IPL 2024: మళ్లీ ముంబై గూటికే హార్దిక్.. గుజరాత్‌కు కెప్టెన్‌గా డబుల్ సెంచరీ హీరో.!
వన్డే ప్రపంచకప్ ముగిసింది. భారత్, ఆస్ట్రేలియా టీ20 సిరీస్ కొనసాగుతోంది. ఈలోగా ఐపీఎల్ 2024 వేలానికి కూడా సన్నద్దమవుతున్నాయి ఫ్రాంచైజీలు. ఇందులో భాగంగానే వచ్చే ఐపీఎల్ వేలానికి ముందుగా ఓ షాకింగ్ ట్రేడ్ జరగబోతోందని టాక్ వినిపిస్తోంది. వేలానికి ముందుగా ఫ్రాంచైజీలు డైరెక్ట్ స్వాప్ ద్వారా ఆటగాళ్లను పరస్పరం మార్చుకునే అవకాశం ఉంది.
వన్డే ప్రపంచకప్ ముగిసింది. భారత్, ఆస్ట్రేలియా టీ20 సిరీస్ కొనసాగుతోంది. ఈలోగా ఐపీఎల్ 2024 వేలానికి కూడా సన్నద్దమవుతున్నాయి ఫ్రాంచైజీలు. ఇందులో భాగంగానే వచ్చే ఐపీఎల్ వేలానికి ముందుగా ఓ షాకింగ్ ట్రేడ్ జరగబోతోందని టాక్ వినిపిస్తోంది. వేలానికి ముందుగా ఫ్రాంచైజీలు డైరెక్ట్ స్వాప్ ద్వారా ఆటగాళ్లను పరస్పరం మార్చుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ హార్దిక్ పాండ్యాను తిరిగి తమ గూటికి తెచ్చుకోవాలని చూస్తున్నట్టు సమాచారం. గుజరాత్‌తో పాండ్యాకు ఉన్న రూ. 15 కోట్ల ఒప్పందానికే ముంబై డీల్ కుదుర్చుకుందట. ఈ డీల్‌తో పాటు పాండ్యా ప్రత్యేకంగా మరింత ఫీజు కూడా అంబానీ ఫ్రాంచైజీ చెల్లిస్తుందని సమాచారం.
గుజరాత్ కెప్టెన్‌గా టీమిండియా యువ సంచలనం..
హార్దిక్ పాండ్యా విషయం సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతున్నా.. అటు గుజరాత్ కానీ.. ఇటు ముంబై కానీ దీనిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఒకవేళ పాండ్యా ముంబైలో తిరిగి చేరితే.. గుజరాత్ టైటాన్స్ పగ్గాలు టీమిండియా యువ సంచలనం శుభ్‌మాన్ గిల్ చేపట్టనున్నాడని తెలుస్తోంది. కాగా, ఐపీఎల్ 2021 సమయంలో ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యాను రిలీజ్ చేసింది. ఆ తర్వాత గుజరాత్ అతడ్ని కెప్టెన్ చేయగా.. ఆ వెంటనే హార్దిక్ సారధ్యంలో తొలి టైటిల్ గెలుపొందింది. అనంతరం నెక్స్ట్ ఐపీఎల్‌లో కూడా జట్టును ఫైనల్స్‌కు చేర్చాడు హార్దిక్. మరి ఇంతకీ హార్దిక్ ముంబై గూటికి వెళ్తాడా.? గుజరాత్ నిజంగానే హార్దిక్‌ను వదులుకుంటుందా.?
హార్దిక్ డీల్ ఇలా..
Hardik Pandya deal (Espncricinfo):
– Mumbai Indians will pay (15 + X) cr to GT.
– Hardik Pandya will get upto X Cr.
– X is unknown…!!! pic.twitter.com/eSMqsxU7Gm
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 25, 2023
గిల్ గుజరాత్ కెప్టెన్.?
Shubman Gill is set to Captain Gujarat Titans in IPL 2024. It’s great news for him 😍#IPLAuction #IPL #CricketTwitter pic.twitter.com/4nJ432rdvk
— Sknowpedia (@sknowpedia_) November 25, 2023
మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..