టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని ఎంతో మంది యువ క్రికెటర్లకు ఆదర్శం. ప్రస్తుతం టీమిండియాలో ఉన్న సీనియర్లు కూడా ధోనిని అమితంగా ఆరాధిస్తారు. ఈనేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ పై ఆ జట్టు స్టార్ పేసర్ మతీషా పతిరణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోని తనకు తండ్రిలాంటి వాడని, అతని స్ఫూర్తిదాయక మాటలతోనే ఈ స్థాయికి చేరుకున్నానంటూ మిస్టర్ కూల్ పై అభిమానం చాటుకున్నాడు. మతిషా పతిరానా మొదటిసారి 2022లో ఐపీఎల్‌లో కనిపించాడు. తన స్లింగ్ యాక్షన్ తో ‘బేబీ మలింగ’గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతకు ముందు శ్రీలంక అండర్-19 జట్టులో అద్భుత ప్రదర్శన చేసిన తర్వాత సీనియర్ జట్టులో కూడా చేరాడు కానీ అక్కడ అతని ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. దీని తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ అతనిని గమనించి, వెంటనే జట్టులో చేర్చుకుంది. అరంగేట్రం సీజన్‌లో పతిరనకు కేవలం 2 మ్యాచ్‌లు మాత్రమే ఆడే అవకాశం లభించింది. దీని తర్వాత, IPL 2023 ప్రారంభ మ్యాచ్‌లలో కూడా, అతని ప్రదర్శన ప్రత్యేకంగా ఏమీ లేదు. అయితే ప్రతిసారీ లాగే మహేంద్ర సింగ్ ధోనీ పతిరనా ప్రతిభపై నమ్మకం ఉంచుతూ అతనికి అవకాశాలు ఇస్తూనే ఉన్నాడు. ఫలితం ఈరోజు పతిరనా CSK ప్రధాన బౌలర్, ట్రంప్ కార్డ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఈ నేపథ్యంలో పతిరనా తన సక్సెస్ క్రెడిట్‌ను ధోనీకి ఇచ్చాడు. మతిషా పతిరనా 2023 సీజన్‌లో 12 మ్యాచ్‌ల్లో 19 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్‌లో కేవలం 6 మ్యాచ్‌ల్లో 13 వికెట్లతో పర్పుల్ క్యాప్ రేసులో ఉన్నాడు. ఈ నేపథ్యంలోతన విజయం వెనుక ధోని హస్తం ఉందన్నాడీ శ్రీలంక స్పీడ్ స్టర్. అంతేకాదు తన క్రికెట్ జీవితంలో ‘మహి’కి తండ్రి హోదా ఇచ్చాడు. చెన్నై సూపర్ కింగ్స్ యూట్యూబ్ ఛానెల్‌లో ధోనీతో తన రిలేషన్ షిప్ గురించి పతిరనా మాట్లాడాడు. ధోనీ తనను తండ్రిలా చూసుకుంటాడని చెప్పాడు. ఇంట్లో తండ్రి ఎలా చూసుకుంటాడో క్రికెట్‌లో ధోనీ తనను అలా చూసుకున్నాడని తెలిపాడు.
Pathirana said “In my cricket life, MS Dhoni is playing a father’s role”. pic.twitter.com/yWYDUsAXoh
— Johns. (@CricCrazyJohns) May 3, 2024
మైదానం వెలుపల ధోనీ చాలా తక్కువగా మాట్లాడతాడని పతిరానా చెప్పాడు. అయితే అతను ఏదైనా అడగవలసి వచ్చినప్పుడల్లా నేరుగా ఎంఎస్ ధోని వద్దకు వెళ్లి తన భావాలను వ్యక్తం చేస్తాడు. ఆటను ఆస్వాదించాలని, శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని ధోని తరచూ సలహాలు ఇస్తుంటాడు. ధోని చిన్న చిన్న విషయాలు అతని కెరీర్‌పై చాలా ప్రభావం చూపాయని పతిరానా అన్నాడు. ఐపీఎల్ 2024లో మతిషా పతిరనా చెన్నై ప్రధాన ఫాస్ట్ బౌలర్. తని అద్భుతమైన బౌలింగ్‌తో CSK 10 మ్యాచ్‌లలో 5 గెలిచి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. ప్రారంభంలో పతిరణ గాయం కారణంగా 4 మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అందుకే, అతను కేవలం 6 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. 7.6 ఎకానమీతో 13 వికెట్లు తీసుకున్నాడు.
Pathirana :
Mahi bhai if you can play one more IPL Season, Please play with us.
pic.twitter.com/hq2gfDH2Rz— 𝙎𝙝𝙖𝙮𝙖𝙣𝙙𝙚𝙚𝙥 (@Shayandeep07) May 3, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..