KKR vs SRH, IPL 2024: ఆ విధ్వంసకర ప్లేయర్ లేకుండానే బరిలోకి కోల్‌కతా.. హైదరాబాద్‌ షాక్ ఇచ్చేనా?

ఐపీఎల్ 2024 తొలి క్వాలిఫయర్ మ్యాచ్ మంగళవారం (మే 21) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. పాయింట్ల పట్టికలో టాప్ టు లో నిలిచిన కేకేఆర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ మ్యాచ్ లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌లోకి ప్రవేశిస్తుంది

KKR vs SRH, IPL 2024: ఆ విధ్వంసకర ప్లేయర్ లేకుండానే బరిలోకి కోల్‌కతా.. హైదరాబాద్‌ షాక్ ఇచ్చేనా?
KKR vs SRH, IPL 2024

Updated on: May 21, 2024 | 5:49 PM

ఐపీఎల్ 2024 తొలి క్వాలిఫయర్ మ్యాచ్ మంగళవారం (మే 21) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. పాయింట్ల పట్టికలో టాప్ టు లో నిలిచిన కేకేఆర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ మ్యాచ్ లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌లోకి ప్రవేశిస్తుంది. ఓడిన జట్టుకు మరో అవకాశం లభిస్తుంది. కాగా ఈ మెగా క్రికెట్ లీగ్‌లో బ్యాటింగ్ కారణంగానే ఇరు జట్లు అత్యధిక విజయాలు సాధించాయి. ముఖ్యంగా ఓపెనర్లు ఇరు జట్ల విజయాల్లో కీలక పాత్రలు పోషించారు. KKR తరఫున సునీల్ నరైన్-ఫిల్ సాల్ట్ ద్వయం అద్భుతంగా ఆడింది. అదే సందర్భంలో SRH తరఫున అభిషేక్ శర్మ-ట్రావిస్ హెడ్ ద్వయం మెరుపు ఆరంభాలను ఇస్తోంది. కాగా కీలకమైన క్వాలిఫయర్ మ్యాచ్‌కు ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు షాక్ తగిలింది. జట్టు స్టార్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ తన స్వదేశానికి అంటే ఇంగ్లాండ్‌కు తిరిగి వెళ్లిపోయాడు. మరి ఈ పరిస్థితుల్లో సాల్ట్ స్థానంలో ఓపెనింగ్ బాధ్యతలను ఎవరు తీసుకుంటారనేది KKR యాజమాన్యం ముందు ఉన్న పెద్ద ప్రశ్న. ఫిల్ సాల్ట్ ఈ సీజన్‌లో ఆడిన 12 మ్యాచ్‌ల్లో మొత్తం 435 పరుగులు చేశాడు. ఇందులో 4 అర్ధసెంచరీలు ఉన్నాయి.

 

ఇవి కూడా చదవండి

కాగా ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్‌కు ముందు ఇంగ్లండ్ జట్టు పాకిస్థాన్‌తో సిరీస్ ఆడనుంది. దీంతో ఇంగ్లండ్ ఆటగాళ్లందరూ మధ్యలోనే ఐపీఎల్ ను వదిలిపెట్టి స్వదేశానికి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఫిల్ సాల్ట్ కు బదులుగా ఆఫ్ఘనిస్థాన్ యువ బ్యాటర్ రహ్మానుల్లా గుర్బాజ్ పై ఓపెనింగ్ బాధ్యతలు ఇచ్చే అవకాశాలున్నాయి. ఈ సీజన్‌లో గుర్బాజ్‌కు ఒక్క మ్యాచ్‌ కూడా ఆడే అవకాశం రాలేదు. అయితే గత సీజన్‌లో మంచి ప్రదర్శన ఇచ్చాడు. ఆ సీజన్‌లో అతను మొత్తం 227 పరుగులు చేశాడు. కాబట్టి గుర్బాజ్ స్వయంగా సునీల్ నరైన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. ఐపీఎల్ చరిత్రలో కేకేఆర్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలవడం ఇదే తొలిసారి. ప్రస్తుత సీజన్‌లో శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలో టీమిండియా మంచి ప్రదర్శన చేసింది. ఆడిన 14 మ్యాచ్‌ల్లో 9 గెలిచి ప్లే ఆఫ్‌కు అర్హత సాధించింది. మరి ఇదే జోరును కొనసాగించి ముచ్చటగా మూడోసారి ఐపీఎల్ ఛాంపియన్ గా నిలుస్తుందో లేదో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..