MI vs DC, IPL 2024: షెపర్డ్, డేవిడ్‌ల తుపాన్ ఇన్నింగ్స్.. ముంబై ఇండియన్స్ భారీ స్కోరు
ముంబయి ఇండియన్స్ బ్యాటర్లు అదరగొట్టారు. ఐపీఎల్-17 సీజన్‌లో భాగంగా ఆదివారం (ఏప్రిల్ 07) ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతున్న మ్యాచ్‌లో సమష్ఠిగా రాణించారు ముంబై బ్యాటర్లు. కనీసం ఒక్కరు కూడా అర్ధ సెంచరీ చేయకపోయినా క్రీజులో ఉన్నంత సేపు మెరుపులు మెరిపించారు.దీంతో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబయి.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి

ముంబయి ఇండియన్స్ బ్యాటర్లు అదరగొట్టారు. ఐపీఎల్-17 సీజన్‌లో భాగంగా ఆదివారం (ఏప్రిల్ 07) ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతున్న మ్యాచ్‌లో సమష్ఠిగా రాణించారు ముంబై బ్యాటర్లు. కనీసం ఒక్కరు కూడా అర్ధ సెంచరీ చేయకపోయినా క్రీజులో ఉన్నంత సేపు మెరుపులు మెరిపించారు.దీంతో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబయి.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోరు చేసింది. మొదట ఓపెనర్ రోహిత్ శర్మ ( 27 బంతుల్లో49, 6 ఫోర్లు, 3 సిక్సర్లు) త్రుటిలో అర్ధసెంచరీ చేజార్చుకున్నాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ (42), కెప్టెన్ హార్దిక్ పాండ్యా(39), టిమ్ డేవిడ్ (45*) ధాటిగా బ్యాటింగ్ చేశారు. ఇక ఆఖరి ఓవర్ లో విండీస్ ప్లేయర్ రొమారియో షెపర్డ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 10 బంతుల్లోనే 3 ఫోర్లు, 4 సిక్సర్ల సహాయంతో 39 పరుగులు రాబట్టాడు. అయితే చాలా రోజుల తర్వాత క్రికెట్ గ్రౌండ్ లోకి అడుగుపెట్టిన సూర్య కుమార్ యాదవ్ (0), తెలుగబ్బాయి తిలక్ వర్మ(6) నిరాశపరిచారు. ఇక ఢిల్లీ బౌలర్లలో అక్షర్, నోకియా చెరో 2 వికెట్లు పడగొట్టగా.. ఖలీల్ ఒక వికెట్ తీశాడు.
కాగా ఐపీఎల్‌లో వాంఖడే స్టేడియంలో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా ముంబై ఇండియన్స్ చరిత్ర సృష్టించింది.
హిట్ మ్యాన్ మెరుపు ఇన్నింగ్స్.. వీడియో ఇదుగో..
It stays hit when the 𝙃𝙄𝙏𝙈𝘼𝙉 hits it 🚀#MIvDC #TATAIPL #IPLonJioCinema pic.twitter.com/kCecede2u7
— JioCinema (@JioCinema) April 7, 2024
ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ ఎలెవన్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, మహ్మద్ నబీ, రొమారియో షెపర్డ్, పీయూష్ చావ్లా, జెరాల్డ్ కోయెట్జీ, జస్ప్రీత్ బుమ్రా.
ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ XI: రిషబ్ పంత్ (కెప్టెన్ & వికెట్ కీపర్), డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, అభిషేక్ పోరెల్, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, జే రిచర్డ్‌సన్, ఎన్రిక్ నార్ట్జే, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్.
ఆఖరి ఓవర్ లో రొమారియో షెపర్డ్ విధ్వంసం.. ఏకంగా 32 పరుగులు.. వీడియో ఇదిగో..
𝗕𝗹𝗼𝗰𝗸𝗯𝘂𝘀𝘁𝗲𝗿 𝗙𝗶𝗻𝗶𝘀𝗵 🔥
On Display: The Romario Shepherd show at the Wankhede 💪
Watch the match LIVE on @JioCinema and @starsportsindia 💻📱#TATAIPL | #MIvDC pic.twitter.com/H63bfwm51J
— IndianPremierLeague (@IPL) April 7, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








