MI vs DC, IPL 2024: బోణి కొట్టిన ముంబై ఇండియన్స్.. ఢిల్లీపై ఘన విజయం..స్టబ్స్ మెరుపు ఇన్నింగ్స్ వృథా
ఐపీఎల్ 2024లో ముంబయి ఇండియన్స్ బోణి కొట్టింది. ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా ఆదివారం (ఏప్రిల్ 07) ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ సేన 29 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 235 పరుగుల భారీ లక్ష్య ఛేదనకలో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరిఇక ఢిల్లీ 8 వికెట్లు కోల్పోయి 205 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఐపీఎల్ 2024లో ముంబయి ఇండియన్స్ బోణి కొట్టింది. ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా ఆదివారం (ఏప్రిల్ 07) ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ సేన 29 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 235 పరుగుల భారీ లక్ష్య ఛేదనకలో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరిఇక ఢిల్లీ 8 వికెట్లు కోల్పోయి 205 పరుగులు మాత్రమే చేయగలిగింది. స్టబ్స్ (25 బంతుల్లో 71 నాటౌట్, 3 ఫోర్లు, 7 సిక్సర్లు ) మెరుపు ఇన్నింగ్స్ ఆడినా ప్రయోజనం లేకుండా పోయింది. లక్ష్యం మరీ ఎక్కువ కావడంతో స్టబ్స్ శ్రమ వృతా అయ్యింది. అంతకు ముందు ఓపెనర్ పృథ్వీ షా (66), పోరెల్ (41) ధాటిగా ఆడారు. ముంబయి బౌలర్లలో కొయెట్జీ 4 వికెట్లు తీయగా, బుమ్రా 2, షెపర్డ్ ఒక వికెట్ పడగొట్టారు. అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఓపెనర్ రోహిత్ శర్మ ( 27 బంతుల్లో49, 6 ఫోర్లు, 3 సిక్సర్లు), ఇషాన్ కిషన్ (42), కెప్టెన్ హార్దిక్ పాండ్యా(39), టిమ్ డేవిడ్ (45 నాటౌట్) ధాటిగా బ్యాటింగ్ చేశారు. ఆఖరి ఓవర్ లో విండీస్ ప్లేయర్ రొమారియో షెపర్డ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 10 బంతుల్లోనే 3 ఫోర్లు, 4 సిక్సర్ల సహాయంతో 39 పరుగులు రాబట్టాడు
ఢిల్లీకి ఇది నాలుగో ఓటమి
కాగా రిషబ్ పంత్ సారథ్యం లోని ఢిల్లీ జట్టు భారీ లక్ష్య ఛేదనలో ధాటిగా బ్యాటింగ్ ప్రారంభించింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ త్వరగా ఔటైనా పృథ్వీ షా భారీ షాట్లు ఆడాడు. పోరెల్ (41) కూడా నిలకడగా బ్యాటింగ్ చేశాడు. అయితే ఎన్నో ఆశలు పెట్టుకున్న కెప్టెన్ రిషబ్ పంత్ కేవలం ఒక్క పరుగుకే ఔటయ్యాడు. స్టబ్స్ భారీ సిక్స్ లతో విరుచుకు పడినా ప్రయోజనం లేకపోయింది.
ముంబై అభిమానుల హంగామా..
“𝘞𝘦 𝘸𝘢𝘯𝘵 𝘉𝘶𝘮𝘳𝘢𝘩” 🤩
Bas ye 💙#MumbaiMeriJaan #MumbaiIndians #MIvDC #ESADay #EducationAndSportsForAll | @ril_foundation | @Jaspritbumrah93 pic.twitter.com/jt7lJ8JDhT
— Mumbai Indians (@mipaltan) April 7, 2024
ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ ఎలెవన్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, మహ్మద్ నబీ, రొమారియో షెపర్డ్, పీయూష్ చావ్లా, జెరాల్డ్ కోయెట్జీ, జస్ప్రీత్ బుమ్రా.
ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ XI: రిషబ్ పంత్ (కెప్టెన్ & వికెట్ కీపర్), డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, అభిషేక్ పోరెల్, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, జే రిచర్డ్‌సన్, ఎన్రిక్ నార్ట్జే, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్.
బుమ్రా డెడ్లీ యార్కర్.. పృథ్వీషా క్లీన్ బౌల్డ్.. వీడియో
In English we say, it’s a Bumrah yorker. In poetry we say, 𝑎𝑎𝑗 𝑘𝑎𝑙 𝑝𝑎𝑜𝑛 𝑧𝑎𝑚𝑒𝑒𝑛 𝑝𝑎𝑟 𝑛𝑎ℎ𝑖 𝑝𝑎𝑑𝑡𝑒… 💥#MumbaiMeriJaan #MumbaiIndians #MIvDC #ESADay #EducationAndSportsForAllpic.twitter.com/UtVEbxFQeK
— Mumbai Indians (@mipaltan) April 7, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.