IPL 2024: ధనాధన్ లీగ్‌కు ముహూర్తం ఫిక్స్‌.. మరికొన్ని గంటల్లో ఐపీఎల్ షెడ్యూల్‌.. ఆ జట్లతోనే మొదటి మ్యాచ్‌

ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఐపీఎల్ 2024 భారత్‌లో జరుగుతుందా లేదా అనే సందేహం నెలకొంది. అయితే ఈ టోర్నీ పూర్తిగా భారత్‌లోనే జరుగుతుందని ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ స్పష్టం చేశారు. అలాగే IPL ప్రారంభ తేదీని కూడా వెల్లడించాడు

IPL 2024: ధనాధన్ లీగ్‌కు ముహూర్తం ఫిక్స్‌.. మరికొన్ని గంటల్లో ఐపీఎల్ షెడ్యూల్‌.. ఆ జట్లతోనే మొదటి మ్యాచ్‌
IPL 2024
Follow us
Basha Shek

|

Updated on: Feb 22, 2024 | 8:31 AM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 టోర్నమెంట్‌కు మరికొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది. టోర్నీ షెడ్యూల్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఐపీఎల్ 2024 భారత్‌లో జరుగుతుందా లేదా అనే సందేహం నెలకొంది. అయితే ఈ టోర్నీ పూర్తిగా భారత్‌లోనే జరుగుతుందని ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ స్పష్టం చేశారు. అలాగే IPL ప్రారంభ తేదీని కూడా వెల్లడించాడు. ANIతో ఇంటరాక్షన్‌లో అరుణ్ ధుమాల్ మాట్లాడుతూ IPL 2024 టోర్నమెంట్‌ను మార్చి 22న చెన్నైలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. టోర్నీ తొలి 15 రోజుల షెడ్యూల్‌ను ప్రారంభంలోనే ప్రకటిస్తారు. ఆ తర్వాతి మ్యాచ్‌ ల షెడ్యూల్‌ను మళ్లీ ప్రకటిస్తారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో దశల వారీగా ధనాధాన్‌ లీగ్‌ను నిర్వహించనున్నారనే వార్తలు వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

దశల వారీగా ఐపీఎల్ మ్యాచ్ లు..

IPL 2024 ప్రారంభ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్‌, గుజరాత్ టైటాన్స్ మధ్య జరగనుంది. ఐపీఎల్ 2023 సీజన్ ఫైనల్‌లో ఇరు జట్లు తలపడ్డాయి. తద్వారా రెండు బలమైన జట్ల మధ్య ప్రారంభ మ్యాచ్ జరగనుంది. ఈసారి లోక్‌సభ ఎన్నికలు జరగనున్నందున ఐపీఎల్‌ను విదేశాలకు తరలించవచ్చని అందరూ అన్నారు. అలాగే డేట్స్‌లో కూడా కొంత మార్పు ఉండొచ్చని అంటున్నారు. తొలుత ఐపీఎల్ తొలి దశ షెడ్యూల్‌ను వెల్లడించనున్నారు. అనంతరం ఎన్నికల తేదీల ప్రకారం తుది షెడ్యూల్‌ ప్రకటిస్తామని చెప్పారు. అయితే ఐపీఎల్ 2024 ఫైనల్ మే 26న జరగనుంది.ఈరోజు విడుదలయ్యే IPL 2024 షెడ్యూల్‌ను కూడా ప్రత్యక్షంగా చూడవచ్చు. సాయంత్రం 5 గంటలకు ఈ ధనాధాన్ లీగ్ షెడ్యూల్‌ రిలీజ్‌ కానుంది. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో లైవ్‌ టెలికాస్ట్‌ చూడవచ్చు. అలాగే Jio సినిమా యాప్‌లో ఉచితంగా చూడవచ్చు.

తొలి దశ షెడ్యూల్ మరికొన్ని గంటల్లో..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..
వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?