IPL 2024: ఐపీఎల్‌లో సంచలనం.. గుజరాత్‌ను వీడనున్న హార్దిక్‌.. మళ్లీ ముంబై గూటికే.. డీల్‌ ఎన్ని కోట్లంటే?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 గురించి పెద్ద షాకింగ్‌ న్యూస్ బయటకు వచ్చింది. అదేంటంటే.. గుజరాత్ టైటాన్స్ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా మళ్లీ తన పాత జట్టు ముంబై ఇండియన్స్‌కు ఆడనున్నట్లు తెలుస్తోంది. అయితే కేవలం 2 సీజన్లకే హార్దిక్‌ గుజరాత్‌ జట్టును ను వీడడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.ఐపీఎల్‌ 2024 సీజన్‌ కోసం మినీవేలం వచ్చే నెలలో దుబాయ్‌ వేదికగా జరగనుంది.

IPL 2024: ఐపీఎల్‌లో సంచలనం.. గుజరాత్‌ను వీడనున్న హార్దిక్‌.. మళ్లీ ముంబై గూటికే.. డీల్‌ ఎన్ని కోట్లంటే?
Hardik Pandya
Follow us
Basha Shek

|

Updated on: Nov 25, 2023 | 9:38 AM

ఐసీసీ వన్డే ప్రపంచకప్ ముగిసిన వెంటనే ఆస్ట్రేలియాతో భారత్ టీ20 సిరీస్ ఆడుతోంది. ఇంతలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 గురించి పెద్ద షాకింగ్‌ న్యూస్ బయటకు వచ్చింది. అదేంటంటే.. గుజరాత్ టైటాన్స్ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా మళ్లీ తన పాత జట్టు ముంబై ఇండియన్స్‌కు ఆడనున్నట్లు తెలుస్తోంది. అయితే కేవలం 2 సీజన్లకే హార్దిక్‌ గుజరాత్‌ జట్టును ను వీడడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.ఐపీఎల్‌ 2024 సీజన్‌ కోసం మినీవేలం వచ్చే నెలలో దుబాయ్‌ వేదికగా జరగనుంది. అయితే దీనికి ముందు ప్రతిసారి లాగే ఈ ఏడాది కూడా ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్లను పరస్పరం ఆటగాళ్లను మార్చుకునేందుకు అవకాశమిచ్చారు. మొత్తం 10 ఫ్రాంచైజీలకు ట్రేడ్ విండో తెరిచారు. ఆదివారం (నవంబర్ 26) ఈ ట్రేడ్‌ విండ్‌ ముగుస్తుంది. నివేదికల ప్రకారం, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కేవలం 2 సీజన్ల తర్వాత గుజరాత్ టైటాన్స్‌తో సంబంధాలను తెంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. హార్దిక్ మరోసారి ముంబై ఇండియన్స్‌ జట్టులోకి పునరాగమనం చేస్తాడని చెబుతున్నారు. ఇందుకోసం ఇరు జట్ల మధ్య  15 కోట్ల రూపాయల డీల్ కుదిరిందని వార్తలు వస్తున్నాయి.

హార్దిక్ ఐపీఎల్ కెరీర్ 2014-15లో ముంబై ఫ్రాంచైజీతోనే ప్రారంభమైంది. అయితే రెండు విజయవంతమైన సీజన్ల తర్వాత హార్దిక్ గుజరాత్ ను ఎందుకు విడిచిపెట్టారనే ప్రశ్న చాలామందిలో తలెత్తుతోంది. కెప్టెన్‌ హార్దిక్, గుజరాత్‌ టీమ్ మేనేజ్‌మెంట్ మధ్య కొంతకాలంగా విభేదాలు ఉన్నాయని, అందుకే హార్దిక్ ఈ నిర్ణయం తీసుకున్నారని బీసీసీఐ అధికారిని ఉటంకిస్తూ టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ కథనం ప్రచురించింది. ఇదిలా ఉంటే గుజరాత్ కోచ్ ఆశిష్ నెహ్రా, హార్దిక్ మధ్య సంబంధాల్లో చీలిక వచ్చిందా.. లేక ఫ్రాంచైజీతో సంబంధాలు చెడిపోయాయా అనే విషయంపై స్పష్టత లేదు. ఐపీఎల్ 2023 సీజన్‌లోనే అన్నీ సరిగ్గా లేవని, గత 4 నెలల్లో ముంబైతో ఒప్పందం కుదుర్చుకున్నారని తెలుస్తోంది. హార్దిక్ 2021 సీజన్ వరకు ముంబై జట్టులోనే ఉన్నాడు. కానీ 2022 సీజన్‌కు ముందు కొత్త జట్లలో ఒకటైన గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. హార్దిక్ నాయకత్వంలో గుజరాత్ తొలి సీజన్‌లోనే ఛాంపియన్‌గా నిలిచింది. 2023 సీజన్‌లోనూ పాండ్యా జట్టు ఫైనల్‌కు చేరుకుంది. అయితే ఇక్కడ చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోయి రన్నరప్‌తో సరిపెట్టుకుంది.

ఇవి కూడా చదవండి

విభేదాలే కారణమా?

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.