IPL 2023: లక్నోకు ‘బై..బై’.. కేకేఆర్‌కు ‘హై..హై’ చెప్పేసిన గంభీర్.. కీలక నిర్ణయం.!
Gautam Gambhir: లక్నో సూపర్ జెయింట్స్ టీమ్‌కు మెంటర్‌గా నియమించిన సంజీవ్ గోయంకాకు గౌతమ్ గంభీర్ కృతజ్ఞతలు తెలిపారు. లక్నో టీంతో తన జర్నీ ముగిసిందని లక్నో ఫ్యాన్స్ చూపిన ప్రేమాభిమానాలు తనకు ఆనందాన్ని కలిగించాయని గంభీర్ తెలిపాడు. రానున్న ఐపీఎల్ సీజన్‌లో లక్నో మంచి ప్రదర్శన కనబరచాలని కోరుకుంటున్నట్లు గంభీర్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. కాగా, అంతకుముందు 2011 నుంచి 2017 వరకు గౌతమ్ గంభీర్ కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆడాడు.

IPL 2023, Gautam Gambhir: మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ లక్నో సూపర్ జెయింట్స్‌ను వీడారు. ఐపీఎల్‌లో రెండు సంవత్సరాలుగా లక్నో సూపర్ జెయింట్స్ టీంకు మెంటర్‌గా ఉన్నాడు గౌతమ్ గంభీర్. ఆ టీమ్‌కు గౌతమ్ మెంటర్‌గా ఉన్న సమయంలోనే కీలక విజయాలను సాధించింది. ఇక ఐపీఎల్ 2024కు ముందు గంభీర్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు గుడ్ బై చెప్పాడు. తన మాజీ టీమ్ కోల్‌కతా నైట్ రైడర్స్‌కు గౌతమ్ గంభీర్ మళ్లీ మెంటర్‌గా వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని కేకేఆర్‌తో పాటు, లక్నో జట్లు అధికారికంగా ప్రకటించాయి.
తాజాగా కోల్‌కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ టీమ్‌కు గౌతమ్ గంభీర్ మెంటర్‌గా వ్యవహరించనున్నాడు. 2021 డిసెంబర్‌లో గౌతమ్ గంభీర్‌ను లక్నో టీమ్‌కు మెంటర్‌గా నియమించింది. ఇదిలా ఉంటే.. కేకేఆర్ జట్టు గంభీర్ సారధ్యంలోనే రెండుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ నిలిచింది. ఇక 2018లో కెప్టెన్సీ నుంచి వైదొలిగిన గంభీర్ ఆ తర్వాత ఢిల్లీ టీంకు ఆడాడు. దాని తర్వాత రిటైర్మెంట్ తీసుకున్న గంభీర్ 2021లో లక్నో టీంకు మెంటర్‌గా ఉన్నాడు. ప్రస్తుతం గౌతమ్ గంభీర్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్‌కు మెంటర్‌గా నియమించారు. ఈ విషయాన్ని గౌతమ్ గంభీర్ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం లెజెండ్స్ క్రికెట్ లీగ్ మ్యాచ్‌లో ఇండియా క్యాపిటల్స్ తరపున గౌతమ్ గంభీర్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
లక్నో సూపర్ జెయింట్స్ టీమ్‌కు మెంటర్‌గా నియమించిన సంజీవ్ గోయంకాకు గౌతమ్ గంభీర్ కృతజ్ఞతలు తెలిపారు. లక్నో టీంతో తన జర్నీ ముగిసిందని లక్నో ఫ్యాన్స్ చూపిన ప్రేమాభిమానాలు తనకు ఆనందాన్ని కలిగించాయని గంభీర్ తెలిపాడు. రానున్న ఐపీఎల్ సీజన్‌లో లక్నో మంచి ప్రదర్శన కనబరచాలని కోరుకుంటున్నట్లు గంభీర్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. కాగా, అంతకుముందు 2011 నుంచి 2017 వరకు గౌతమ్ గంభీర్ కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆడాడు. గంభీర్ గతంలో రెండుసార్లు కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టడమే కాకుండా ఐదుసార్లు ప్లే-ఆఫ్స్‌కి క్వాలిఫై అయ్యేలా చేశాడు.
Welcome home, mentor @GautamGambhir! 🤗
Full story: https://t.co/K9wduztfHg#AmiKKR pic.twitter.com/inOX9HFtTT
— KolkataKnightRiders (@KKRiders) November 22, 2023
2014లో ఛాంపియన్స్ లీగ్ ఫైనల్ కు వెళ్లింది. కోల్‌కతా నైట్ రైడర్స్‌కు తిరిగి రావడం తనకు ఎనలేని సంతోషాన్ని ఇస్తుందన్నాడు గౌతమ్ గంభీర్. ప్రస్తుతం నేను ఆకలితో ఉన్నాను, నేను వచ్చేశాను, నా జెర్సీ నెంబర్ 23 అంటూ గంభీర్ చెప్పుకొచ్చాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..