IPL 2024: ఢిల్లీకి మరో స్ట్రోకు.. బ్రూక్ తర్వాత ఐపీఎల్ నుంచి తప్పుకున్న మరో స్టార్ ప్లేయర్
రిషబ్ పంత్ ఏడాది తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోకి తిరిగి వస్తున్నాడు. ఐపీఎల్-2024లో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌కు పంత్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ విషయం సంగతి పక్కన పెడితే టోర్నీ ప్రారంభం కాకముందే ఢిల్లీ జట్టుకు భారీ ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఆ జట్టు స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ ఇటీవలే ఐపీఎల్ నుంచి వైదొలిగాడు

రిషబ్ పంత్ ఏడాది తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోకి తిరిగి వస్తున్నాడు. ఐపీఎల్-2024లో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌కు పంత్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ విషయం సంగతి పక్కన పెడితే టోర్నీ ప్రారంభం కాకముందే ఢిల్లీ జట్టుకు భారీ ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఆ జట్టు స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ ఇటీవలే ఐపీఎల్ నుంచి వైదొలిగాడు. ఇప్పుడు మరో స్టార్ ఆటగాడు ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ లుంగీ ఎన్గిడి ఐపీఎల్ 2024 నుంచి వైదొలిగినట్లు శుక్రవారం (మార్చి 15) ఐపీఎల్ ఓ ప్రకటన విడుదల చేసింది. గాయం కారణంగానే ఎన్‌గిడి ఐపీఎల్‌లో ఆడలేడని తెలుస్తోంది. వైవిధ్యం, కచ్చితత్వంతో బంతులు విసిరే ఎన్గిడి లేకపోవడం ఢిల్లీకి పెద్ద దెబ్బేనని చెప్పుకోవచ్చు. అతను చెన్నై సూపర్ కింగ్స్ రెండు టైటిల్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. 2022లో చెన్నై నుంచి ఢిల్లీకి మారిపోయాడు. మొత్తం 14 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి 25 వికెట్లు తీశాడీ ఫాస్ట్ బౌలర్.
కాగా ఎంగిడి స్థానంలో, ఆస్ట్రేలియన్ యంగ్ ఆల్ రౌండర్ జాక్ ఫ్రేజర్ మెక్‌గర్క్‌ను జట్టులో చేర్చుకుంది ఢిల్లీ. అతను తొలిసారి ఐపీఎల్‌లో ఆడనున్నాడు. అయితే ఎన్‌గిడీకి బదులు ఫ్రేజర్‌ని ఎంపిక చేయడం కాస్త ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎన్గిడి ఒక ఫాస్ట్ బౌలర్. ఫ్రేజర్ ఒక బ్యాటర్. లెగ్ స్పిన్ బౌలింగ్ కూడా చేయగలడు. అతను తన కుడి చేతితో బ్యాటింగ్ చేస్తాడు. ఫ్రేజర్ ఆస్ట్రేలియా తరపున రెండు ODI మ్యాచ్‌లు కూడా ఆడాడు కానీ ఇంకా T20 అరంగేట్రం చేయలేదు. అయితే బిగ్ బాష్ లీగ్‌లో ఆడిన అనుభవముంది. పంత్ ఈ సీజన్‌లో కెప్టెన్‌గా పునరాగమనం చేస్తున్నాడు. పంత్ 30 డిసెంబర్ 2022న కారు ప్రమాదానికి గురయ్యాడు దీని కారణంగా అతను చాలా కాలం పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. శస్త్రచికిత్స కూడా చేయించుకున్నాడు. ఈ కారణంగా అతను గత సీజన్‌లో ఐపీఎల్ ఆడలేదు.
🚨Delhi Capitals have signed talented Australian batter Jake Fraser-McGurk as replacement for the injured Lungi Ngidi.
The 21-year-old recently made his Australia debut against the West Indies. In the BBL, he scored 257 runs from 8 innings at a SR of 158.64 🔥#IPL2024… pic.twitter.com/XJjuPCp3pS
— Cricbuzz (@cricbuzz) March 15, 2024
Woke up to the news of JFM replacing Lungi Ngidi in Delhi Capitals
Excited to see him play , probably one of the big thing in coming times ❤️🦁
DC fans who should be our replacement for Harry Brook now 🤔#RishabhPant #ipl pic.twitter.com/cQek65UWkh
— Riseup Pant Popa (@riseup_pant17) March 15, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








