Imad Wasim: బాబర్‌తో ఫైట్‌.. ప్రపంచకప్‌లో నో ఛాన్స్‌.. రిటైర్మెంట్‌ ప్రకటించి షాకిచ్చిన స్టార్ ఆల్‌రౌండర్‌

ప్రపంచకప్ 2023 నుండి పాకిస్తాన్ క్రికెట్‌లో ప్రతిరోజూ ఏదో ఒకటి జరుగుతోంది. బాబర్ అజామ్ కెప్టెన్సీలో పాకిస్థాన్ ప్రదర్శన చాలా పేలవంగా ఉంది. ఆ జట్టు సెమీ-ఫైనల్‌కు చేరుకోలేకపోయింది. అప్పటి నుంచి జట్టులో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. బాబర్ కెప్టెన్సీ నుండి తప్పుకున్నాడు. కొత్త చీఫ్ సెలెక్టర్ కోచ్‌ను కూడా నియమించారు

Imad Wasim: బాబర్‌తో ఫైట్‌.. ప్రపంచకప్‌లో నో ఛాన్స్‌.. రిటైర్మెంట్‌ ప్రకటించి షాకిచ్చిన స్టార్ ఆల్‌రౌండర్‌
Imad Wasim
Follow us
Basha Shek

|

Updated on: Nov 25, 2023 | 7:17 AM

ప్రపంచకప్ 2023 నుండి పాకిస్తాన్ క్రికెట్‌లో ప్రతిరోజూ ఏదో ఒకటి జరుగుతోంది. బాబర్ అజామ్ కెప్టెన్సీలో పాకిస్థాన్ ప్రదర్శన చాలా పేలవంగా ఉంది. ఆ జట్టు సెమీ-ఫైనల్‌కు చేరుకోలేకపోయింది. అప్పటి నుంచి జట్టులో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. బాబర్ కెప్టెన్సీ నుండి తప్పుకున్నాడు. కొత్త చీఫ్ సెలెక్టర్ కోచ్‌ను కూడా నియమించారు. అంతా ఆగిపోయిన తర్వాత ఇప్పుడు పాకిస్థాన్ క్రికెట్ నుంచి మరో షాకింగ్‌ న్యూస్‌ వచ్చింది. ఆ జట్టు స్టార్‌ ఆల్‌రౌండర్ ఇమాద్ వాసిమ్ రిటైర్మెంట్ ప్రకటించాడు. 34 ఏళ్ల లెఫ్టార్మ్ స్పిన్-ఆల్‌రౌండర్ ఇమాద్ వాసిమ్ నవంబర్ 24 శుక్రవారం అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. పాకిస్థాన్ తరఫున వన్డే, టీ20 సహా 121 మ్యాచ్‌లు ఆడిన ఇమాద్.. తన నిర్ణయాన్ని వివరిస్తూ ఓ ప్రకటన విడుదల చేశాడు. గత కొన్ని రోజులుగా తాను ఈ నిర్ణయం గురించి ఆలోచిస్తున్నానని, అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకోవడానికి ఇదే సరైన సమయమని చెప్పాడు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపిన అతడు, పాకిస్థాన్ తరఫున ఆడడం ద్వారా తన కల నెరవేరిందని అన్నాడు.

కాగా పాక్ జట్టు స్పిన్ విభాగంలో ఇమాద్ ప్రపంచ కప్ కోసం తిరిగి జట్టులోకి వస్తాడని ఊహాగానాలు వచ్చాయి, భారత గడ్డపై మంచి ప్రతిభ చూపిస్తాడని పాక్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఆశ పడ్డారు. అయితే బాబర్ అజామ్‌ కారణంగా ఇమాద్‌ కు ప్రపంచ కప్‌ జట్టులో చోటు దక్కలేదని ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు బాబర్ స్వయంగా పాకిస్తాన్ జట్టు కెప్టెన్సీ నుండి దిగిపోయాడు. అయితే అనూహ్యంగా ఇమాద్ కూడా అంతర్జాతీయ క్రికెట్‌ కు రిటైర్మెంట్ ప్రకటించి షాక్ ఇచ్చాడు. కొత్త కోచింగ్ సిబ్బంది, కెప్టెన్లకు శుభాకాంక్షలు తెలిపాడు. ఇమాద్ ఈ ఏడాది ఏప్రిల్‌లో న్యూజిలాండ్‌తో పాకిస్థాన్ తరఫున తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఇది అతనికి చివరి టీ20 ఇంటర్నేషనల్. బాబర్‌తో పొసగకపోవడమే ఇమాద్‌ కెరీర్‌ దెబ్బ తినిందని ప్రచారం జరిగింది. వారిద్దరూ ఒకప్పుడు పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో కరాచీ కింగ్స్‌లో భాగంగా ఉన్నారు, ఇక్కడ ఇమాద్ కెప్టెన్సీలో కరాచీ టైటిల్ గెలుచుకుంది. బాబర్ పాకిస్తాన్ కెప్టెన్ అయిన తరువాత కూడా ఇమాద్‌ కరాచీకి కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే అక్కడి నుంచే ఇద్దరి మధ్య సంబంధాలు క్షీణించడం ప్రారంభించాయి.

ఇవి కూడా చదవండి

ఇమాద్ వసీమ్ ట్వీట్..

ఇమాద్ వాసిమ్‌ను మొదటి వన్డే లు, ఆ తరువాత T20ల నుంచి తొలగించారు. లెఫ్టార్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్ ఇమాద్ 55 వన్డేల్లో 44 వికెట్లు, 66 టీ20ల్లో 65 వికెట్లు పడగొట్టాడు. ఎడమ చేతితో బ్యాటింగ్ చేస్తూ వన్డేల్లో 986 పరుగులు, టీ20లో 486 పరుగులు చేశాడు. ఇమాద్ ప్రపంచంలోని వివిధ T20, T10 లీగ్‌లలో ఆడుతూనే ఉన్నాడు.

కుటుంబ సభ్యులతో ఇమాద్ వసీమ్..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.