IPL 2025: 4 బంతుల్లో బౌండరీ.. ఒక్కో ఓవర్లలో 20 కంటే ఎక్కువ పరుగులు.. ఐపీఎల్ 2025లో బద్దలైన రికార్డులివే..
IPL 2025 Records: ఐపీఎల్ (IPL) 2024 సీజన్‌లో వరుసగా భారీ స్కోర్లు నమోదైనప్పుడు.. ఈ ట్రెండ్ వచ్చే సీజన్‌లో కూడా కొనసాగుతుందని అనిపించింది. కానీ, ఈ ట్రెండ్ మొదటి 5 మ్యాచ్‌లలో కొనసాగడమే కాకుండా, ఈసారి బ్యాటింగ్‌లో దూకుడు గత సీజన్ కంటే చాలా ఎక్కువగా కనిపిస్తోంది.

IPL 2025 Records: గత ఐపీఎల్ సీజన్‌లో కనిపించిన అద్బుత రికార్డులు, ఉత్కంఠ మ్యాచ్‌లు.. కొత్త సీజన్‌లోనూ కొనసాగుతుందని అంతా భావించారు. IPL 2025 సీజన్‌లోని మొదటి 5-6 మ్యాచ్‌లలో ఇది నిజమని నిరూపితమైంది. IPL 2024లో బ్యాట్స్‌మెన్స్ నిలకడగా భారీ స్కోర్లు సాధించారు. భారీ స్కోర్లతోపాటు ఎన్నో రికార్డులు కూడా నమోదవుతున్నాయి. IPL 2025లో, గత సీజన్ కంటే తక్కువ బంతుల్లో సిక్సర్లు, ఫోర్ల మెత మోగుతోందని గణాంకాలు చెబుతున్నాయి. అయితే, పవర్‌ప్లేలో రన్ రేట్ కూడా టోర్నమెంట్ చరిత్రలో అత్యధికంగా మారింది.
కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్‌తో ఐపీఎల్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో బెంగళూరు జట్టు 175 పరుగుల లక్ష్యాన్ని కేవలం 98 బంతుల్లోనే ఛేదించింది. ఈ మ్యాచ్‌లో 15 సిక్సర్లు, 39 ఫోర్లు వచ్చాయి. ఈ సీజన్‌లో రెండో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 286 పరుగులు చేసింది. ఇది టోర్నమెంట్ చరిత్రలో రెండవ అత్యధిక స్కోరు. ఇషాన్ కిషన్ కేవలం 45 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ కూడా 240కి పైగా పరుగులు చేసింది.
ప్రతి 4 బంతులకు ఓ బౌండరీ.. ప్రతి 10 బంతులకు సిక్స్..
టోర్నమెంట్ బాగా ప్రారంభమైందని చూపించడానికి ఈ గణాంకాలు సరిపోతాయి. కానీ, మనం లోతుగా పరిశీలిస్తే, ఈ సీజన్ గత సంవత్సరం కంటే బ్యాట్స్‌మెన్‌కు మరింత మెరుగ్గా ఉందని నిర్ధారించే మరిన్ని గణాంకాలను మనం కనుగొనవచ్చు. ESPN-Cricinfo ప్రకారం, IPL 2024, IPL 2025 మొదటి 5 మ్యాచ్‌లను పోల్చి చూస్తే, ఈ సంవత్సరం దాదాపు ప్రతి నాల్గవ బంతి బౌండరీని తాకుతోంది.
2024లో ప్రతి 5.3 బంతులకు ఒక బౌండరీ కొట్టగా, ఈ ఏడాది అది ప్రతి 3.9 బంతులకు ఒక బౌండరీగా మారిందని గణాంకాలు చెబుతున్నాయి. ఇది మాత్రమే కాదు, ఈసారి ప్రతి 9.7 బంతులకు ఒక సిక్సర్ కొడుతున్నారు. అయితే 2024లో ప్రతి 13.7 బంతులకు ఒక సిక్సర్ బాదేస్తున్నారు. గత సీజన్‌లో 5వ మ్యాచ్ వరకు 87 సిక్సర్లు కొట్టగా, 2025లో ఐదవ మ్యాచ్ నాటికి ఈ సంఖ్య 119 సిక్సర్లకు చేరుకుంది. అదే సమయంలో, 2024లో 136 ఫోర్లు కొట్టగా, ఈసారి 146 ఫోర్లు కొట్టబడ్డాయి.
పవర్‌ప్లేలో అద్భుతమైన బ్యాటింగ్..
రన్ రేట్ గురించి మాట్లాడుకుంటే, ఇది కూడా చాలా పెరిగింది. ముఖ్యంగా మొదటి 6 ఓవర్లలో అంటే పవర్ ప్లేలో, రన్ రేట్‌లో విపరీతమైన పెరుగుదల కనిపించింది. గత సీజన్‌లో మొదటి 5 మ్యాచ్‌లలో పవర్ ప్లే సగటు రన్ రేట్ 8.76గా ఉంది. కానీ ఈసారి అది నేరుగా 11.35కి పెరిగింది. ఈ సీజన్‌లో బ్యాట్స్‌మెన్స్ మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారని, బౌలర్లకు మార్గం చాలా కష్టంగా మారుతోందని చెప్పడానికి ఇది సరిపోతుంది. మిడిల్ ఓవర్లలో కూడా రన్ రేట్ 7 నుంచి 16కి పెరిగింది. గత సీజన్‌లో ఇది 8.25గా ఉండేది. కానీ, ఇప్పుడు అది ఓవర్‌కు 9.64 పరుగులుగా మారింది. అయితే, డెత్ ఓవర్లలో పెద్దగా మార్పు లేదు. 2025లో ఇది 12.62, అయితే 2024లో ఇది 12.02గా ఉంది.
ఒకే ఓవర్‌లో 20 కంటే ఎక్కువ పరుగులు..
ఇప్పుడు చాలా తక్కువ బంతుల్లోనే సిక్సర్లు, ఫోర్లు బాదుతుంటే, రన్ రేట్ పెరగడం సహజం. ఇది ఒక ఓవర్ నుంచి వచ్చే పరుగుల సంఖ్యను కూడా ప్రభావితం చేస్తోంది. ఈ IPL 18వ సీజన్‌లో, కేవలం 5 మ్యాచ్‌ల్లోనే ఇలా 20 సార్లు జరిగింది. బ్యాట్స్‌మెన్ ఒకే ఓవర్‌లో 20 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ సంఖ్య గత సీజన్‌లో 5 మ్యాచ్‌ల్లో 8 ఓవర్లకు మాత్రమే ఉంది. ఈ సీజన్‌లో బ్యాట్స్‌మెన్స్ పాత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో బౌలర్లు ఎలాంటి ప్లాన్స్‌తో సిద్ధమవుతారో చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..