐపీఎల్ సంగ్రామం.. లైవ్ స్ట్రీమింగ్ పూర్తి వివరాలు మీకోసం
Kkr Vs Rcb (1)
Follow us
Venkata Chari

|

Updated on: Mar 21, 2025 | 9:32 PM

Kolkata Knight Riders vs Royal Challengers Bengaluru Live Streaming: ఐపీఎల్ 2025 ప్రారంభానికి మరికొద్ది గంటలే ఉంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) కొత్త కెప్టెన్ నాయకత్వంలో తమ టైటిల్ డిఫెన్స్‌ను ప్రారంభించనుంది. మొదటి మ్యాచ్‌లో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో తలపడనుంది. కోల్‌కతా లాగే కొత్త కెప్టెన్ నాయకత్వంలో బరిలోకి దిగనుంది.

టైటిల్ నిలబెట్టుకోవడం రహానేకు సవాలే..

ఈసారి కేకేఆర్ (KKR) జట్టుకు అజింక్య రహానే నాయకత్వం వహిస్తుండగా, ఆర్‌సీబీ (RCB) జట్టుకు రజత్ పాటిదార్ నాయకత్వం వహిస్తున్నారు. గత సీజన్‌లో ఫైనల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించి కేకేఆర్ (KKR) టైటిల్‌ను గెలుచుకుంది. రహానే టైటిల్ నిలబెట్టుకోవడంలో సవాల్ ఎదుర్కొంటుండగా, పాటీదార్‌కు ముందు ఏ ఆర్‌సీబీ కెప్టెన్ చేయలేనిది చేసే అవకాశం ఉంది. బెంగళూరు జట్టు ఎప్పుడూ ఐపీఎల్ (IPL) గెలవలేదు. పాటిదార్ ఫ్రాంచైజీకి మొదటి టైటిల్‌ను అందించే అవకాశం ఉంటుంది.

ట్రోఫీపై కోహ్లీ దృష్టి..

గత సీజన్ తొలి దశలో ఆర్‌సీబీ ప్రదర్శన బాగాలేదు. కానీ, రెండో దశలో జట్టు అద్భుతంగా రాణించి ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. గత తప్పుల నుంచి నేర్చుకుంటూ బెంగళూరు ఈ సీజన్‌లో ఆడుతుంది. ఇందులో స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ ఉన్నాడు. అతను ప్రారంభ సీజన్ నుంచి జట్టులో భాగమయ్యాడు. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. కానీ ఇప్పటివరకు ట్రోఫీని గెలవలేదు. అదే సమయంలో, ఈసారి కోల్‌కతా జట్టుకు దేశీయ టోర్నమెంట్‌లో కెప్టెన్‌గా విజయం సాధించిన అనుభవజ్ఞుడైన కెప్టెన్ రహానే నాయకత్వం వహిస్తాడు.

ఇవి కూడా చదవండి

RCB ప్రాబబుల్ ప్లేయింగ్ XI..

ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్ (సి), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (Wk), కృనాల్ పాండ్యా, టిమ్ డేవిడ్, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, జోష్ హేజిల్‌వుడ్, సుయాష్ శర్మ

ఇంపాక్ట్ ప్లేయర్: రాసిఖ్ సలామ్/దేవ్‌దత్ పడిక్కల్.

KKR ప్రాబబుల్ ప్లేయింగ్ XI..

సునీల్ నరైన్, క్వింటన్ డి కాక్ (Wk), అజింక్యా రహానే (C), అంగ్క్రిష్ రఘువంశీ, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, హర్షిత్ రాణా, స్పెన్సర్ జాన్సన్, వరుణ్ చక్రవర్తి.

ఇంపాక్ట్ ప్లేయర్: వైభవ్ అరోరా.

KKR vs RCB మధ్య జరిగిన IPL 2025 మ్యాచ్‌కు సంబంధించిన సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..

KKR vs RCB మధ్య IPL 2025 మ్యాచ్ ఎప్పుడు జరుగుతుంది?

KKR vs RCB మధ్య IPL 2025 మ్యాచ్ మార్చి 22న, అంటే శనివారం జరుగుతుంది.

KKR vs RCB మధ్య IPL 2025 మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది?

KKR vs RCB మధ్య IPL 2025 మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో జరుగుతుంది.

KKR vs RCB మధ్య IPL 2025 మ్యాచ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?

KKR vs RCB మధ్య IPL 2025 మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. టాస్ దానికి అరగంట ముందు, అంటే సాయంత్రం 7:00 గంటలకు జరుగుతుంది.

KKR vs RCB మధ్య జరిగే IPL 2025 మ్యాచ్‌ను మీరు ఏ టీవీ ఛానెల్‌లో చూడవచ్చు?

KKR vs RCB మధ్య జరిగే IPL 2025 మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్ ఛానెల్‌లలో చూడవచ్చు.

KKR vs RCB మధ్య జరిగే IPL 2025 మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ అందుబాటులో ఉంటుంది?

KKR vs RCB మధ్య జరిగే IPL 2025 మ్యాచ్‌ను JioHotstar యాప్‌లో ఆన్‌లైన్‌లో చూడవచ్చు. దీనితో పాటు, వీక్షకులు tv9telugu.com లో మ్యాచ్‌కు సంబంధించిన లైవ్ అప్‌డేట్స్‌ను చదవవచ్చు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..