IPL 2024: హార్దిక్ ఇన్.. రోహిత్ ఔట్.! ఐపీఎల్ 2024 వేలంలో ఆ ముగ్గురే అందరి టార్గెట్..
వన్డే ప్రపంచకప్ ముగిసింది. ఇప్పుడు ఫోకస్ అంతా కూడా ఐపీఎల్ 2024 వేలంపైకి షిఫ్ట్ అయింది. మరికొద్ది గంటల్లో ఫ్రాంచైజీల రిటెన్షన్ లిస్టుపై క్లారిటీ వచ్చేయనుంది. అలాగే ప్రపంచకప్ బెస్ట్ ప్లేయర్స్‌పై కూడా ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ఇదిలా ఉంటే.. ఈ ఐపీఎల్ 2024కి ముందుగా అనూహ్య మార్పులు, పలు సంచలనాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. భవిష్యత్తును చూసుకుంటూ ఐపీఎల్ టీంలు భారీ మార్పులు చేయబోతున్నాయ్.
వన్డే ప్రపంచకప్ ముగిసింది. ఇప్పుడు ఫోకస్ అంతా కూడా ఐపీఎల్ 2024 వేలంపైకి షిఫ్ట్ అయింది. మరికొద్ది గంటల్లో ఫ్రాంచైజీల రిటెన్షన్ లిస్టుపై క్లారిటీ వచ్చేయనుంది. అలాగే ప్రపంచకప్ బెస్ట్ ప్లేయర్స్‌పై కూడా ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ఇదిలా ఉంటే.. ఈ ఐపీఎల్ 2024కి ముందుగా అనూహ్య మార్పులు, పలు సంచలనాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. భవిష్యత్తును చూసుకుంటూ ఐపీఎల్ టీంలు భారీ మార్పులు చేయబోతున్నాయ్.
ఐపీఎల్ వేలం ఎప్పుడంటే..?
దుబాయ్ వేదికగా ఐపీఎల్ 2024 మినీ వేలం డిసెంబర్ 19న జరగనుంది. ఫ్రాంచైజీలు ఎవరిని అట్టిపెట్టుకోవాలి.? ఎవరి వదిలించుకోవాలి.? అనే దానిపై క్లారిటీ నవంబర్ 26, సాయంత్రం 4 గంటల డెడ్‌లైన్ ముగిసిన వెంటనే తెలుస్తుంది.
పలు సంచలనాలు.. భారీ మార్పులు..
పది ఫ్రాంచైజీలు జట్టు బలాబలాలను దృష్టి పెట్టుకుని బేరీజులు వేసుకుంటూ ఎవరిని తీసేయాలి.? ఎవరిని అట్టిపెట్టుకోవాలి.? అనే నిర్ణయాలను తీసుకునే పనిలో పడ్డాయి. ఈ క్రమంలోనే గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. తిరిగి ముంబై జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రచారం సాగుతోంది. అలాగే జోఫ్రా ఆర్చర్‌కు ఉద్వాసన పలకబోతోంది ముంబై జట్టు. అయితే హార్దిక్ ముంబైలోకి చేరితే.. రోహిత్ కెప్టెన్సీ ఉంటుందా.? ఊడుతుందా.? అనేది తెలియాల్సి ఉంది.
అటు పంజాబ్ కింగ్స్ అత్యధిక ధర రూ.18.50 కోట్లకు కొనుగోలు చేసిన సామ్ కర్రన్‌ను రిలీజ్ చేయడంతో పాటు కెప్టెన్ ధావన్‌కు కూడా గుడ్ బై చెప్పాలని చూస్తోందట. అలాగే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌ను వదిలించుకోబోతోంది. ఇక రూ.13.25 కోట్లతో కొనుగోలు చేసిన హ్యారీ బ్రూక్‌ను సన్‌రైజర్స్.. కేకేఆర్ ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్.. మనీష్ పాండే, పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్, నాగర్కోటిలను ఢిల్లీ.. స్టోయినిస్, మనదీప్ సింగ్, శార్దూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్, ఫెర్గూసన్, సౌథీ, షకీబ్, లిట్టన్ దాస్, డేవిడ్ వీస్, మ్యాథ్యూ షార్ట్.. ఈసారి వేలంలో కనిపించనున్నారు.
ఇదిలా ఉంటే.. ఐపీఎల్ 2024 వేలంలో ముగ్గురు ప్లేయర్స్‌ను మొత్తం ఫ్రాంచైజీలు టార్గెట్ చేయబోతున్నాయి. ఆస్ట్రేలియాకు వన్డే వరల్డ్‌కప్ అందించడంలో కీలకంగా వ్యవహరించిన ఓపెనర్ ట్రావిస్ హెడ్‌పై వేలంలో అన్ని ఫ్రాంచైజీలు దృష్టి సారించే అవకాశం ఉంది. అలాగే న్యూజిలాండ్ బ్యాటర్ రచిన్ రవీంద్ర, ఎనిమిదేళ్ల తర్వాత వేలానికి వస్తోన్న ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్‌పై కూడా ఫ్రాంచైజీలు కన్నేయనున్నాయి.
Go for any one @RCBTweets#IPLAuction pic.twitter.com/aUK6jbzob4
— 🏌️cult🚬 (@cultismm) November 25, 2023
మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..