- Telugu News Sports News Cricket news IPL 2024 Eliminator Rcb Vs Rr Performance In Narendra Modi Stadium Ahmedabad Check here in Telugu
IPL 2024, RCB Vs RR: మోడీ మైదానంలో తగ్గేదేలే అంటోన్న రాజస్థాన్, బెంగళూరు.. రికార్డులు ఇవే..
IPL 2024 Eliminator: బుధవారం ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ఈ స్టేడియంలో ఇరు జట్ల ప్రదర్శన ఎలా ఉందో ఓసారి చూద్దాం..
Updated on: May 22, 2024 | 7:28 AM

ఐపీఎల్ 17వ ఎడిషన్ చివరి దశకు చేరుకుంది. లీగ్ దశలో మొత్తం 70 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. మంగళవారం జరిగిన తొలి క్వాలిఫయర్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో టేబుల్ టాపర్ కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడడంతో ఇప్పుడు ప్లేఆఫ్‌లు ప్రారంభమయ్యాయి. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఘన విజయం సాధించి, ఫైనల్‌కు చేరుకుంది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రెండో క్వాలిఫయర్‌లో నేడు గెలిచిన జట్టుతో శుక్రవారం ఢీ కొట్టనుంది.

కాగా, నేడు ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది.

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఎలా రాణించాయో చూస్తే.. నరేంద్ర మోదీ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ 15 మ్యాచ్‌లు ఆడింది.

ఈ 15 మ్యాచ్‌ల్లో ఆ జట్టు 9 గెలిచి 5 ఓడిపోయింది. ఒక మ్యాచ్ టై కావడంతో రాజస్థాన్ సూపర్ ఓవర్‌లో విజయం సాధించింది. ఈ మైదానంలో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 4 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, ఛేజింగ్‌లో 5 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఈ మైదానంలో జట్టు అత్యధిక స్కోరు 201 పరుగులు కాగా, అత్యల్ప స్కోరు 102 పరుగులు.

ఈ మైదానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్రదర్శనను పరిశీలిస్తే... ఈ మైదానంలో ఆర్సీబీ ఇప్పటి వరకు కేవలం 5 మ్యాచ్ లు మాత్రమే ఆడింది. ఇందులో ఆ జట్టు 3 గెలిచి 2 ఓడిపోయింది.

ఈ గ్రౌండ్‌లో RCB మొదట బ్యాటింగ్ చేసినప్పుడు 1 మ్యాచ్‌లో, ఛేజింగ్‌లో 2 మ్యాచ్‌లు గెలిచింది. నరేంద్ర మోదీ స్టేడియంలో RCB అత్యధిక స్కోరు 206 పరుగులు, అత్యల్ప స్కోరు 145 పరుగులు.





























