DC vs MI, IPL 2024: దంచికొట్టిన ఢిల్లీ బ్యాటర్లు.. ముంబై ముందు భారీ టార్గెట్.. ఓడితే అంతే సంగతులు

Delhi Capitals vs Mumbai Indians: ఢిల్లీ బ్యాటర్లు అదరగొట్టారు. ముంబై ఇండియన్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో ఆ జట్టు బ్యాటర్లు తలా ఒక చేయి వేశారు. ముఖ్యంగా ఓపెనర్‌ జేక్ ఫ్రేజర్ మెక్ గర్క్‌ ( 27 బంతుల్ 84, 11 ఫోర్లు, 6 సిక్సర్లు) ముంబయి బౌలర్లను ఊచకోత కోశాడు. మరో ఓపెనర్ అభిషేక్ పోరెల్‌ (36), షైయ్ హోప్‌ (41),

DC vs MI, IPL 2024: దంచికొట్టిన ఢిల్లీ బ్యాటర్లు.. ముంబై ముందు భారీ టార్గెట్.. ఓడితే అంతే సంగతులు
Delhi Capitals
Follow us

|

Updated on: Apr 27, 2024 | 6:13 PM

Delhi Capitals vs Mumbai Indians: ఢిల్లీ బ్యాటర్లు అదరగొట్టారు. ముంబై ఇండియన్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో ఆ జట్టు బ్యాటర్లు తలా ఒక చేయి వేశారు. ముఖ్యంగా ఓపెనర్‌ జేక్ ఫ్రేజర్ మెక్ గర్క్‌ ( 27 బంతుల్ 84, 11 ఫోర్లు, 6 సిక్సర్లు) ముంబయి బౌలర్లను ఊచకోత కోశాడు. మరో ఓపెనర్ అభిషేక్ పోరెల్‌ (36), షైయ్ హోప్‌ (41), రిషబ్ పంత్‌ (29), స్టబ్స్‌ (48 నాటౌట్), అక్షర్ పటేల్ ‌ (11 నాటౌట్) ఇలా క్రీజులోకి వచ్చిన వారంతా మెరుపులు మెరిపించారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో వుడ్‌, బుమ్రా, పియూష్‌, నబీ తలో వికెట్‌ తీశారు. అయితే అందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. మరీ ముఖ్యంగా కెప్టెన్ హార్దిక్ పాండ్యా కేవలం 20 ఓవర్లలోనే 41 పరుగులు సమర్పించుకోవడం గమనార్హం.

ఇవి కూడా చదవండి

ఈ మ్యాచ్ లో తొలి బంతి నుంచే ఢిల్లీ క్యాపిటల్స్ దూకుడుగా ఆడింది. జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్ 15 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. పవర్ ప్లేలోనే 92 పరుగుల భాగస్వామ్యం జోడించారు.  చివరగా ఫ్రేజర్ మెక్‌గర్క్ 27 బంతుల్లో 84 పరుగులు చేసి పియూష్ చావ్లా చేతిలో ఔట్ అయ్యాడు. ఈ ఇన్నింగ్స్‌లో  11 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. అభిషేక్ పోరెల్ 36 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. తర్వాత షాయ్ హోప్, రిషబ్ పంత్ జట్టు స్కోరును ముందుకు తీసుకెళ్లారు. ఇద్దరూ 22 బంతుల్లోనే అర్ధ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 257 పరుగులు చేసి ముంబైకు గట్టి టార్గెట్ నే విధించింది.

ఇరు జట్ల ప్లేయింగ్ 11 ఇదే:

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, కుమార్ కుషాగ్రా, షాయ్ హోప్, రిషబ్ పంత్(కెప్టెన్, కీపర్), ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, లిజాద్ విలియమ్స్, ముఖేష్ కుమార్, ఖలీల్ అహ్మద్.

ఇంపాక్ట్ ప్లేయర్లు:

రసిఖ్ దార్ సలామ్, ప్రవీణ్ దూబే, విక్కీ ఓస్త్వాల్, రికీ భుయ్, సుమిత్ కుమార్.

ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్(కీపర్), తిలక్ వర్మ, నెహాల్ వధేరా, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), టిమ్ డేవిడ్, మహ్మద్ నబీ, పీయూష్ చావ్లా, ల్యూక్ వుడ్, జస్ప్రీత్ బుమ్రా, నువాన్ తుషార.

ఇంపాక్ట్ ప్లేయర్లు:

సూర్యకుమార్ యాదవ్, నమన్ ధీర్, షామ్స్ ములానీ, డెవాల్డ్ బ్రీవిస్, కుమార్ కార్తికేయ.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..